Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >> Features >> Aadabidda


పిగ్మెం చెక్

gluta-mod talangana patrika telangana culture telangana politics telangana cinema ఈ మధ్య కాలంలో పిగ్మెం సమస్యగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ముఖానికి ఈ పిగ్మెం వస్తుంది. అందంగా ఉన్న ముఖం కాస్తా ఈ పిగ్మెం మచ్చలతో వికారంగా తయారవుతోంది. అయితే చర్మంపై వచ్చే టాన్‌కు.. ఈ పిగ్మెం కొద్దిపాటి తేడామావూతమే ఉంటుంది. సాధారణంగా ముఖం నల్లగా అయిపోతే టాన్ వచ్చిందేమో అనుకుంటాం. కానీ అది మూడు నాలుగు వారాలైనా పోకపోతే కచ్చితంగా డెర్మటాలజిస్టును కలవాల్సిందే. మరి ఈ పిగ్మెం తగ్గడానికి కొన్ని సహజమైన పద్ధతులను, చిట్కాలను ఇప్పుడు చూద్దాం...

- ఒక చెంచా పాలపొడి తీసుకుని దానికి ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మరసం, సగంచెంచా బాదం నూనె కలిపి పేస్టు తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మర్దనా చేసిన 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది ముఖంలో టాన్‌ను పోగొట్టి కొత్తకాంతినిస్తుంది.
- ఓట్స్ తీసుకుని వీటికి టమాటారసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.
- ఆలుగడ్డను అడ్డంగా కోసి పలుచని పొరలను మచ్చలున్న చోట పది నిమిషాలపాటు ఉంచాలి. ఇది మచ్చలను పోగొడుతుంది.
- పసుపుకు నిమ్మరసం కలిపి ముఖానికి మర్దనా చేయాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. నిమ్మరసం ముఖానికి మంచి బ్లీచ్‌లా పనిచేస్తుంది.
- కమలాపండు తొక్కల్ని ఎండిన తరువాత పొడి చేసి దానికి కొంచెం పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇది కమిలిపోయిన చర్మానికి నునుపుదనాన్నిస్తుంది.
- కొన్ని లేత వేపాకులు లేదా వేప చిగురు తీసుకోవాలి. దీనికి కొంచెం పసుపు, నిమ్మరసం కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్టును రాత్రిపూట ముఖానికి రాసుకుని ఉదయం కడిగేయాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే రోజూ చేసినా మంచిదే.
- పొడిచర్మం ఉన్నవాళ్లు ఎండలో అసలు తిరగకూడదు. తప్పనిసరై వెళ్లాల్సివస్తే ముఖానికి ఏదైనా మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
- వారానికోసారి ఛాయ్ డికాషన్‌తో ముఖానికి ఆవిరిపట్టండి. మంచి ఫలితం ఉంటుంది.
- పుదీనా ఆకులను మెత్తని పేస్టులాగా చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాలాగి చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా 15 రోజులు వరుసగా చేస్తే రంగు మారుతుంది.
- ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు స్వీట్స్, ఐస్‌క్షికీమ్స్, కొవ్వు పదార్థాలు తినడం తగ్గించి తాజా పళ్లు, పళ్లరసాలు, సలాడ్స్ తీసుకోవడం మంచిది.
- పాలలో ఉప్పువేసి దాంతో ముఖానికి 5 నిమిషాలపాటుమర్దనా చేసి 20 నిమిషాలాగి కడిగేయండి.
- ఒక స్పూను గంధంపొడిలో కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాలాగి కడిగేయండి. ముఖానికి మెరుపురావడమే కాదు... నునుపుదనం కూడా సంతరించుకుంటుంది.
- టమాట చర్మానికి మంచి క్లెన్సర్. బాగా పండిన టమాట గుజ్జును తీసుకుని ముఖానికి రుద్ది పావుగంట తరువాత కడిగేయండి. ఇలా 20రోజులపాటు చేయడం వల్ల చర్మానికి కొత్తకాంతి వస్తుంది.
- పెరుగు తీసుకుని దానికి నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరువాత కడిగేయాలి. మంచి ఫలితం ఉంటుంది.
- పాలలో కొంచెం శనగపిండి, కొంచెం గంధం పొడి కలిపి పేస్టు తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి మెడకు మృదువుగా మర్దనా చేయాలి. శనగపిండి చర్మంపై ఉన్న మురికిని, మృతకణాలను తొలగిస్తే గంధం చర్మానికి మెరుపునిస్తుంది.



Other News
    Most Viewed galleries


    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine