Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, June 19, 2013
 


Home >> Features >> Salaha


ఇవే సంకేతాలు...

Revers talangana patrika telangana culture telangana politics telangana cinemaవయోభేదం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులను గమనిస్తుంటే ఎవరికైనా శరీరంలో చిన్న మార్పు కనిపించగానే వెన్ను జలదరిస్తుంది. శరీరం లోపలి అవయవాలలో జరిగే మార్పులను లక్షణాలు తీవ్రంగా కన్పించే దాకా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ మచ్చలు, గడ్డలు, పులిపిరి కాయలు, స్కిన్ ట్యాగ్స్ వంటివి కనిపించగానే ఉలిక్కిపడ్తూంటారు. క్యాన్సర్ ఏమో అని భయపడుతూ ఉంటారు. అందుకే అవగాహన పెంపొందించటానికి ఈ వివరాలు మీ కోసం.

మన శరీరంలో అతి పెద్ద అవయవం మన చర్మం. శరీరాన్నంతటిని కప్పి రక్షణ కవచంలా ఉండటమే కాకుండా, శరీర ఉష్ణోక్షిగత ను కాపాడుతూ నీటిని, కొవ్వును నిల్వ ఉంచుతూ విటమిన్ డి తయారీకి ఉపయోగపడుతుంది మన చర్మంలో పైన ఎపిడర్మిస్‌లో స్కామస్ సెల్స్, వాటి కింద బేసల్ సెల్స్ ఉంటాయి. ఎపిడెర్మిస్‌లో కింది భాగాన ఉండే మెలనో సైట్స్ ఉత్పత్తి చేసే మెలనిన్ వల్ల మన చర్మపు రంగు నిర్ణయమవుతుంది. ఎపిడర్మిస్ కింద ఉండే డెర్మిస్ లో రక్తం, లింఫ్ వ్యవస్థ, వెట్రుకల కుదుళ్లు, స్వేదం, సెబాషియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి ఉత్పత్తి చేసే సీబమ్, నూనెలవల్ల శరీరం పొడారి పోకుండా, తేమగా ఉండటమే కాకుండా శరీర ఉష్ణోక్షిగత కూడా నిలకడగా ఉంటుంది. టీనేజ్‌లో గానీ ఇతర వయసులలో హార్మోన్ల అసమతుల్యత వలన నూనె గ్రంథులు ఎక్కువగా సీబంను విడుదల చేస్తాయి.

దీంతో జిడ్డుతనం ఎక్కువై మొటిమలు, గడ్డల వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అవి తీవ్రంగా ఉన్నపుడు వాటితాలుకు మచ్చలు, గుంటలు ఏర్పడుతూ ఉంటాయి. అంతే కాకుండా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వ్యాపించే హెచ్‌పీవీ వైరస్ వల్ల పులిపిరి కాయలు ఏర్పడుతుంటాయి. ఇది కొంత మందిలో వాటంతట అవే రాలిపోయనా కొంత మందిలో శాశ్వతంగా ఉండిపోయి ఇంకా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. పులిపిరికాయలను కలిగించే హ్యమన్ పాపిలోమా వైరస్ క్యాన్సర్ కారకం కాదు. లైంగిక సంబంధాల వల్ల జననాంగాల దగ్గర వచ్చే పులిపిరి కాయలు కూడా క్యాన్సర్‌కు దారితీయవు. హెచ్‌పీవీ 16, 18 వంటి వైరస్ రకాలను ఆంకోవైరస్‌లుగా పేర్కొనవచ్చు.
111 talangana patrika telangana culture telangana politics telangana cinema
ఇది ఎటువంటి పులిపిరికాయలను కలుగ చేయవు. కానీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఎక్కువ. కచ్చితమైన కారణం తెలియకుండా అధికబరువు వల్లనో, జన్యుపరమైన కారణాల వల్లనో ఏ వయసులోవారికైనా కనిపించేవి స్కిన్ ట్యాగ్స్. వీటి వల్ల ఎటువంటి ఇబ్బంది లేకపోయినా పెద్ద సైజులో కన్పించే భాగాలలో ఉంటే తీసివేయించుకోవటం మంచిది. సాధారణంగా పెసరగింజంత ఉండే ఈ స్కిన్ ట్యాగ్స్, గోల్ఫ్‌బాల్ సైజులో కూడా పెరగవచ్చు. చాలా అరుదుగా వీటి రంగులో మార్పు, రక్తం కారటం వంటి లక్షణాలు కన్పించి స్కిన్ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. పుట్టుకతో వచ్చే మచ్చలు, కాకుండా 20 ఏళ్ల తర్వాత మచ్చలు వచ్చి అవి సరైన ఆకారంలో లేకుండా రంగు మారుతూ, రక్తం కారుతూ, ఉబ్బెత్తుగా ఉంటే క్యాన్సర్ అని అనుమానించాల్సి ఉంటుంది.

శరీరంలో అనేక ప్రాంతాలలో సాఫ్ ్టటిష్యూలతో ఏర్పడే కొవ్వు గడ్డలనే లైపోమా అంటారు. ఇది అక్కడక్కడ ఒకటి రెండు లేదా శరీరమంతా ఉండవచ్చు. ఎడిపోస్ టిష్యూలతో ఏర్పడే ఈ ప్రమాదకరం కాని గడ్డలు శరీరంలోపల అవయవాల మీద కూడా ఏర్పడితే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చర్మం కింద గానీ, రొమ్ములో గానీ గడ్డలు మెత్తగా, కదులుతూ కొద్ది వారాలుగా ఎటువంటి మార్పు లేకుండా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. మనం చేతితో తాకినపుడు గట్టి రాయిలాగా ఉండడం, చర్మంలోపలి గడ్డ కదలకుండా ఉండటం... లాంటి మార్పులు గమనిస్తే మాత్రం తప్పనిసరిగా అనుమానించాల్సి ఉంటుంది.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine