ర్యాట్
నెట్‌వర్కింగ్
RAT : Remote Admin Tools
మనం ఈ మధ్య Trojan అనే పదాన్ని ఎక్కువగా వింటున్నాము. అయితే మన సిస్టమ్‌లో డిలీట్ అయ్యే Trojans ఎక్కడి నుంచో వచ్చాయని అనుకుంటాం. కానీ ఇంటర్‌నెట్ ఉన్న సిస్టమ్‌లో కొందరు అటాకర్స్ వాంటెడ్‌గా ఈ Trojansని క్రియేట్ చేసి వాటిని యాంటీ వైరస్ కూడా డిటెక్ట్ చేయకుండా మనకు మెయిల్, ఇతర మార్గాల ద్వారా మన సిస్టమ్‌లోకి చేరేలా చేస్తారు. దీని కోసం వాడే టూల్స్‌నే RAT అంటారు. దానిని మనం గనుక ఓపెన్ చేస్తే మన సిస్టమ్ రిమోట్‌గా అటాకర్స్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అయితే Trojanలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పడానికి లేదు. ఎందుకంటే.. ఆ అటాకర్ తను తయారు చేసిన Trojanని ఇతర ఇమేజ్, డాక్యుమెంట్స్, వీడియో, ఆడియో, టోరెంట్స్‌లో బైండ్ చేసి పంపిస్తారు. ఒక్కొక్కసారి మనం వాటిలో ఏమీ ఉండదులే అని ఓపెన్ చేస్తాం. అంతే! అవి వచ్చి మన సిస్టమ్‌లో చేరతాయి. దాని నుంచి మన సిస్టమ్‌ని రక్షించుకోవడానికి అవస్త్ లాంటి యాంటీవైరస్‌లని ఇన్‌స్టాల్ చేసి వాటిని ఎప్పుడు ఇంటర్‌నెట్ ద్వారా అప్‌డేట్ చేస్తూ ఉండాలి. సిస్టమ్‌ని తరచూ యాంటీవైరస్‌తో స్కాన్ చేస్తూ ఉండాలి.
Other News