టాప్ టెన్
సాంకేతిక పరిజానం క్షణ క్షణానికి మారుతూనే ఉంటుంది. ప్రతి ఏటా అప్‌డేట్ అవుతూనే ఉన్నది. 2012 ఫస్ట్ హాఫ్ పూర్తయింది. ఈ సంవత్సరం ప్‌డేట్ అయిన టెక్నాలజీలో ఏవి పాపులర్‌గా ఉన్నాయి? ఏ గాడ్జెట్స్‌ని ఎక్కువగా వాడుతున్నారు? చరిత్ర సృష్టిస్తున్న టాప్ టెన్ లిస్ట్‌ని ‘థింక్ డిజిట్ ’ ప్రకటించింది.
లినోవా ఐడియా సెంటర్
లినోవా కంపెనీ స్లిమ్మెస్ట్ ఆల్ ఇన్ వన్ పీసీని లాంచ్ చేసింది. ఐడియా సెంటర్ ఏ720 పేరుతో లభిస్తున్న ఈ కంప్యూటర్‌ని 10 ఫింగర్ మల్టీటచ్ స్క్రీన్ పీసీగా రూపొందించారు. దీన్ని చెస్ బోర్డులా పరిచి వాడుకోవచ్చు. ఇంటెల్ థర్డ్ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. సూపర్ స్లిమ్, ఫ్రేమ్‌లెస్ డిస్‌ప్లే, 95 డిగ్రీస్ అడ్జెస్టబుల్, 2జీబీ డిస్‌క్రీట్ గ్రాఫిక్స్, ఇంటిగ్రేటెడ్ టీవీ ట్యూన్, హెచ్‌డీఎంఐ ఇన్‌పుట్, అవుట్‌పుట్, డాల్బీ సౌండ్ స్పీకర్స్, బ్లూరే డిస్క్, 1080పీ ఎల్‌ఈడీ డిస్‌ప్లే, 720పీ హెచ్‌డీ వెబ్‌కామ్, 64 జీబీ స్టోరేజ్, ఆల్ట్రాస్లిమ్ వైర్‌లెస్ కీబోర్డ్ దీనిలో ఉన్న అధునాతన ఫీచర్లు. దీని ధర 89,990 రూపాయలు.
గూగుల్ మ్యాప్స్ ఆఫ్‌లైన్
గూగుల్ మ్యాప్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తే డివైజ్‌ల కోసం ఆఫ్‌లైన్ వెర్షన్‌ని తాజాగా విడుదల చేసింది. దీని ద్వారా ఆండ్రాయిడ్ వినియోగదారులు తమకు కావాల్సిన ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. మనదేశంతో కలిపి 150 దేశాలకు సంబంధించిన సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది. ఇంటర్‌నెట్ కనెక్షన్ లేకుండానే ఆఫ్‌లైన్ వెర్షన్‌లో నావిగేషన్, పొజిషనింగ్‌ని వాడుకోవచ్చు. స్ట్రీట్ వ్యూకి సంబంధించిన వేగవంతమైన కంపాస్ మోడ్‌ని ఇందులో పొందుపరిచింది. ఇది 360 డిగ్రీస్, పనోరమిక్ వ్యూలో లభిస్తున్నది.
పెంటా టీ-ప్యాడ్
బీఎస్‌ఎన్‌ఎల్, ప్యాన్‌టెల్ సంయుక్తంగా టీ-ప్యాడ్ ఐఎస్ 701 సీ టాబ్లెట్ పీసీని తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఆండ్రాయిడ్ 4.0 ఆధారంగా పనిచేసే ఈ ఐసీఎస్ టాబ్లెట్ పీసీ ధర 4, 999 రూపాయలు. పెంటా టీ-ప్యాడ్ పేరుతో పిలుస్తున్న ఈ డివైజ్ వై-ఫై, 3జీ యూఎస్‌బీలను మాత్రమే సపోర్ట్ చేస్తాయి. 0.3 ఎంపీ కెమెరా ఇందులో ఉంటుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, యాంగ్రీబర్డ్స్, స్కైప్ వీడియో కాలింగ్ లాంటి చాలా అప్లికేషన్లు ఇందులో ఫ్రీలోడ్ చేసి ఉంటాయి. 1 జీబీ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పెండబుల్ మెమరీ, 720పీ హెచ్‌డీఎంఐ పోర్ట్, 16 ఎం కలర్స్ ఇందులో ఉండే ఫీచర్లు. ఇంటర్‌నెట్ బ్రౌజ్ చేయడానికి, యూట్యూబ్ వీడియోల్ని చూడడానికి, ఈమెయిల్స్ చెక్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
స్యామ్‌సంగ్ ఓమ్నియా ఎం
స్మార్ట్‌ఫోన్ల తయారీలో నెంబర్‌వన్‌గా ఉన్న స్యామ్‌సంగ్ కంపెనీ తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. స్యామ్‌సంగ్ ఓమ్నియా ఎం పేరుతో లభిస్తున్న ఈ ఫోన్ విండోస్ 7.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వివిద్ డిస్‌ప్లే, సూపీరియర్ కనెక్టివిటీ దీనిలోని ప్రత్యేకతలు. 4 అంగుళాల కొత్తరకం ఎమోల్డ్ స్క్రీన్, 1 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్ దీని సొంతం. సోషల్ మీడియా యాప్స్‌తో పాటు స్యామ్‌సంగ్ క్లౌడ్ బేస్డ్ ఫ్యామిలీ నుంచి లభించే అప్లికేషన్లు కూడా ఇందులో ఉంటాయి. వై-ఫై ద్వారా ప్రింటింగ్, ప్రత్యేకమైన ఫోటో స్టూడియో, మినీ డైరీ, ఫన్ షాట్ యాప్ లాంటి కొత్తరకం అప్లికేషన్లు కూడా ఇందులో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 5 ఎంపీ కెమెరా, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ ఇందులో ఉంటుంది. దీని ధర 18, 650 రూపాయలు. స్యామ్‌సంగ్ ఇప్పటి వరకు 21 స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది.
వీచాట్ - మొబైల్ సోషల్ యాప్
ఆసియాలో ప్రముఖ ఇంటర్‌నెట్ కంపెనీ టెన్‌సెంట్ తన పాపులర్ గ్లోబల్ మొబైల్ ప్రోడక్ట్ ‘వీచాట్’ని మనదేశంలో విడుదల చేసింది. వీచాట్ అనేది వాయిస్, టెక్ట్స్ మెసేజింగ్‌కి సంబంధించిన అప్లికేషన్. ప్రపంచవ్యాప్తంగా వీచాట్ ఇప్పటికే 100 మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్లను కలిగి ఉంది. టెక్ట్స్ మెసేజింగ్, హోల్డ్ టు టాక్ వాయిస్ మెసేజింగ్, బ్రాడ్‌కాస్ట్ మెసేజింగ్, ఫోటో-వీడియో షేరింగ్, లొకేషన్ షేరింగ్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ఛేంజ్‌లాంటి అధునాతన ఫీచర్లను ‘వీచాట్’ అందిస్తున్నది. వీచాట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ సింబియాన్ లాంటి అన్ని మొబైల్ ప్లాట్‌ఫామ్‌లపై పనిచేస్తుంది. దీని డౌన్‌లోడ్ లింక్ : http://www.wechatapp.com
Other News