Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Friday, May 24, 2013
 


Home >> Features >> Salaha


హెపటైటిస్..వ్యాక్సిన్‌తో దూరం

liver_large talangana patrika telangana culture telangana politics telangana cinemaవర్షాకాలపు ఇన్‌ఫెక్షన్లలో హెపటైటిస్ వైరస్ కూడా ఒకటి. మన శరీరంలో కీలక అవయవమైన కాలేయానికే ఎసరు పెట్టే ఈ వైరస్‌లలో చాలా రకాలున్నాయి. వీటిలో హెపటైటిస్ బి, సి వైరస్‌ల ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. డాక్టర్ బ్లూంబర్గ్ హెపటైటిస్ వైరస్‌ను మొట్టమొదట గుర్తించారు. అందుకే ఆయన జన్మదినమైన జూలై 28ని అంతర్జాతీయ హెపటైటిస్ దినంగా కూడా పాటిస్తున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలతో హెపటైటిస్‌ను నివారించవచ్చు. ఈ జాగ్రత్తలతో పాటు వ్యాక్సిన్ వేయించుకుంటే దీన్ని నివారించడం సులభమే.

ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు శరీరంలో విషపదార్థాలను బయటకు పంపించడంలో కూడా కీలకపాత్ర వహించే కాలేయం అతి పెద్ద గ్రంథి. కాలేయ సమస్య అంటే ముందు కామెర్లు గుర్తొస్తాయి. కామెర్ల వ్యాధికి కారణాలు అనేకం ఉన్నా వైరల్ ఇన్‌ఫెక్షన్లు ప్రధానమైనవి. వైరస్‌ల వల్ల కలిగే వ్యాధే హెపటైటిస్. హెపటైటిస్ గురించి ఇప్పుడు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఆధునిక వైద్యం ఈ ఇన్‌ఫెక్షన్‌ను పూర్తిగా నయం చేయగలదు.

హెపటైటిస్.. ఏమవుతుంది?
- సాధారణంగా హెపటైటిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వారం తరువాత లక్షణాలు బయటపడతాయి.
- హెపటైటిస్ ఉన్నవాళ్లకు ఆకలి బాగా తగ్గిపోయి, తరచుగా వాంతులవుతుంటాయి. జ్వరం కూడా ఉంటుంది.
- కళ్లు, మూత్రం, చెమట పసుపు రంగులోకి మారతాయి.
- ఆరోగ్యవంతుల్లో గాల్‌బ్లాడర్ తయారుచేసే పిత్తరసం 1 నుంచి 1.5 మిల్లీక్షిగాములు ఉంటుంది. హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్ ఉన్నవారిలో ఇది 30 మిల్లీక్షిగాములకు పెరుగుతుంది.
- రక్తం, ముత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా దీన్ని నిర్ధారించవచ్చు.

హెపటైటిస్-బి
ఇది చాలా వేగంగా లివర్‌కు సమస్యలు తెచ్చిపెడుతుంది. ఒక రకంగా హెచ్‌ఐవీ కన్నా 50 నుంచి వంద రెట్లు ఎక్కువ ప్రమాదకరమైనది.
- ఇది రక్తం, లాలాజలం, వీర్యం, సర్వికల్ ద్రవాల ద్వారా వ్యాపించవచ్చు. వైరస్ చేరిన వెంటనే పెద్దగా లక్షణాలు కనిపించకపోవచ్చు. కొద్దిమందిలో ఫ్లూ లాంటి జ్వరం, తీవ్రమైన అలసట, వికారం, కళ్లు, ఒళ్లు పచ్చబడటం వంటి కామెర్ల లక్షణాలు, కడుపునొప్పి, విరేచనాలు, కీళ్లనొప్పులు ఉంటాయి.
- దీన్ని గుర్తించేందుకు యాంటిజెన్ పరీక్ష చేస్తారు. వైరస్ చేరిన వెంటనే ఈ పరీక్షలో తెలియదు. 6 నుంచి 12 వారాల తరువాత మాత్రమే పాజిటివ్ అన్న ఫలితం వస్తుంది. కాబట్టి మరిన్ని పరీక్షలు అవసరం అవుతాయి.
- దీని బారిన పడిన పది మందిలో 9 మందికి ఆర్నెల్లలో దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. కొద్దిమందిలో మాత్రమే శరీరంలో ఉండిపోయి దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా మారుతుంది. దాంతో లివర్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. లివర్ క్యాన్సర్ రావడానికి అతి ముఖ్య కారణం హెపటైటిస్-బి.
- ఇలాంటప్పుడు ఇన్‌ఫెక్షన్ ముదరకుండా లివర్‌ను దెబ్బతీయకుండా చికిత్స అందిస్తారు. ఫెగ్ ఇంటర్‌ఫెరాన్ లాంటి ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. కొన్ని వారాల పాటు మందులు వాడితే వైరస్ పెరుగుదల ఆగిపోతుంది. కొన్నిసార్లు జీవితాంతం కూడా చికిత్స తీసుకోవాల్సి రావచ్చు.

హెపటైటిస్ - సి
ఇది ఆర్నెల్లలో పోయేది కాదు. దీని బారిన పడిన ప్రతి అయిదుగురిలో నలుగురు దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌తో బాధపడతారు. అయితే అందరిలోనూ దీని ప్రభావం ఒకేరకంగా ఉండకపోవచ్చు. కొందరిలో అయిదేళ్లకే లివర్ సమస్యలు మొదలైతే మరికొందరికి సిర్రోసిస్ రావడానికి 20 ఏళ్లకు పైగా పట్టవచ్చు. దీంతో పాటు హెపటైటిస్-బి ఉండటం, మద్యం అలవాటు, ఊబకాయం లాంటివి తోడయితే వేగంగా ముదురుతుంది. దీర్ఘకాలిక హైపటైటిస్-సి ఇన్‌ఫెక్షన్ ఉన్నవారిలో మూడోవంతు మంది 10 నుంచి 15 ఏళ్లకు కామెర్లు, రక్తవాంతుల వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా రక్తం ద్వారానే సంక్రమించే వైరస్. హెపటైటిస్-బి లాంటి లక్షణాలే ఉండొచ్చు. దీన్ని గుర్తించేందుకు హెచ్‌సీవీ యాంటిబాడీల పరీక్ష చేస్తారు. వైరస్ మోతాదు తెలుసుకోవడానికి హెచ్‌సీవీ వైరస్ లోడ్ పరీక్ష చేస్తారు.
222 talangana patrika telangana culture telangana politics telangana cinema
నివారించవచ్చా?
- శరీరంలో హెపటైటిస్-బి వైరస్ ఉంటే వారి రక్తం, శారీరక స్రావాల ద్వారా ఇతరులకు కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. అంటే ఇది అరక్షిత శృంగారం, ఇతరులకు వాడిన ఇంజెక్షన్లు, సూదులు, సిరంజిలు, బ్లేడులు, టూత్‌వూబష్‌లు, నెయిల్ క్లిప్పర్ల వంటి వాటి ద్వారా వ్యాపిస్తుంది.
- హెపటైటిస్- సి వైరస్ ప్రధానంగా రక్తం ద్వారా సంక్రమిస్తుంది. కాబట్టి రక్తం ఎక్కించే విషయంలో సంపూర్ణ జాగ్రత్తలు అవసరం.
- ఇతరుల రేజర్లు, బ్రష్‌లు అసలు వాడకూడదు.
- డెంటిస్టుల దగ్గర గానీ, ఆక్యుపంక్చర్ చికిత్సకు వెళ్లినప్పుడు గానీ ఇతరులకు వాడిన పరికరాలు, సిరంజిలు, సూదులు మళ్లీ వాడకుండా చూసుకోవాలి.
- చెవులు కుట్టేందుకు, టాటూలు వేసేందుకు వాడే వస్తువులు కూడా మరొకరికి వాడకూడదు.
- తల్లికి హెపటైటిస్-బి ఉంటే కాన్పు సమయంలో పుట్టే బిడ్డకు కూడా సోకవచ్చు.
అందుకే పుట్టగానే వీరికి టీకా ఇప్పించాలి. హెపటైటిస్ వ్యాక్సినేషన్ చేయించుకోకుంటే అది లివర్ క్యాన్సర్, సిర్రోసిస్‌లకు దారితీయవచ్చు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine