నైట్ షిఫ్ట్‌లతో చిక్కే!

ఉరుకుల పరుగుల లోకంలో తలా ఒక పనిచేస్తేనే సంసారం సాఫీగా గడుస్తుంది. లేకపోతే చిక్కులు తప్పవు. దానికోసం ఆలుమగలు డే అండ్ నైట్ కష్టపడుతుంటారు. అయితే స్త్రీల విషయంలో.. ఇది మరింత రిస్కే అంటున్నారు వైద్య నిపుణులు. పగలు మొత్తం ఎంత పనిచేసినా పర్వాలేదు కానీ, రాత్రి పనిచేస్తే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందట. కెరీర్ కోసం ఇలా కష్టపడే వారు 11శాతం మంది ఉన్నారు. ఐతే తాజా పరిశోధనల ప్రకారం రాత్రిళ్లు పనిచేస్తే స్త్రీల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరిగిపోతుందట. దాంతో క్యాన్సర్ రేట్‌ని మరింత పెంచుతున్నారు. ముఖ్యంగా బ్రెస్ప్ క్యాన్సర్. ఇలా రాత్రుళ్లు పనిచేయడం వల్ల ప్రసవ సమయంలో చనిపోయే స్త్రీల సంఖ్య పెరిగిపోయింది.
ఎందుకంటే.. రాత్రుళ్లు పనిచేయడం వల్ల క్షీరక్షిగంథుల మీద ప్రభావం పడి మరణించే అవకాశలు ఎక్కువ. సంవత్సరానికి దాదాపు లక్షలో వంద మంది ఇలా మరణిస్తున్నారట. ఇప్పటివరకు ఇలా చనిపోయినట్లు 1.3మిలియన్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఫ్రాన్స్‌లోనే 53వేల మంది చనిపోయారట. అంతేకాదు, నాలుగు సంవత్సరాల పాటు ఏకధాటిగా నైట్ షిఫ్ట్‌లు చేసినవాళ్లకి ఈ రిస్క్ మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.
Other News