హైపోథైరాయిడ్‌కి హోమియో

థైరాయిడ్ లేదా అవటు గ్రంథి మెడ మధ్యభాగంలో గొంతు ముందు ఉండే ముఖ్యమైన వినాళక్షిగంథి. థైరాయిడ్ గ్రంథి అయోడిన్ కలిగిన టి3, టి4 (థైరాక్సిన్) అనే హార్మోన్‌లను విడుదల చేస్తుంది. ఇది శరీరంలో సాధారణ జీవక్షికియ వేగాన్ని నియంవూతిస్తుంది. ఇది ఉత్పత్తి చేసే థైరాక్సిన్ హార్మోన్ తగ్గడం వల్ల హైపోథైరాయిడిజమ్ అనే రోగ స్థితి ఏర్పడుతుంది. వీటితో పాటు థైరాయిడ్ గ్రంథి వాయడం (థైరాయిడ్ ఇన్‌ఫ్లమేషన్), హషిమోతోస్ థైరాయిడైటిస్, థైరాయిడ్ గ్రంథి లేకపోవడం, హైపోథాలమస్ లేక పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లు తక్కువగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కొన్ని సందర్భాల్లో హైపోథైరాయిడిజం ప్రసవానంతర థైరాయిడైటిస్ వల్ల కలుగుతుంది. కొద్ది మందిలో ఇది శాశ్వత హైపోథైరాయిడిజంగా మారవచ్చు. దీనికి వంశపారంపర్య కారణాలు కూడా ఉన్నాయి. ప్రాథమికంగా హైపోథైరాయిడిజం థైరాయిడ్ గ్రంథి సంబంధిత హసిమోతోస్ థైరాయిడైటిస్ వల్ల కలుగుతుంది.
పిట్యుటరీ గ్రంథి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టి.ఎస్.హెచ్.)ను తగినంత ఉత్పత్తి చేయకపోవడం రెండవ కారణం. హైపోథాలమస్ తగినంత థైరోవూటాపిన్ హార్మోన్ (టి.ఆర్.హెచ్.)ను ఉత్పత్తి చేయకపోయినా వస్తుంది. టి.ఆర్.హెచ్. పిట్యుటరీ గ్రంథి టి.ఎస్.హెచ్ తయారుచేయడానికి సహాయపడుతుంది. టి3, టి4 హార్మోన్లు తగిన మోతాదులో ఉత్పత్తి కాకపోవడమే హైపోథైరాయిడిజం మొదటి లక్షణం. అలసట, బరువు పెరగడం, చర్మం ఎండిపోయి పొడిబారడం, వెంట్రుకలు రాలిపోవడం, నిరాశ, మందకొడిగా ఉండటం, మలబద్దకం, కండరాల నొప్పి, తిమ్మిర్లు, గుండె తక్కువగా కొట్టుకోవడం లాంటివన్నీ ప్రాథమికంగా హైపోథైరాయిడిజంలో కనిపించే లక్షణాలు. మహిళల్లో నెలసరి సమస్యలు, పిల్లలు కలుగకపోవడం హైపోథైరాయిడిజం వల్ల ఎదురయ్యే సమస్యలు. ఆలస్యంగా కనిపించే లక్షణాలు - గాయిటర్, గొంతు బొంగురుపోవడం, అసాధారణ రుతుచక్షికాలు, తక్కువ ఉష్ణోక్షిగత, ముఖం మీద చర్మం పొడిబారిపోవడం. అసాధారణ లక్షణాలు - జ్ఞాపకశక్తి తగ్గడం, రక్తహీనత, వెంట్రుకలు రాలడం, కోపం, చిరాకు, అస్థిర భావాలు, ఎక్కువగా నిద్రపోవడం, లైంగిక వాంఛలు తగ్గడం, సీరమ్ కొలెవూస్టాల్ పెరగడం, రుచి, వాసన తెలియకపోవడం. ప్రాథమిక హైపోథైరాయిడిజం నిర్ధారణకు టి3, టి4, టి.ఎస్.హెచ్. పరిమాణాలు ల్యాబొరేటరీలో కొలవడం ద్వారా నిర్ధారించవచ్చు. టి.ఎస్.హెచ్. ఎక్కువగా ఉంటే టి3, టి4 సరిగా ఉత్పత్తి కావడం లేదని భావించవచ్చు.
చికిత్స :థైరాక్సిన్, ట్రై అయిడో థైరోనిన్ హార్మోన్‌లను రోగులకు కృత్రిమంగా ఇవ్వడం ద్వారా హైపోథైరాయిడిజం లక్షణాలను తగ్గించవచ్చు. థైరాయిడ్ సమస్యలకు హోమియోలో అద్భుతమైన చికిత్స ఉంది. హోమియో వైద్యంలో రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు ఇస్తారు. సరైన హోమియో మందులను తగిన మోతాదులో నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడటం ద్వారా హైపోథైరాయిడిజం లక్షణాల నుంచి విముక్తి పొందవచ్చు.
Other News