Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, June 19, 2013
 


Home >> Features >> Techknowledge


టెక్ బజార్

SAMSUNG talangana patrika telangana culture telangana politics telangana cinema
స్యామ్‌సంగ్ డిష్‌వాషర్లు

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ కంపెనీ స్యామ్‌సంగ్ డిష్‌వాషర్ ఎఫ్‌ఎన్320టీని విడుదల చేసి భారత మార్కెట్లో డిష్‌వాషర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. అత్యాధునిక టెక్నాలజీతో డిజైన్ చేసిన ఈ డిష్‌వాషర్ వంటపావూతలను శుభ్రంగా, తక్కువ నీటితో కడుగుతుంది. తక్కువ డిట్జంట్‌ని, తక్కువ విద్యుత్‌ని వినియోగిస్తుంది. ఇంటెన్సివ్ వాష్‌వూపోక్షిగామ్, పవర్ 3 నాజల్ స్ప్రే, డిలేస్టార్ట్, ఆఫ్‌లోడ్, ఫ్లెక్సిబుల్ రాక్స్ ఇందులో ఉన్న సరికొత్త ఫీచర్లు. మిగిలిన డిష్‌వాషర్లతో పోలిస్తే ఇది 50 శాతం శబ్దాన్ని, 30శాతం నీటిని ఆదా చేసి, 20 శాతం వరకు విద్యుత్‌ని ఆదా చేస్తుందట. దీని ధర 31,990 రూపాయలు.

idea-id talangana patrika telangana culture telangana politics telangana cinema
ఐడియా ఐడీ 918 ఫోన్

ఐడియా సెల్యూలార్ మొబైల్ ఫోన్ల తయారీలో భాగంగా మరో ఫోన్‌ని విడుదల చేసింది. ఐడీ 918 మోడల్ పేరుతో లభిస్తున్న ఈ ఫోన్‌లో రెండు త్రీజీ డ్యుయల్ సిమ్‌లను ఉపయోగించే వీలుంది. ఐడియో గతంలో తయారుచేసిన స్మార్ట్ ఫోన్లు బ్లేడ్, ఐడీ-280ల తర్వాత మూడో ఫోన్‌గా 918ని రూపొందించింది. 2.3 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, 3.2 మెగాపిక్సెల్స్ కెమెరా, కవర్లు మార్చే వీలు, మల్టీ టచ్ స్క్రీన్, 2 జీబీ ఎన్‌బిల్ట్ మెమరీ, 32 జీబీ వరకు ఎక్స్‌పెండబుల్, ఫ్రీ లోడెడ్ సోయల్ యాప్స్ ఇందులో ఉన్న ఫీచర్లు. ఈ ఫోన్‌తోపాటు ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని ధర 5994 రూపాయలు.

sony talangana patrika telangana culture telangana politics telangana cinema
సోనీ స్మార్ట్ వాచ్

సోనీ కంపెనీ నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీతో రూపొందిన స్మార్ట్ వాచీని త్వరలో ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ వాచీలో ఎస్‌ఎమ్‌ఎస్‌లు చదువుకోవడమే కాదు, ఈమెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ స్టేటస్‌లను కూడా ఫాలో అవ్వొచ్చు. ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేసే ఏ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ పీసీతోనైనా దీన్ని బ్లూటూత్‌తో కనెక్ట్ చేయొచ్చు. దీని ధర 6,299 రూపాయలు ఉంటుందని అంచనా.

nokia-80 talangana patrika telangana culture telangana politics telangana cinema
నోకియా 808 ప్యూర్‌వ్యూ

నోకియా రూపొందించిన రెవల్యూషనరీ కెమెరా ఫోన్ నోకియా 808 ప్యూర్‌వ్యూ ఇప్పుడు ఇండియాలో కూడా లభిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న కెమెరా ఫోన్లలో ఇదే బెస్ట్ ఫోన్. ఇది హై రెజల్యూషన్ ఫోటోలను తీయడమే కాదు, డాల్బీ టెక్నాలజీతో శబ్దాలను కూడా ఎంతో నాణ్యతతో రికార్డు చేస్తుంది. 4 అంగుళాల పొడవైన స్క్రీన్ ఉండే ఈ ఫోన్ సింబియాన్ బెల్లే ఓఎస్‌తో పనిచేస్తుంది. 1.3 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 32 జీబీ ఎక్స్‌పెండబుల్ స్టోరేజీ దీని సొంతం. 11 గంటల 2జీ టాక్‌టైమ్, 6.5 గంటల 3జీ టాక్‌టైమ్‌ని ఇది కలిగి ఉంటుంది. 5368 x 7728 సైజ్ ఉండే ఫోటోల్ని ఇది క్యాప్చర్ చేస్తుంది. ఆటో ఫోకస్ 15 సీఎం ఫోకస్ రేంజ్ కెమెరాని ఇందులో ఉంది. దీని ధర 33,000 రూపాయలు.

Pic-1 talangana patrika telangana culture telangana politics telangana cinema
మరో రెండు ‘ఆశ’ ఫోన్లు

నోకియా మరింత మంది వినియోగదారులకు చేరువయ్యేందుకు ఆకర్షణీయమైన ధరలలో ఫోన్లని రూపొందిస్తోంది. తాజాగా విడుదలైన ఆశ శ్రేణిలోనే మరో రెండు ఫోన్లను విడుదల చేసింది. నోకియా ఆశ 305, 311ల పేరిట వీటిని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఆశ 305లో ఈజీ స్వాప్ డ్యుయల్ సిమ్, మూడు అంగుళాల రెసిస్టివ్ టచ్ స్క్రీన్, బ్లూటూత్, డ్యుయల్ బ్యాండ్ కనెక్టివిటీ, డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా 40 ఈఏ గేమ్స్, 2 ఎంపీ కెమెరా, నోకియా మ్యాప్స్, నోకియా బ్రౌజర్ ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకతలు. కలర్‌ఫుల్ కాంపాక్ట్ టచ్ స్క్రీన్, 3.2 ఎంపీ కెమెరా, ప్రి ఇన్‌స్టాల్డ్ నోకియా మ్యాప్స్, 15 లెవల్స్ ఫ్రీ బండిల్డ్ యాంగ్రీ బర్డ్స్ గేమ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్ మీడియా వేగవంతమైన ఇంటర్‌నెట్ సదుపాయం, నోకియా బ్రౌజర్ నోకియా ఆశ 311లోని ప్రత్యేకతలు.

Philips-L talangana patrika telangana culture telangana politics telangana cinema
ఫిలిప్స్ ఎల్‌ఈడీ స్ట్రీట్‌లైట్లు

ప్రముఖ లైటింగ్ కంపెనీ ఫిలిప్స్ కొత్తగా ఎల్‌ఈడీ స్ట్రీట్‌లైటింగ్ సొల్యూషన్ గ్రీన్‌లైన్ స్మార్ట్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా నగరాలు చేస్తున్న 70 శాతం విద్యుత్ వినియోగంలో 15 శాతం వీధిదీపాల కోసమే వినియోగించబడుతోంది. సీఎఫ్‌ఎల్-ఐ సంవత్సరానికి 500 రూపాయలు మాత్రమే ఆదా చేస్తున్న సాధారణ ట్యూబ్‌లైట్‌ల లైటింగ్ సొల్యూషన్‌ల కన్నా ఫిలిప్స్ స్క్రీన్‌లైన్ స్మార్ట్ 50 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తుంది.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine