Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Monday, May 20, 2013
 


Home >> Features >> Techknowledge


టెక్ బజార్

Philips---Atalangana patrika telangana culture telangana politics telangana cinemaఫిలిప్స్
ఎయిర్ ఫ్రైయర్

ఫిలిప్స్ కంపెనీ సరికొత్త గృహోపకరణాన్ని తయారు చేసింది. గాలితో పనిచేసే ‘ఎయిర్ ఫ్రైయర్’ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీతో రూపొందిన ఈ ఎయిర్ ప్రైయర్ వంటనూనె వినియోగాన్ని తగ్గిస్తూ, గాలితోనే పదార్థాలను ఉడికిస్తుంది. సుమారు 30 నిమిషాలకు ముందుగానే సమయాన్ని సెట్ చేసుకుని ఇతరత్రా పనులు చేసుకోవచ్చు. పదార్థాల రుచులు కలిసిపోకుండా వివిధ రకాల పదార్థాలను ఒకే సమయంలో వండుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది. డిష్‌వాష్ సేఫ్ భాగాలు, నాన్‌స్టిక్‌ల వల్ల వంట పూర్తయిన తర్వాత శుభ్రం చేసుకోవడం సులభం అవుతుంది. ఐటీసీ గ్రూప్ హోటళ్లకు చెందిన ప్రముఖ చెఫ్ వివేక్ సాగర్ అందించిన 25 రకాల వంటల పుస్తకాన్ని ఉచితంగా అందుకోవచ్చు. ని ధర 14,995 రూపాయలు.

HTC-O talangana patrika telangana culture telangana politics telangana cinemaహెచ్‌టీసీ వన్ ఎస్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ వన్ ఎస్ మోడల్ ఫోన్‌ని ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. 1.7 జీహెచ్‌జెడ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్స్ కెమెరాతో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 1 జీబీ మెమరీని 16 జీబీ వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. 4.3 అంగుళాల స్కీన్ ఉండే ఈ ఫోన్ అన్నిరకాల ఆడియో, వీడియో ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌తో పాటు డ్రాప్‌బాక్స్‌లో 25 జీబీల క్లౌడ్ స్టోరేజీ ఉచితంగా లభిస్తుంది. దీని ధర 33,590 రూపాయలు.

gallery_1 talangana patrika telangana culture telangana politics telangana cinemaమైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ టాబ్లెట్స్
మైక్రోసాఫ్ట్ కంపెనీ ‘సర్‌ఫేస్’ బ్రాండ్ నేమ్ పేరుతో ప్రత్యేకమైన విండోస్ పీసీలను రూపొందిస్తోంది. త్వరలో రెండు టాబ్లెట్ పీసీలను ందుబాటులోకి తీసుకురానుంది. సర్‌ఫేస్, సర్‌ఫేస్ ప్రో పేరుతో ఇవి మార్కెట్‌లోకి వస్తాయి. సర్‌ఫేస్ విండోస్ ఆర్‌టీ ఓస్‌తో పనిచేస్తే, ప్రో విండోస్ 8 ఆధారంగా పనిచేస్తుంది. రెండింటి పరిమాణం ఒకటే అయినా సర్‌ఫేస్ 64 జీబీ వరకు ఎక్స్‌పెండబుల్ మెమరీని సపోర్ట్ చేస్తే ప్రో 128 జీబీ వరకు సపోర్ట్ చేస్తుంది. టచ్ కవర్, టైప్ కవర్లు వీటికి ప్రత్యేకంగా వస్తాయి. ఫోల్డ్ చేస్తే టచ్ కవర్ స్క్రీన్‌ని రక్షిస్తుంది. ఓపెన్ చేసి కనెక్ట్ చేస్తే కీబోర్డుగా పనిచేస్తుంది.

iball talangana patrika telangana culture telangana politics telangana cinemaఐబాల్ ఆండ్రాయిడ్ ఫోన్లు
ఇండియాకు చెందిన కంప్యూటర్ ఉపకరణాల తయారీ కంపెనీ ఐ బాల్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ ఫోన్లను రూపొందిస్తోంది. యాండీ 3ఈ, యాండీ 4డీ పేర్లతో లభిస్తున్న ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. 3ఈలో 650 ఎంహెచ్‌జెడ్ ప్రాసెసర్, 3.2 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. 4డీ 4 అంగుళాల డిస్‌ప్లేతో 1 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. 3ఈలో 3.2 ఎంపీ కెమెరా, 4డీలో 5 ఎంపీ కెమెరా ఉంటుంది. యాండీ 3ఈ ధర 6,990 రూపాయలు. 4డీ ధర 9490 రూపాయలు.

NY1498 talangana patrika telangana culture telangana politics telangana cinemaడీకేఎన్‌వై వాచీలు
డీకేఎన్‌వై మనదేశంలో తొలిసారిగా పురుషుల కోసం ప్రత్యేకమైన వాచీలను విడుదల చేసింది. ఆధునికమైన డిజైన్‌తో నేటి యువతని ఆకర్షించే విధంగా వీటిని రూపొందించారు. అమెరికాకు చెందిన డీకేఎన్‌వై కంపెనీకి చెందిన ఈ వాచీలలో లెదర్ బెల్టులు, స్టెయిన్‌లెస్ స్టీలు చైనులు కలిగినవి ఉన్నాయి. ఎన్‌వై 1325, ఎన్‌వై 1499, ఎన్‌వై 1501, ఎన్‌వై 1508 మోడల్స్ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 11,995 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.

Other News
    Most Viewed galleries


    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine