నెట్‌వర్కింగ్
ఫైల్ సింక్రనైజేషన్

మీరు చాలా సినిమా పాటల్ని సేకరించి పెట్టుకున్నారు. ఎన్నో ఫోటోల్ని కూడా భద్రపరుచుకున్నారు. అవన్నీ డిలీట్ అయిపోతే. కంప్యూటర్ పాడైపోతే? అందుకే మీ కంప్యూటర్‌లో ముఖ్యమైన ఫైళ్లను ఎప్పటికప్పుడు వేరే చోటికి బదిలీ చేసుకుంటూ ఉండాలి. మీ కంప్యూటర్‌లో కొత్త ఫైల్స్ చేర్చినప్పుడల్లా వాటిని భద్రపరుస్తూ ఉండాలి. అలాకాకుండా వేరే మార్గం లేదా? ఉంది.. అదే ఫైల్ సింక్రనైజేషన్... సమకాలీకరణం. అదేంటో తెలుసుకుందాం.
ఉదాహరణకి మీరు సంగీత ప్రేమికులు అనుకుందాం. చాలా సినిమాల ఎంపీ3 పాటల్ని సేకరించి పెట్టుకున్నారు. వాటి సైజు గిగాబైట్లలో ఉంది. అవన్నీ పోతే మీరు ఎంతో పోగొట్టుకున్నట్లే. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు వాటిని (సంగ్రహాన్ని) ఇంకో డిస్క్‌లోకి కాపీ చేసుకుంటూ ఉండాలి. దీన్నే బ్యాకప్ అంటాం. కానీ మనం వాడుతున్న కంప్యూటర్ మీదున్న సంగ్రహం ఎప్పటికప్పుడు మారుస్తుంటాం. కొత్తవి కలుపుతూనో, పాతవి కొన్ని తీసేస్తూనో, ఉన్నవాటిని రుస్తూనో ఉంటాం. ఈ మార్పులు కూడా ఎప్పటికప్పుడు బ్యాకప్‌లోకి పంపాలి.
అలాంటప్పుడు మళ్లీ ఫైళ్లన్నింటినీ కాపీ చేయడం చాలా నెమ్మదిగా జరిగే పని. అందుకు బదులుగా.. మారిన ఫైలు మాత్రమే కాపీ చేయాలి. మార్చవలసిన పైళ్లను కుదించి (కంవూపెస్) పంపాలి. పద్ధతినే సమకాలీకరణం అంటాం. ఓపెన్ సోర్స్‌లో ఆర్-సింక్ ఈ పని చాలా సులభంగా చేస్తుంది. ఈ పద్ధతిలో ఫైలు సారాన్నే కాకుండా, దాని లక్షణాన్ని కూడా సమకాలీకరించవచ్చు. ఈ పని నెరవేర్చడానికి ఎన్నో మృదులాంవూతాలు, అనువర్తనాలూ ఉన్నాయి. కొన్ని కొన్ని లక్షణాలు తప్పితే, ంచు అన్నీ చేసే ముఖ్యమైన పని సమకాలీకరించడమే.
Other News