సొగసైన మెడవంపు

మెడ చుట్టూ నగలు వేసుకున్నంత మాత్రాన అందంగా ఉండరు... ముఖారవిందం కోసం తీసుకున్న జాగ్రత్తల్లో కొన్ని తీసుకున్నా... మెడ నలుపు పోయి అందంగా తయారవుతుంది. ఏ నగా లేకపోయినా మీ మెడ పచ్చగా మెరిసిపోతుంది. అందుకోసం కొన్ని చిట్కాలు...
జుట్టుకు వాడే ప్రతి కెమికల్ మెడమీద ప్రభావం చూపుతుంది. చుండ్రు ఎక్కువగా ఉంటే రాలిపోయి మెడ మీద వైట్‌హెడ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు జుట్టుకు జాగ్రత్తలుతీసుకోవాలి.
- బియ్యపు పిండిలో వెనిగర్ కలిపి మెడకు అప్లై చేయయాలి. 15 నిమిషాలు ఆగి కడిగేయాలి.
- కీరా, నిమ్మరసం రెండూ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. అందులో పసుపు వేసి మెడ చుట్టూ నెమ్మదిగా మర్దనా చేయాలి. 20 నిమిషాల తరువాత కడిగేస్తే మెడపై నలుపుదనం తగ్గుతుంది.
- సగం నిమ్మకాయ రసం తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, పసుపు వేయాలి. మెడ చుట్టూ ఈ మిశ్రమాన్ని మసాజ్ చేయాలి.
- ముల్తానీ మట్టికి రోజ్‌వాటర్ జత చేసి మెడమీద అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత కడిగేయాలి.
- ఎండలో తిరిగి తిరిగి వచ్చినప్పుడు... గోరు నీటితో మెడను శుభ్రం చేసుకోవాలి.
- కలబంద గుజ్జులో పసుపు, శనగపిండి కలిపి మెడచుట్టూ ప్యాక్‌లాగా పట్టించాలి. తరువాత కాటన్ బట్టను గోరు నీటిలో ముంచి ప్యాక్‌ను తుడిచేయాలి.
- ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే మెడ చర్మం నునుపుగా మారుతుంది.
- వారానికి రెండుసార్లు గుడ్డులోని తెల్లసొనను మెడ వెనుక భాగానికి పట్టించి... సున్నితంగా రుద్దాలి. కొద్దిసేపటి తరువాత గోరు నీటితో చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి.
- మెడ నల్లగా అయితే బొప్పాయి గుజ్జును ఫేస్‌ప్యాక్‌గా వేసుకోవాలి. రంగు మారడమే కాకుండా మృదుత్వం కూడా వస్తుంది.
- నిమ్మరసం, ఉప్పు, పసుపు కలిపి పేస్టులా చేసుకుని దాన్ని మెడకు పట్టించి మసాజ్ చేయాలి.
- చలికాలంలో పెసరపిండి లేదా సున్నిపిండిని మెంతిరసంలో కలిపి మెడకు పట్టించాలి. కొద్దిసేపటి తరువాత శుభ్రం చేయాలి.
- బియ్యం కడిగిన నీటితో 15 నిమిషాలపాటు మెడపై మర్దనా చేస్తే నలుపుదనం పోతుంది.
- మెంతి ఆకులను పేస్ట్‌లాగా చేసుకోవాలి. దానికి శనగపిండిని కలిపి మెడకు నెమ్మదిగా మర్దనా చేయాలి. 15 నుంచి 20 నిమిషాల తరువాత కడిగేయాలి.
Other News