విర్చువల్ గ్లోబ్
ఈ-తరానికి అట్లస్ కంటే గూగుల్ ఎర్త్ ఎక్కువగా తెలుసు. ఈ విర్చువల్ గ్లోబ్ అద్భుతాలు సృష్టిస్తోంది మరి. భూగోళాన్ని మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. కొత్త ప్రాంతాలను కనుగొనేందుకు వేదిక అయ్యింది. తాజాగా ఈజిప్టులో రెండు భారీ పిరమిడ్లను కనుగొనడమే ఇందుకు నిదర్శనం. గూగుల్ ఎర్త్‌లో ఏమున్నాయి? మీరే చదవండి.
గూగుల్ ఎర్త్ ఒక సాధారణ మ్యాపింగ్ అప్లికేషన్ కాదు. సెర్చ్ బాక్స్‌లో Delhi అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మీ ముందు వెంటనే ఢిల్లీని ఉంచుతుంది. అక్కడి నుంచి ఆగ్రా ఎంత దూరమో తెలుసుకోండి. ఎలా వెళ్లాలో రూట్ చూపించమని అడగండి.. వెంటనే చూపిస్తుంది గూగుల్ ఎర్త్. రకరకాల ఫీచర్లను అందించే ఈ అప్లికేషన్‌ని ఉపయోగించడం చాలా సులభం.
వాటీజ్ దిస్?
గూగుల్ ఎర్త్ ఒక డెస్క్‌టాప్ అప్లికేషన్. ఒక సాఫ్ట్‌వేర్‌లాంటిది. దీన్ని రన్ చేయాలంటే మీకు ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉండాలి. న్ని ఓపెన్ చెయ్యగానే వెంటనే గూగుల్ సర్వర్‌కి కనెక్ట్ అయి టెరాబైట్ల జియోగ్రాఫికల్, పొలిటికల్, సోషల్ డేటాని మీ ముందు ఉంచుతుంది. శాటిలైట్ ఇమ్యాజినరీ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ నుంచి తీసిన ఫోటోలు బేస్‌లైన్ విజ్యువల్ డేటాగా కనిపిస్తుంది. దీన్ని జూమ్ చేయొచ్చు. టిల్ట్, రొటేట్ చేసే ఆప్షన్లు కూడా గూగుల్ ఎర్త్ ఫ్రేమ్‌లో కనిపిస్తాయి. గూగుల్ ఎర్త్‌కి సంబంధించిన బేసిక్ వెర్షన్ ఉచితంగా లభిస్తోంది. విండోస్, లైనెక్స్, మ్యాక్స్ ఓఎస్ ఏదైనా రన్ చేయొచ్చు. దీనిలో ముఖ్యంగా మ్యాపింగ్ / డైరెక్షన్, లోకల్ సెర్చ్, సైట్ సీయింగ్ కేటగిరీలు ఉన్నాయి. ఇంకా ఎక్కువగా అంటే.. కమర్షిల్ పర్పస్‌లో వాడుకునే వారికోసం సబ్‌స్ర్కైబ్ బేస్డ్ వెర్షన్లను కూడా గూగుల్ డెవలప్ చేసింది.
ఫీచర్స్
గూగుల్ ఎర్త్ సెర్చ్ బాక్స్‌లో ఒక ప్రాంతం పేరుని టైప్ చేయగానే అంతరిక్షం నుంచి అక్కడ జూమ్ అవుతుంది. భూమికి అత్యంత దగ్గరకు రాగానే ఆగిపోతుంది. ఆ తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్‌లను చూపిస్తుంది. అక్కడ కనిపించే లేయర్ల సహాయంతో లాడ్జింగ్, డైనింగ్, బ్యాంక్స్, రోడ్స్, షాపింగ్ మాల్స్, పార్కులు, స్కూళ్లు.. ఇలా జియోగ్రాఫికల్ ఫీచర్లను పొందొచ్చు.
ఫర్ బిజినెస్
గూగుల్ ఎర్త్‌లో మీరు చూసిన ప్రాంతాన్ని సేవ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు. ఇతరులకు ఈమెయిల్ చేయొచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన బటన్లు ఉంటాయి. మీరొక కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ భోజనం చేయడానికి హోటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలియదనుకుందాం. గూగుల్ ఎర్త్‌లో ఆ ప్రాంతానికి వెళ్లి ‘డైనింగ్’ అనే లేయర్ ద్వారా సెర్చ్ చేస్తే అక్కడున్న హోటల్స్ అన్ని కనిపిస్తాయి. వాటి ప్రత్యేకతలు కూడా తెలుసుకోవచ్చు. ఇలా.. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు.. రకరకాల బిజినెస్‌లను సెర్చ్ చేయొచ్చు.
3డీ ఎర్త్
గూగుల్ ఎర్త్‌లో ఇదొక అమేజింగ్ ఫీచర్. భూగోళంపై ఉన్న ప్రముఖ కట్టడాలన్నింటినీ త్రీడీలో చూపించాలని గూగుల్ కంకణం కట్టుకుంది. ఇప్పటికీ అమెరికా దేశాల్లో చాలా కట్టడాలని 3డీ వెర్షన్‌లోకి మార్చింది. హైదరాబాద్‌లో చార్మినార్, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధవిక్షిగహం త్రీడీలో కనిపించడం మీరు చూడొచ్చు. గూగుల్ స్కెచ్‌అప్ ప్రోగ్రామ్ ద్వారా వినియోగదారులు కూడా కట్టడాలను త్రీడీలోకి మార్చి అప్‌లోడ్ చేసే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తోంది. అంటే మీకు త్రీడీలో కాస్త పరిజానం ఉంటే.. మీ ఇంటిని దాని దగ్గరలో ఉన్న ల్యాండ్‌మార్క్స్‌ని డిజైన్ చేసి గూగుల్ ఎర్త్‌లోకి అప్‌లోడ్ చేయొచ్చు.
వీడియో ఫ్లైఓవర్స్
గూగుల్ అందిస్తున్న మరో అద్భుతమైన ఫీచర్ ఇది. మీరు అంట్లాంట మీద ఉన్నప్పుడు నేపాల్ కోసం సెర్చ్ చేశారనుకోండి. మిమ్మల్ని ఆకాశ మార్గంలో నేపాల్‌కు తీసుకెళ్తుంది. అప్పుడు ఫ్రేమ్‌లో కిందిభాగాన డైరెక్షన్స్‌ని గమనించవచ్చు. వీటిని రికార్డ్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు ప్లే చేయొచ్చు. మీరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి డ్రైవింగ్ చేస్తూ వెళ్లినప్పుడు కలిగే ఫీలింగే ఈ ఫ్లైఓవర్స్ ద్వారా కలుగుతుంది.
- ఎర్త్‌ని కమర్షియల్‌గా వాడుకునేందుకు గూగుల్ ఎర్త్ ప్లస్‌ని తయారు చేసింది గూగుల్ ఇంక్ సంస్థ. దీని ద్వారా ఎక్కువ రిజల్యూషన్‌లో మ్యాపులను ప్రింట్ తీసుకోవచ్చు.
- గూగుల్ ఎర్త్ అందిస్తునటువంటి ఫీచర్లనే ఎం.ఎస్.ఎన్ విర్చువల్ ఎర్త్ అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతానికి అది బేటా స్టేజ్‌లోనే ఉంది.
Other News