|
|
Home >> Features >> Aadabidda
యోగా యవ్వనం కోసం.. ![]() ముందుగా సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ కూర్చోవాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలిపీల్చుతూ మెడను పైకి ఎత్తి ఆకాశం వైపు చూడాలి. ఈ స్థితిలో నోటిని పదిసార్లు తెరిచి మూయడం చేయాలి. తర్వాత గాలి వదిలేస్తూ చుబుకాన్ని ఛాతీ భాగానికి ఆన్చాలి. ఇలా ఐదుసార్లు చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు మెడ నొప్పిగా అనిపిస్తుంది. ముఖ్యంగా తలని పైకి తీసుకెళ్లినప్పుడు మెడభాగంలో లాగినట్లుగా అనిపిస్తుంది. దీన్ని కొన్ని సెకన్ల పాటు అలాగే గమనించాలి. గమనిక : స్పాండిలైటిస్ సమస్య ఉన్నవారు చుబుకాన్ని ఛాతీ భాగానికి ఆన్చకూడదు. సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ కూర్చొని ఇప్పుడు దీర్ఘంగా గాలిపీల్చుకుని.. వదిలేస్తూ మెడని కుడివైపుకి తిప్పాలి. కళ్లు తెరిచి ఉంచి ఎంత వరకు చూడగలరో అటు వైపుగా చూడాలి. రెండు సెకన్ల పాటు అదే స్థితిలో ఉండాలి. తిరిగి గాలి పీల్చుతూ మామూలు స్థితికి రావాలి. ఇప్పుడు అదేవిధంగా కుడివైపు తిప్పి రెండు సెకన్ల పాటు ఉండి యథాస్థితిలోకి రావాలి. కుడివైపు, ఐదుసార్లు, ఎడమవైపు ఐదుసార్లు చేయాలి. చాలా సునాయసంగా కనిపించినా ఇది అద్భుత ఫలితాలను ఇస్తుంది. దీంతోపాటు ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాల్సిందేంటంటే.. మన ఆహారపు అలవాట్లు. ఉదయాన్నే పౌష్ఠికాహార భోజనం చేసినట్లయితే ముఖభాగంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. కాంతివంతమైన ముఖం మీ సొంతమవుతుంది. దానికోసం ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. భోజనం చేసే ముందు నీటిని తాగినట్లయితే శరీరం నుంచి వ్యర్థపదార్థాలు పోయి శరీరం మరింత నాజుకుగా తయారవుతుంది. లాభాలు : - మెడ భాగంలోని కొవ్వును తగ్గిస్తుంది. - తీరైన ముఖాకృతి మీ సొంతమవుతుంది. దాంతో వయసు తగ్గినట్లుగా.. యవ్వనంగా కనిపిస్తారు. - థైరాయిడ్ గ్రంథికి మంచి మసాజ్ ఇస్తుంది ఈ ఆసనం.
Other News
|
|||||