Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, May 23, 2013
 


Home >> Features >> Aadabidda


ఫ్రెండే ఇలా అంటే..?

sad_m talangana patrika telangana culture telangana politics telangana cinemaనేను పదకొండు సంవత్సరాలుగా ఒకే కంపెనీలో పనిచేస్తున్నాను. బయట ఫ్రెండ్స్ తక్కువ. ఆఫీసులోని అమ్మాయే నా బెస్ట్ ఫ్రెండ్. మామూలుగా నేను చనువు ఎక్కువ తీసుకుంటాను నా అనుకునే వాళ్ల దగ్గర. అలానే ఆమె దగ్గర కూడా అదేవిధంగా ప్రవర్తించాను. అంటే.. తన పెన్, దువ్వెన, లిప్‌స్టిక్ ఇలా. తను కూడా నా వస్తువులను ఉపయోగించుకునేది. ఏ రోజు నేనేమి అనలేదు. కానీ ఈ మధ్య నా ఫ్రెండ్.. తన వస్తువులను ఉపయోగించకూడదని అంది. చాలా బాధ అనిపించింది. ఇన్ని రోజులుగా లేనిది ఈ రోజు తనపర బేధాలు గుర్తుకొచ్చాయా అనిపించింది. ఆ తర్వాత రోజు నుంచి మళ్లీ ఏం జరగనట్టే ప్రవర్తిస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి?

- ఓ సోదరి


ఫ్రెండ్స్ అన్న తర్వాత ఒకరికొకరు అన్నట్లుగానే ఉంటారు. కానీ ఎంత క్లోజ్ అయినా కొన్ని పరిధులు పాటించక తప్పదు. ఎందుకంటే ఇద్దరి మనస్తత్వాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈ రోజు ఉన్న ఆలోచన రేపు ఉండకపోవచ్చు. కాబట్టి కొంత వరకు దూరంగా ఉండడం మంచిది. మీ ఫ్రెండ్ కూడా మీ రిలేషన్‌షిప్‌లో ఫార్మాలిటీస్ పాటించాలనుకుంటుందేమో! అదే చేస్తే సరిపోతుంది కదా! అయినా కొన్ని వస్తువులు అంటే.. లిప్‌స్టిక్, దువ్వెన ఇలాంటి వాటిని షేర్ చేసుకోకపోవడమే మంచిది. మీ ఫ్రెండ్ చెప్పిన దాంట్లో తప్పులేదు. అలా అన్న తర్వాత కూడా తను ఏమీ జరగన్నట్టే ఉందంటే.. మీరు బాధపడ్డట్టు తను భావించకపోవచ్పు. సో.. మీరు కూడా ఏం జరగలేదనే భావనలో ఉండడం బెటర్. మీ ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేయండి. మంచి ఫ్రెండ్ దొరకడం కష్టం. కాబట్టి ఇలాంటి చిన్న విషయాల వల్ల వారిని వదులుకోవద్దు.

నా వయసు 16 సంవత్సరాలు. పదవతరగతి చదువుతున్నాను. నాకు మా ఫ్రెండంటే చాలా ఇష్టం. అది నా వయసుదే. చిన్నప్పటి నుంచి ఒకే బెంచ్. ఇక్కడ సమస్య నాది కాదు, మా ఫ్రెండ్‌ది. చిక్కల్లా వాళ్ల కుటుంబంతోటే. తండ్రి కుటుంబాన్ని పట్టించుకోడు. తల్లి కూడా ఇవేమీ పట్టనట్లుగానే ప్రవర్తిస్తుంది. వాళ్ల ప్రవర్తనతో విసిగిపోయిన నా స్నేహితురాలు తనను తాను హింసించుకోవడం మొదలుపెట్టింది. చేతులు, కాళ్లు, పొట్ట, ఛాతీ భాగంలో అన్ని చోట్ల బ్లేడు గాట్లే. ఈ మధ్య చేతిమీద వాత పెట్టుకుంది. ఏమిటంటే.. ఏడుస్తోంది. వాళ్ల తల్లిదంవూడులకు ఒకసారి చెప్పి చూశాను. కానీ ఏం లాభం లేదు. దాన్ని అలా వదిలేస్తే ఏమైపోతుందో అనిపిస్తోంది. దాని ప్రవర్తన మారాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి


మీ స్నేహితరాలికి ఓ ఆసరా, అండ కావాలి. తను ఒంటరి అనే భావం ఆమెను కుంగదీస్తోంది. ఇంట్లో వాళ్లు పట్టించుకోకపోవడం వల్ల ఏర్పడిన ఒత్తిడి వల్లే ఇదంతా. కాబట్టి ఆమెను ఆ ఒత్తిడి నుంచి దూరం చేయాలి. కొంతమంది మానసికంగా స్థైర్యాన్ని కోల్పోయినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు గోళ్లు కొరకడం, పెదవులను కొరుక్కోవడం చేస్తారు. డిప్రెషన్ మరీ ఎక్కువైతే బ్లేడుతో గాట్లు, నిప్పుతో వాతలు పెట్టుకుంటారు. మీ ఫ్రెండ్ అదే పరిస్థితిలో ఉంది. కాబట్టి మీరే ఆమెకు కేర్ మారండి. తన గురించి మీ ఇంట్లో తెలియచేయండి. మీ తల్లిదంవూడులు, టీచర్లు అందరిని ఆమెకు ధైర్యాన్ని నూరి పోయమనండి. మెల్ల, మెల్లగా మార్పు వస్తుంది. తనకి ఎవరూ లేరనే అభివూపాయం నుంచి బయటకు వచ్చేలా చేయండి. కచ్చితంగా తన ప్రవర్తనలో మార్పు వస్తుంది. అలాగే వీలైతే సైకాలజిస్టును సంప్రదించండి. మీ స్నేహితురాలిని సరికొత్తగా చూడవచ్చు.

Other News
    Most Viewed galleries


    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine