Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Friday, May 24, 2013
 


Home >> Features >> Salaha


వాంతులకు విరేట్రం

Large talangana patrika telangana culture telangana politics telangana cinemaమా అమ్మాయి వయసు 18 సంవత్సరాలు. ప్రతీనెల నెలసరిలో తీవ్రమయిన కడుపునొప్పితో బాధపడు తోంది. ఐతే కడుపులో నొప్పి నెలసరికి రెండు రోజుల ముందే వస్తోంది. నెలసరి నాలుగు రోజులు ఒకటే వాంతులు, విరేచనాలు ఉంటున్నాయి. అసలు మంచం దిగలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఏమీ తినదు, విపరీతంగా నీరసంగా ఉంటుంది. దయచేసి తన సమస్యకు సరియైన పరిష్కారం చూపగలరు.

- సరస్వతి, మహబూబ్‌నగర్


నెలసరి సమయంలో వచ్చే నొప్పిని డిస్మెనోరియా అంటారు. ఈ నొప్పి ఒక్కొక్కరికి ఒక్కోలాగ ఉంటుంది. కొంత మందికి ముందు మొదలయితే మరి కొంత మందికి నెలసరి రోజుల్లోనే ఉంటుంది. కొంత మందికి, వాంతులు విరోచనాలు అయితే కొంత మందిలో తలనొప్పి, తలతిరగటం, కోపం, చిరాకు లాంటి లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్కరిలో లక్షణాలు ఒక్కోలా ఉంటాయి. హోమియో వైద్యానికి ఈ రకం లక్షణాలు చాలా అవసరం. మీ అమ్మాయి విషయంలో విరేట్రం ఆల్బం అనే మందు 30 పవర్‌లో నెలసరికి వారం ముందు 4 వారాలు వాడండి. తప్పకుండా ఫలితం ఉంటుంది. రోజూ సూర్య నమస్కారాలు చేయించండి. పొట్ట లోని కండరాలు వదులయి నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది.

నా వయసు 31 సంవత్సరాలు. పెళ్లై 5 సంవత్సరాలైంది. ఇంకా పిల్లలు పుట్టలేదు. చాలా మంది డాక్టర్లకు చూపించాము. నాభార్యకు, నాకు టెస్టులు చేయించాము. నాకు వీర్యకణాలు తక్కువగా ఉన్నాయని పరీక్షల్లో తెలిసింది. వీర్యకణాలు పెరగాలంటే ఎలా? హోమియో వైద్యంలో దీనికి పరిష్కారం ఏమిటి?

- కృష్ణ కుమార్, మానకొండూరు


ప్రతి మగవారిలోనూ పిల్లలు పుట్టాలంటే తగినంత సంఖ్యలో వీర్యకణాలు ఉండాలి. ప్రతి క్యూబిక్ మిల్లీమీటరుకు 50 నుంచి 70 మిలియన్ల వీర్యకణాలు ఉండాలి. ప్రతి శుక్ర కణం ఆకారం, వీర్యమండలి విస్కాసిటి, ఆమ్ల, క్షార తత్వం, శుక్రకణాల కదలికల లాంటివి పరిగణనలోకి తీసుకుంటారు. అంటే వీటిలో ఏ గణాంకాలు సరిపోకపోయినా అండం ఫలదీకరణ చెందదని అర్థం. మందుల వల్ల వీర్య కణాల సంఖ్యను పెంచటమే కాకుండా వీర్యకణాల ఆకృతిని మరియు ఇతర తేడాలను సరిచేయవచ్చు. దీనికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. మీలో ఉన్న సమస్యలు అంటే పైకి కనిపించే లక్షణాలు, వీర్యకణాల తగ్గుదలకు గల కారణాలు, అంతకు ముందు మీకు ఏమైనా జబ్బులుండేవా అన్న వివరాలు చాలా ముఖ్యం. మీరు ఈ విషయాలన్నీ పంపలేదు. పరీక్షల్లో మీ వీర్య కణాలు 25 మిలియన్లని మాత్రమే పంపారు. కాబట్టి మీరు ఆరంమెట్ 30 పొటెన్సీలో నెలకొక సారి 3 నెలలు వాడండి. కాల్కేరియా ఫ్లోర్ 6ఎక్స్ అనే మందు రోజూ 4 మాత్రలు రాత్రిపూట వాడండి. వీర్యకణాలు తప్పకుండా పెరుగుతాయి.

నేను నాలుగు సంవత్సరాలుగా కీళ్ల వ్యాధితో బాధపడుతున్నాను. డాక్లర్‌కు చూపిస్తే గౌట్ అని చెప్పారు. రోజూ నొప్పికి మందులు వాడాల్సి వస్తోంది. రెండు రోజులు మందులు వాడనట్టయితే నొప్పులు మళ్లీ మొదలవుతాయి. నొప్పి కాళ్లలో మొదలై శరీరమంతా పాకింది. నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా కూడా ఉంది. చలి గాలి పడదు. వర్షం వచ్చినా తుపాను గాలి వీచినా నొప్పులు ఎక్కువవుతాయి. నొప్పులు ఒక కీలు నుంచి మరో కీలుకు వస్తూ పోతూ ఉంటాయి. దయచేసి నా సమస్యకు మంచి హోమియో మందులు చెప్పండి.

- భాస్కర్, నిజామాబాద్


గౌట్ వ్యాధి ముఖ్యంగా కాలి బొటన వేలు నుంచి మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి వ్యాధి తీవ్రతరమై మిగతా కీళ్ళకు పాకుతుంది. హోమియో వైద్య సిద్ధాంతం ప్రకారం గౌట్‌ను సైకోటిక్ మయాస్మాటిక్ డిజార్డర్‌గా పరిగణిస్తారు. మీకు ఆస్తమా ఉండటం కూడా ఈ సిద్ధాంతాన్ని బలపరుస్తోంది. రక్తంలో యూరిక్ ఆసిడ్ ఎక్కువ కావడం వల్ల ఈ వ్యాధి తీవ్రమవుతుంది. యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండే గుడ్డు, మాంసము, ఆల్కహాల్ లాంటి వాటికి ముందు దూరంగా ఉండండి, రోగం చాలా మటుకు తగ్గుతుంది. ఇలాంటి ఆహారం తిని ఎన్ని మందులు వాడినా రోగం పూర్తిగా నయం కాదు. మీరు బెంజోయిక్ ఆసిడ్ అనే హోమియో మందు 30 పొటెన్సీలో 15 రోజులకు ఒకసారి 4 నెలలు వాడండి. హోమియో మందులతో గౌట్ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.
333 talangana patrika telangana culture telangana politics telangana cinema
నాకు 4 సంవత్సరాలుగా కుడి వైపు ఇంగ్వైనల్ హెర్నియాతో బాధ పడుతున్నాను. హోమియో మందులతో ఇది తగ్గుతుందా?

- రాంరెడ్డి, మెదక్


హెర్నియా అనేది సర్జికల్ డిజార్డర్. అంటే శస్త్రచికిత్సతో నయం చెయ్యగల వ్యాధి. ఉదరంలోని భాగాలు యటికి చొచ్చుకు రావటాన్ని హెర్నియా అంటారు. ఆ బయటకు వచ్చిన దాన్ని సర్జరీ ద్వారానే నయం చేసే అవకాశం ఉంది. హోమియో మందులే కాదు. ఏ మందులతోనూ హెర్నియా తగ్గదు. సర్జరీ పరంగా ఇది చాలా చిన్నదే. మీరు మెదక్‌లో ఉన్న మంచి సర్జన్‌ను కలవండి. త్వరగా ఆపరేషన్ చేయించుకోండి.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine