స్థూలకాయానికి సర్జరీ
ఆధునిక ఆహార అలవాట్లు తెచ్చిపెడుతున్న అనర్థాలలో ముందు వరుసలో ఉండేది ఒబెసిటీ.. స్థూలకాయం. అనేక రకాల సమస్యలకు కేంద్రబిందువు ఇదే. కీళ్లనొప్పులు, గుండెజబ్బులు, షుగర్, బీపీ లాంటి సమస్యల అవకాశాల్ని నాలుగింతలు చేస్తుంది. శరీరంపై కంట్రోల్ లేకుండా ఒకసారి బరువు పెరిగి స్థూలకాయం బారిన పడితే ఇక మామూలుగా తయారవడం చాలా కష్టం. చాలా సందర్భాల్లో ఆపరేషన్ తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు.
మనం తీసుకునే ఆహారం నుంచే శక్తి ఉత్పత్తికి కావలసిన కేలరీలు వస్తాయి. అవసరమైన శక్తికి తగినంత కేలరీలు తీసుకోకుంటే బలహీనపడతాం. అవే కేలరీలు అదనంగా తీసుకుంటే మాత్రం ప్రమాదం. అదనపు కేలరీలు కొవ్వుపదార్థాలుగా మారి శరీరంలోని వివిధ భాగాల్లో పేరుకుపోతాయి. అలా క్రమంగా బరువు పెరగడానికి కారణమవుతాయి. దీర్ఘకాలం పాటు అదనపు కేలరీలను తీసుకుంటే స్థూలకాయానికి దారితీస్తుంది. అయితే స్థూలకాయులందరిలోనూ అదనపు కేలరీలే ఇందుకు కారణం కాకపోవచ్చు. కొందరిలో వంశపారంపర్యంగా కూడా స్థూలకాయం రావచ్చు.
స్థూలకాయానికి కారణమయ్యే జన్యువులను ఆధునిక అలవాట్లు ప్రేరేపిస్తాయి. కేలరీలు ఎక్కువగా ఉండే ఫాస్ట్‌ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, వాటిని కరిగించేలా ఒళ్లు వంచి పనిచేయకపోవడంతో ఈ సమస్య మరింత పెరుగుతోంది. ఆధునిక సౌకర్యాలు శారీరక శ్రమను తగ్గిస్తున్నాయి. స్థూలకాయం తగ్గడానికి ఆధునిక సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సర్జరీ చేసుకున్న తరువాత వ్యాధిక్షిగస్థులలో 60 శాతం మందికి పైగా అధిక రక్తపోటు మాత్రలను పూర్తిగా ఆపేయాలి. సర్జరీ తరువాత రెండు మూడు నెలల్లో వీరి రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. సాధారణంగా ఊబకాయం తగ్గడానికి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, ల్యాప్‌బ్యాండ్, గ్యాస్ట్రిక్ బైపాస్ లాంటి చికిత్సపూన్నో అందుబాటులో ఉన్నాయి.
స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ
ఈ సర్జరీని పూర్తిగా లాప్రోస్కోపిక్ విధానంలో చేస్తారు. పొట్ట మీద అయిదు చిన్న రంధ్రాలను వేస్తారు. ఒక గంటలో సర్జరీ పూర్తవుతుంది. జీర్ణాశయంలో 80 శాతాన్ని తొలగించి, ఒక చిన్న సంచిలా తయారుచేస్తారు. జీర్ణాశయ పేగులకు వెళ్లే చిన్న నాళాన్ని మాత్రం అలాగే ఉంచుతారు. దీనితో జీర్ణాశయ పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది. కొద్దిపాటి ఆహారం తీసుకున్నా కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. ఈ సర్జరీ చేయించుకున్నవారు రెండు మూడు రోజులు ఆసుపవూతిలో ఉండాల్సి వస్తుంది. రెండు వారాల్లో దైనందిన కార్యక్షికమాలను యథావిధిగా నిర్వర్తించుకోవచ్చు.

ల్యాప్ బ్యాండ్
ఈ విధానంలో జీర్ణాశయం పై భాగంలో ఒక బ్యాండు వేస్తారు. దాంతో అది ఒక చిన్న సంచిలాగా తయారవుతుంది.
ఈ సర్జరీని కూడా లాప్రోస్కోపిక్ పద్ధతిలోనే చేస్తారు. అయితే దీనికోసం ఒక రోజు ఆసుపవూతిలో ఉంటే సరిపోతుంది. తరువాతి కాలంలో అవసరాన్ని బట్టి ఈ బ్యాండ్‌ను వదులుచేసుకోవడం లేదా బిగుతుగా చేయడం సాధ్యపడుతుంది. అవసరమైతే ఈ బ్యాండ్‌ను తొలగించుకోవచ్చు. రిస్క్ ఉండకపోవడం, చికిత్సా విధానం సులువుగా ఉండడం, తిరిగి మార్చుకునే సౌకర్యం కలిగివుండడం వల్ల ఈ సర్జరీ పట్ల ఎక్కువ మంది మొగ్గు చూపుతారు.
గ్యాస్టిక్ బైపాస్
దీనిలో జీర్ణాశయాన్ని సుమారు 60 నుంచి 70 శాతం ఉపయోగంలోకి రానివ్వరు. ఈ క్రమంలో జీర్ణాశయాన్ని రెండు వేరు చేస్తారు. పైభాగాన్ని కోడిగుడ్డు పరిమాణంలో ఒక చిన్న సంచిలాగా తయారు చేస్తారు. కింది భాగాన్ని మాత్రం తొలగించరు. దీనివల్ల అందులోకి ఆహారం ప్రవేశించనప్పటికీ అక్కడ ఉత్పత్తి అయ్యే జీర్ణరసాలు జీర్ణక్షికియలో తోడ్పడుతాయి. జీర్ణాశయాన్ని వేరుచేయడానికి స్టాప్లింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. పైభాగంలో ఆహారం కింది భాగానికి చేరే అవకాశం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండదు. ఈ సర్జరీ చేసుకున్న రోగులు రెండు మూడు రోజులు ఆసుపవూతిలో ఉండాల్సి ఉంటుంది.
సర్జరీ తరువాత...
ఆపరేషన్ అనంతరం రోగులు శరీరంలో చోటుసుకున్న మార్పులకు అలవాటు పడేందుకు కొద్దిరోజులు పడుతుంది. సర్జరీ తరువాత మొదటి ఆరు నెలలు మితంగా ఆహారం తీసుకోవడం, నెమ్మదిగి తినడం అలవాటు చేసుకోవాలి. రోజుకు మూడుసార్లు చేసే బదులు నాలుగు నుంచి ఆరుసార్లు మితంగా ఆహారం తీసుకోవాలి. స్థూలకాయం పోవడానికి సర్జరీ ఒక వైద్యవిధానం మాత్రమే. ఆహార అలవాట్లను, జీవనశైలిన మార్చుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలుంటాయి.
Other News