అంగారకుని అద్భుతాలు
1. మార్స్ అనే పదాన్ని ఈజిప్టియన్లు తొలిసారిగా వాడినట్లు ఆధారాలున్నాయి.
2. మార్స్ గ్రహాన్ని కనుగొన్న తర్వాతే ‘మార్చి’ నెలకి ఆ పేరు పెట్టారు.
3. ం యుద్ధానికి దేవునిగా రోమన్లు పూజిస్తారు.
4. ఐరన్ ఆక్సైడ్ వల్ల అంగారక గ్రహం ఎర్రగా కనిపిస్తుంది.
7. అరుణ గ్రహంపై కార్బన్ డై ఆక్సైడ్ 95 శాతం ఉంటుంది.
8. భూమి నుంచి అంగారకునికి చేరుకోవాలంటే కారులో గంటకు 60 మీటర్ల వేగంతో వెళ్తే 271 సంవత్సరాల 221 రోజులకు చేరుకోవచ్చు.
9. సరైన స్పేస్ సూట్ వేసుకోకుండా వెళ్తే అక్కడున్న లోప్రెషర్ వల్ల మనిషి రక్తం బుడగలుగా మారుతుంది.
10. అంగారకునిపైన ఓజోన్ పొర ఉండదు.
11. సౌరకుటుంబం మొత్తంలో అంగారక గ్రహంపైనే దుమ్ము ఎక్కువగా ఉంటుంది.
12. అంగారక గ్రహం 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది.
13. భూమి మీద కంటే అంగారకుని మీద చలి ఎక్కువ. కాకపోతే రెండు గ్రహాలపై రుతువులు ఒకేలా ఉంటాయి.
14. 24 గంటల 37 నిమిషాలు గడిస్తే అంగారకుని పై ఒకరోజు అన్నమాట. అంటే భూమితో సమానం. ఏ ఇతర గ్రహంపై ఇలా ఉండదు.
15. సంవత్సరానికి అంగారకునిపై కాలాలు రెండుసార్లు వస్తాయి. ఎందుకంటే ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజులు పడుతుంది.
16. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే కక్ష్యలో భూమి, అంగారకుడు ఎప్పుడూ ఎదుదురుగా ఉంటాయి. అంటే సూర్యునికి అవతల ఉంటాయన్నమాట.
17. గురుత్వాకర్షణ శక్తి భూమితో పోల్చితే అంగారకునిపై 35 శాతమే ఉంటుంది. అంటే భూమిపై 45 కిలోల బరువుండే మనిషి అంగారకునిపై 18 కిలోల బరువే ఉంటాడు.
18. అంగారకుడు భూమికి అతి దగ్గరగా వచ్చి 60 వేల సంవత్సరాలయింది. మళ్లీ అంత దగ్గరగా రావాలంటే 2287 వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది.
19. 1609లో గెలీలియో తొలిసారి అంగారకున్ని టెలీస్కోప్ ద్వారా చూశాడు.
20. అంగారకుడు భూమిలో సగం ఉంటాడు.
21. మార్స్ సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాల్లో నాలుగోది. సౌరకుటుంబలో అంగారకునిది పరిమాణంలో ఏడో స్థానం.
22. అంగారకుని బరువు 641,850,000, 000,000,000,000,000 కిలోలు.
23. మధ్యరేఖ వద్ద వ్యాసార్థం 3,397 కిలోమీటర్లు.
24. అంగారకునికి రెండు చంద్రమండలాలు ఉంటాయి. వాటి పేర్లు ఫోబోస్, డైమోస్.
25. సూర్యుని చుట్టూ అంగారకుడు సెకనుకు 24.2 కీలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటాడు.
Other News