Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, May 22, 2013
 


Home >> Features >> Techknowledge


సెకండ్ హ్యాండ్

s_handసెకండ్ హ్యాండ్ వస్తువులు కొనాలన్నా.. మీరు వాడినవి అమ్మాలన్నా.. ఈ ఆన్‌లైన్ స్టోర్‌లు ఉపయోగపడతాయి.

1. ఈబే
ఈబే గురించి తెలియని ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారులు ఉండరు. ఎంత పాపులారిటీని సంపాదించిందో అంతటి నమ్మకాన్నీ సొంతం చేసుకుంది. వస్తువుని అమ్మాలనుకున్నవారు ఈబేలో మీరొక షాప్ పెట్టుకుని వస్తువుల లిస్ట్‌ని రాసిపెట్టొచ్చు. ఇందుకోసం ఈబేకు మినిమమ్ ఛార్జీ పే చేయాల్సి ఉంటుంది. ‘పైసాపే’ నుంచి లావాదేవీలు నడపొచ్చు. షిప్పింగ్ బాధ్యత అమ్మకం దారు మీదనే ఉంటుంది. సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనాలనుకునేవారికి ఏ టు జెడ్ లిస్ట్ బొమ్మలతో సహా అందుబాటులో ఉంటాయి.

2. సెకండ్ హ్యాండ్ మాల్
క్లాసిఫైడ్ యాడ్స్ ఇచ్చేందుకు ఉపయోగపడే వెబ్‌సైట్ ఇది. వస్తువులను అమ్మడానికి, కొనడానికే కాకుండా ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడానికి, ఇతరులకు దానం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. నావిగేషన్ సులభంగా ఉంటుంది. యాడ్స్‌ని ఫ్రీగా పోస్ట్ చేయొచ్చు. వస్తువులు కొనేవారికి ఇందులో ఉండే ‘ప్రొడక్ట్ వెరిఫికేషన్’ టూల్ బాగా ఉపయోగపడుతుంది.

3. ఓఎల్‌ఎక్స్
ఇది కూడా క్లాసిఫైడ్ యాడ్స్‌ని అందించే వెబ్‌సైటే. కాకపోతే దీంట్లో ఎక్కువమంది మెంబర్‌షిప్ తీసుకుని ఉండడం వల్ల మన వస్తువుల్ని అమ్మడం, కొనడం సులభమవుతుంది. పెంపుడు జంతువులను నుంచి భారీ వాహనాల వరకు ఇందులో అమ్ముకోవచ్చు. తక్కువ ధరలో కొనుక్కోవచ్చు. మీ ప్రొడక్ట్ అమ్మకం గురించి హోమ్‌పేజీలో ప్రముఖంగా ప్రచురించాలంటే 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

4. జునా బజార్
జునా అంటే మరాఠిలో పాతది అని అర్థం. పాత వస్తువుల్ని అమ్మడానికి కొనడానికి ఉపయోగపడుతుందని ఇట్టే అర్థమైపోతుంది. లావాదేవీల విషయాలు మీరే చూసుకోవాలి తప్ప జునా బజార్‌కి ఏమీ సంబంధం ఉండదు.

5. క్విక్కర్
ఎక్కువ పబ్లిసిటీ, ప్రమోషన్ ఉన్న క్లాసిఫైడ్ యాడ్స్ వెబ్‌సైట్ ఇది. అందుకే మన వస్తువుల్ని క్విక్‌గా అమ్మడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఒకే వస్తువుకి సంబంధించి రకరకాల ఆల్టర్‌నేటివ్స్ ఉండడం ఇందులో లభించే మరో మంచి అవకాశం. దీంట్లో కూడా ప్రొడక్ట్ షిప్పింగ్ బాధ్యత అమ్మకందారునిదే గానీ క్విక్కర్‌కి ఏమాత్రం సంబంధం ఉండదు.

Other News
    Most Viewed galleries


    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine