టెక్ బజార్
మైక్రోమ్యాక్స్ ఏ45
ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీల్లో 12వ స్థానం సంపాదించుకున్న మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ లిమిటెడ్ తాజాగా ఒక స్మార్ట్‌ని విడుదల చేసింది. ఏ45 పుంక్ పేరుతో లభిస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్ ఇది. 650 ఎంహెచ్‌జెడ్ ప్రాసెసర్, 8.89 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్, 320 X 480 స్క్రీన్ రిజెల్యూషన్, 32 జీబీ ఎక్స్‌పెండబుల్ మెమరీ, 2.0ఎంపీ కెమెరా, వాయిస్ రికగ్నిషన్ అప్లికేషన్, ఎ50 నింజా ఇందులో ఉన్న ఫీచర్లు. మీబుడ్డీ, ఫేస్‌బుక్, ఎంస్టోర్ అప్లికేషన్లతో పాటు గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే అప్లికేషన్లను కూడా ఇందులో ఉపయోగించుకోవచ్చు. నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తున్న దీని ధర 5,499 రూపాయలు.
Other News