ఐసీయూ సౌకర్యాలేమిటి ?
నా మిత్రుడి వయసు 3. శ్వాసకోశ సమస్యల కారణంగా అతన్ని ఆసుపవూతిలో చేర్పించాం. నాలుగు రోజుల తర్వాత క్రమంగా కోలుకోవడం కనిపించింది. అందుకే డాక్టర్లు ఇంటేన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచాలని చెప్పినా మేము ఒప్పుకోలేదు. అయితే, ఒకరోజు అర్ధరాత్రి పరిస్థితి విషమించింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే అతడు చనిపోయాడు. ఐసీయూలో ఉంటే ఇలా జరిగుండేది కాదు అని డాక్టర్లు అన్నారు. ఐసీయూలో జరిగే అంత ప్రత్యేక చికిత్సలు ఏముంటాయో తెలియపరచండి?
- డి. ముకుందరావు, ఆదిలాబాద్
శరీరం పలురకాల ఖనిజాలు, జీవరసాయాల ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. వ్యాధి గ్రస్తుల్లో వీటి స్థితిగతుల్లో ఎన్నో తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. శరీర వివిధ భాగాలు చాలా వేగంగా దుష్పరిణామాలకు లోనవుతూ ఉంటాయి. శరీరంలో ఉండే సహజమైన సమతుల్యత కూడా దెబ్బతింటుంది. ఐసీయూలో ఉంచినపుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని క్రమబద్ధం చేసే ఏర్పాట్లు ఉంటాయి. శరీరానికి తిరిగి కోలుకునేందుకు అవసరమైన వైద్య చికిత్సలన్నీ ఐసీయూలో అందుబాటులో ఉంటాయి. వ్యాధిగ్రస్తమైన శరీరానికి ఒక నిర్ణీత సమయంలో కోలుకునే శక్తి సహజంగానే ఉంటుంది.
అయితే శరీరంలోని కీలక భాగాలైన మెదడు, గుండె శ్వాసకోశాలు, కాలేయం, కిడ్నీలు, రక్తం దెబ్బ తినే వేగాన్ని బట్టి రోగి విషయం చాలా వరకు ఆధారపడి ఉంటుంది. హఠాత్తుగా గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం, గుండె సరిగా పనిచేయకపోవడం, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్లు తలెత్తడం, కడుపులో గానీ, మెదడులో గానీ రక్తవూసావం కావడం, వంటి సమస్యలు ఒక్కోసారి శరీరానికి కోలుకునే అవకాశం లేకుండా చేస్తాయి. ఇలాంటి సమయాల్లో రోగి పరిస్థితి చాలా వేగంగా క్షీణించడం ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు. అంతేకాదు, అప్పటిదాకా వేసుకుంటున్నా మాత్రలే పడక రియాక్షన్ రావచ్చు. మామూలుగా అయితే ఇలాంటి హఠాత్ పరిణామాలను ముందే ఊహించడం సాధ్యం కాదు. ఈ స్థితికన్నా ముందే రోగి ఐసీయూలో ఉంటే వెంటనే స్పందించి తక్షణ వైద్య చికిత్సలు అందించడం సాధ్యమవుతుంది. ప్రమాదాన్ని నిరోధించే అవకాశాలు ఉంటాయి.
ఐసీయూలో వెంటిలేటర్లు, డయాలసిస్ యంత్రాలన్ని అందుబాటులో ఉంటాయి. పైగా అందరూ మంచి నిపుణులు ఉంటారు. గుండె ఆగిపోయినపుడు లేదా గుండె లయలో తేడా వచ్చినపుడు ఆ స్థితిని నియంవూతించే డిఫెబిలేటర్లు ఉంటాయి. కాబట్టి తక్షణ సేవలు అందుతాయి. గుండె పనితన్నాన్ని పెంచడం, గుండె ఆగిన తక్షణమే తిరిగి పనిచేసేలా చేయడం ఐసీయూలో వీలవుతుంది. కిడ్నీలు పనిచేయనపుడు ఉపయోగించే రీనల్ రిప్లేస్‌మెంట్ థెరపీ కాలేయం సరిగా పనిచేయనపుడు ఉపయోగించే మార్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే మందులను అనుకున్నంత సూక్ష్మ స్థాయిలో ఇచ్చే ఇన్‌ఫ్యూజన్ పంపులు ఉంటాయి. వీటికి తోడు నాడీ లోపలి నుంచి ప్రతి బీట్‌ను కొలిచే వీలుంటుంది. ఏ కొంచెం తేడా వచ్చినా తక్షణమే వైద్య చికిత్సలు మొదలవుతాయి. దీని వల్ల విషమ స్థితిలోంచి కూడా రోగి బయటపడే అవకాశాలు ఐసీయూలో ఎక్కువగా ఉంటాయి.
Other News