గూగుల్ రామాయణం

క్లాసిక్ హిందూ ఎపిక్ రామయణాన్ని గూగుల్ ఇప్పుడు రీక్రియేట్ చేస్తోంది. కమ్యూనికేషన్, కొలాబరేషన్ కోసం రాముడు, సీత, హనుమంతుడు లాంటి క్యారెక్టర్లు ఉపయోగపడేలా రూపొందిస్తోంది. గూగుల్ ఇండోనేషియా చేసిన ఈ క్రోమ్ ఎక్స్‌పరిమెంట్ డిజిటల్ ఏజ్‌లో రామాయణాన్ని చూపించబోతోంది. స్టోరీ పాతదే. కాకపోతే రాముడు, సీత, హనుమంతుడు, రావణుడు గురించి కొత్త వెబ్‌టూల్స్‌గా కనిపిస్తారు. గూగుల్ టాక్, మ్యాప్స్, డాక్స్, జీమెయిల్, వెబ్‌సెర్చ్‌లకోసం సరికొత్త స్ట్రాటజీని ఉపయోగించనుంది. జటాయువు ఒక బ్లాగ్ కూడా రాస్తున్నాడు. దానికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్‌ని మీరు పైన బొమ్మలో చూడొచ్చు. ఈ స్క్రిప్ట్ మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ramaya.na క్లిక్ చేయండి. గూగుల్ క్రోమ్‌లో మాత్రమే ఇది లభిస్తుంది.
Other News