Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Saturday, May 18, 2013
 


Home >> Features >> Techknowledge


ఇమేజ్ పెంచుదాం..

PositiveOptions_ManipulatioImage Manipula-tion Tools You Should Know About
మీకు ఫోటోషాప్ టచ్ ఉందా? మీ ఫోటోల్ని ఎడిట్ చేసుకోవడానికి ఇంకొకరిపై ఆధారపడాల్సి వస్తోందా? డోంట్‌వర్రి! మరొకరి అవసరం లేకుండానే మీ ఫోటోల్ని మీకు కావాల్సినట్టు మ్యానిప్యులేట్ చేసుకోవడానికి చాలా రకాల వెబ్‌టూల్స్ ఉన్నాయి. సింపుల్‌గా ఇమేజ్‌ని ఆన్‌లైన్‌లోకి అప్‌లోడ్ చేసి రెండు మూడు క్లిక్‌లతో మీ ఇమేజ్‌ని పెంచుకోండి.

011. వాటర్‌మార్క్ ఇమేజెస్
watermark-images.com
ఆన్‌లైన్‌లోకి అప్‌లోడ్ చేసే ఈ ఇమేజ్‌లకు వాటర్ మార్క్స్ యాడ్ చేయాలంటే ఈ సైట్‌ని క్లిక్ చేయండి. ఒకేసారి 20 ఇమేజ్‌లకు వాటర్ మార్క్‌లను యాడ్ చేయడమే కాకుండా.. మీ టెక్ట్స్ కస్టమైస్ చేసుకోవచ్చు. అంటే.. ఇమేజ్ మీద ఏ వాటర్ మార్క్ రావాలో (మీ పేరు / వెబ్‌సైట్ పేరు / కాపీరైట్స్ మొ.) ఆ టెక్ట్స్‌ని ఎంటర్ చేయొచ్చు. ఇమేజ్‌పై మీకు కావాల్సిన పొజిషన్‌లో, కావాల్సిన ఫాంట్‌లో వాటర్ మార్క్ పెట్టొచ్చు. డ్రాప్ షాడో ఆప్షన్ కూడా ఉంది.

022. ఫిక్స్ రెడ్ ఐస్
www.fixredeyes.com
చిన్న చిన్న కెమెరాలతో ఫోటోలు తీసినప్పుడు కొన్ని ఫోటోల్లో కళ్లు ఎరుపు రంగులో పడతాయి. ఈ రెడ్ ఐ ఎఫెక్ట్‌ని అడ్జెస్ట్ చేసుకునే అవకాశం కొన్ని కెమెరాల్లో ఉంటుంది. మీ పాత ఫోటోలుగానీ.. సెల్ కెమెరాతో తీసిన ఫోటోల్లో రెడ్ ఐ ఎఫెక్ట్‌ని అడ్జెస్ట్ చేయడానికి ఈ వెబ్‌సైట్‌కి వెళ్లొచ్చు. ఈ సైట్‌లో ఇందుకోసమే ప్రత్యేకమైన టూల్ ఉంది. మీ పిక్చర్‌ని అప్‌లోడ్ చేసి రెడ్ ఐ ఏరియాని అడ్జెస్ట్ చేసి.. ఫిక్స్ నొక్కండి. మీకు ఓకే అనిపిస్తే ఆ పిక్చర్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే undo నొక్కి మళ్లీ అడ్జెస్ట్ చేయండి.

3. ఇమేజ్ స్లిట్టర్
www.htmlkit.com/services/is
మీ ఇమేజ్‌ని అడ్డంగా, నిలువుగా.. ముక్కలు ముక్కలుగా కత్తిరించడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది. మీ వెబ్‌సైట్‌లోకిగానీ, బ్లాగ్‌లోకి గానీ ఇమేజ్‌ని యాడ్ చేయాలంటే ఇలా స్లిట్ చేయడం వల్ల మీ పని సులభమవుతుంది. ఈ లింక్ ద్వారా హెచ్‌టీఎమ్‌ఎల్ లింక్ ఫైల్‌ని కూడా పొందొచ్చు. ఇందులోకి మీ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసి మీకు కావాల్సిన రోస్, కాలమ్స్ సెలెక్ట్ చేసుకుని, రిజెల్యూషన్ సెట్ చేసుకుని ప్రాసెస్ క్లిక్ చేయండి. ప్రాసెస్ అయిన తర్వాత ఒకే అనిపిస్తే డౌన్‌లోడ్ నొక్కండి.

044. ఇమేజ్ మెర్జర్
www.imagemerger.net
రెండు ఇమేజ్‌లను కలిపి ఒకే ఇమేజ్‌గా మార్చేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుంది. మొదటి ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌గా రెండో ఇమేజ్ వాటర్ మార్క్‌గా కనిపిస్తుంది. వాటర్ మార్క్‌ను టెక్ట్స్‌గా కాకుండాఇమేజ్‌గా ఉపయోగించుకోవాలనుకుంటే ఈ ఇమేజ్ మెర్జర్‌ని వాడొచ్చు.

5. మిర్రర్ ఎఫెక్ట్
www.mirroreffect.net
అద్దంలో ప్రతిబింబంలా మీ బొమ్మల్ని తీర్చిదిద్దాలంటే ఈ మిర్రర్ ఎఫెక్ట్‌లోకి అప్‌లోడ్ చేయండి. ఈ బొమ్మ ప్రతిబింబాన్ని మార్చుకోవచ్చు కూడా.. డైరెక్షన్‌ని బాటమ్, టాప్, లెఫ్ట్, రైట్ యాంగిల్స్‌లోకి మార్చుకోవచ్చు.

6. వాటర్ ఎఫెక్ట్
www.watereffect.net
మీరు సైకిల్ తొక్కుతున్నట్లు ఒక ఫోటో తీయించు కున్నారనుకుందాం. మీరు వాటర్ పక్కనుంచి సైకిల్ తొక్కుతున్నట్లు ఎఫెక్ట్ ఇవ్వడానికి ఇది ఉపయోగ పడుతుంది. కేవలం ఇలాంటి బొమ్మలకే కాదు ఏ బొమ్మకైనా ఈ ఎఫెక్ట్‌ని యాడ్ చేయొచ్చు. దీన్ని ఎంబేడ్ చేసుకోవచ్చు కూడా.

7. టెక్ట్స్ ఇమేజ్
www.text-image.com/index.html
మీ ఫోటోని టెక్ట్స్‌లోకి మార్చుకునేందుకు ఈ వెబ్ టూల్ ఉపయోగపడుతుంది. వీటిని హెచ్‌టీఎమ్‌ఎల్ కంటెంట్‌గా కూడా కాపీ చేసుకోవచ్చు. ఏఎస్‌సీఐఐ, మాట్రిక్స్ టెక్ట్స్ ఇమేజ్‌లుగా కూడా మార్చుకోవచ్చు.

8. పిక్ 2 గ్రాఫిక్స్
www.genopal.com/pic2graphics
మీ పిక్చర్‌లో రంగులు మార్చుకునేందుకు (రీ కలర్ చేయడానికి) ఈ లింక్ ఉపయోగపడుతుంది. ఒక మూడ్‌లో ఉన్న పిక్చర్‌ని ఇంకో పిక్చర్‌లోకి మార్చొకోవడమన్నమాట. రెండు పిక్చర్‌లను అప్‌లోడ్ చేసి ఒక పిక్చర్‌లోని మూడ్‌ని, రంగుల్ని ఇంకో పిక్చర్‌లోకి మార్చుకోవచ్చు.

9. స్పీచబుల్
en.speechable.com
న్యూస్‌పేపర్ కార్టూన్‌లలో బొమ్మలు ఎలా మాట్లాడతాయి. ఒక బాక్స్ గీసి అందులో టెక్ట్స్ రాస్తారు కదా. వాటినే స్పీచ్ బబుల్స్ అంటారు. అలాంటి బబుల్స్‌ని మీ ఇమేజ్‌కి యాడ్ చేసుకోవడానికి ఈ స్పీచబుల్ వెబ్ టూల్ ఉపయోగపడుతుంది. బబుల్స్ సైజ్‌ని, టెక్ట్స్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. వీటిని ఎంబేడ్ (Embed) చేసి ఆ బొమ్మల్ని మీ బ్లాగ్‌లో వెబ్ పేజీల్లోకి పోస్ట్ చేయొచ్చు.

1010. రౌండ్ పిక్
www.roundpic.com
దీని ద్వారా మీ బొమ్మకి రౌండెడ్ కార్నర్స్ యాడ్ చేయొచ్చు. ఏ సైజులో ఉన్న ఇమేజ్‌లకయినా ఇది అప్లై అవుతుంది. ఆ కార్నర్స్‌కి బార్డర్లు, డ్రాప్ షాడోలు కూడా యాడ్ చేయొచ్చు.

11. బీ ఫంకీ
www.befunky.com
పక్కా డిజిటల్ పెయింటింగ్ ఇది. మీ పిక్‌ని కార్టూన్‌లా కనిపించేలా కూడా ఎఫెక్ట్ ఇవ్వొచ్చు. కార్టూనైజ్డ్ అవతార్‌లు క్రియేట్ చేయొచ్చు. డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్స్, యాక్సెసరీస్, స్టెన్సిల్స్, పెన్సిల్స్ ఎఫెక్ట్‌లు చేర్చొచ్చు.

12. జిప్ అప్
www.gifup.com
మీ బొమ్మల్ని సింపుల్‌గా అప్‌లోడ్ చేసి జిప్ ఫైల్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. వాటిని యానిమేటెడ్ జిప్ ఫైల్స్‌గా కూడా మార్చుకోవచ్చు. రకరకాల యానిమేషన్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు.

Other News
    Most Viewed galleries


    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine