Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, May 22, 2013
 


Home >> Features >> Techknowledge


టెక్ బజార్ చేజ్

chaze talangana patrika telangana culture telangana politics telangana cinemaచోటూ మొబైల్
చేజ్ మొబైల్ కంపెనీ తక్కువ ధరలో మల్టీమీడియా మొబైల్‌ని ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. చేజ్ చోటూ పేరుతో లభిస్తున్న ఈ ఫోన్ ధర 1099 రూపాయలు మాత్రమే. తక్కువ ధరలో లభిస్తున్న డ్యూయల్ సిమ్ కార్డ్ ఫోన్ కూడా ఇదే. రబ్బర్ కీబోర్డ్‌తో లభించే ఈ ఫోన్‌లో 4జీబీ వరకు మెమరీని ఎక్స్‌పెండ్ చేసుకోవచ్చు. 4.6 సెంటీమీటర్ల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్, యాహూ!లాంటి సోషల్ మీడియా ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఆటో కాల్ రికార్డర్, 1.3 ఎంపీ కెమెరా, మొబైల్ ట్రాకెట్, టార్చ్ ఇందులోని మరికొన్ని ఫీచర్లు.

GALAXY-SIII-4 talangana patrika telangana culture telangana politics telangana cinemaగెలాక్సీ ఎస్3 @ ఇండియా
స్యామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఫ్లాగ్‌షిప్ మోడల్ గెలాక్సీ ఎస్3 స్మార్ట్ ఫోన్‌ని ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. విదేశాల్లో ఇది పోయిన వారమే విడుదలైంది. ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 1 జీబీ ర్యామ్, 8 ఎంపీ కెమెరా, 4.8 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. మ్యూజిక్ హబ్, ఎస్ వాయిస్ ఇందులో ప్రత్యేక ఫీచర్లు. దీని ధర : 43,180 రూపాయలు.

5100 talangana patrika telangana culture telangana politics telangana cinemaడెల్ ఆల్ ఇన్ వన్
డెల్ కంపెనీ 27 అంగుళాల ఆల్ ఇన్ వన్ కంప్యూటర్‌ని విడుదల చేసింది. డెల్ అందిస్తోన్న ప్రీమియమ్ ఎక్స్‌పీఎస్ పెర్ఫామెన్స్ ఫ్యామిలీలో భాగంగా వీటిని రూపొందించింది. వీటితో పాటు 20 నుంచి 27 అంగుళాల రేంజ్‌లో కూడా ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లను కూడా విడుదల చేసింది.

micro talangana patrika telangana culture telangana politics telangana cinemaవిండోస్ 8 రిలీజ్ ప్రివ్యూ
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ ప్రివ్యూ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చింది. preview.windows.com నుంచి దాన్ని మీరు పొందొచ్చు. ప్రస్తుతానికి ఇది 14 భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో బింగ్ ట్రావెల్, న్యూస్, స్పోర్ట్స్‌లకు సంబంధించి ఎన్నో రకాల యాప్స్ ఉన్నాయి. గేమింగ్, ఎక్స్‌బాక్స్ యాప్స్ కూడా ఉన్నాయి. దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్న వారికి మిగిలిన ఇంప్రూవ్‌మెంట్స్‌ని ఈమెయిల్ ద్వారా పొందే అవకాశం ఉంది.

google-chro talangana patrika telangana culture telangana politics telangana cinemaగూగుల్ క్రోమ్ బుక్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ జెయింట్ గూగుల్ స్యామ్‌సంగ్ కంపెనీతో కలిసి క్రోమ్ బుక్‌లను లాంచ్ చేసింది. క్రోమ్ బుక్స్ అంటే గూగుల్ అందించే ల్యాప్‌టాప్‌లన్నమాట. క్రోమ్‌బాక్స్‌ల పేరుతో డెస్క్‌టాప్ వెర్షన్‌లను కూడా రూపొందించింది. క్రోమ్ బుక్‌లలో గూగుల్ తాజాగా లాంచ్ చేసి గూగుల్ డ్రైవ్ ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఫ్రీ యాంటీ వైరస్
నార్టన్ ఇంటర్‌నెట్ సెక్యూరిటీ 2013 ఇప్పుడు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. ప్రస్తుతానికి ఇది బేటా వెర్షన్‌లో లభిస్తోంది. వినియోగదారుల సలహా మేరకు దీన్ని మరింత ఇంప్రూవ్ చేయనుంది నార్టన్. దీన్ని వినియోగించుకోవాలని అనుకున్నవాళ్లు www.symantec.com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అప్‌డేట్స్
ఒపేరా మినీ 7

వెబ్ బ్రౌజర్ ‘ఒపేరా’ కంపెనీ లేటెస్ట్ వెర్షన్ ఒపేరా మినీ 7ని బ్లాక్‌బెర్రీ ఫోన్ల కోసం విడుదల చేసింది. స్మార్ట్ పేజీ సమ్మరీతో ఉండే ఈ బ్రౌజర్‌లో ఫేస్‌బుక్, ట్విట్టర్ ఫీడ్స్‌ని కూడా పొందొచ్చు. జావా కాపబిలిటీ ఉన్న ఫోన్లలో ఈ బ్రౌజర్‌ని వాడొచ్చు. దీన్ని m.opera.com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Other News
    Most Viewed galleries


    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine