Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Friday, May 24, 2013
 


Home >> Features >> Salaha


ఈ క్యాన్సర్ నివారించవచ్చు

cervical

గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ గురించి విని కూడా పట్టించుకోలేదా? అయితే మీరు పెద్ద తప్పిదమే చేస్తున్నారని అర్థం. భారత దేశంలో సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. యేటా ఒక లక్ష ముప్పైనాలుగు వేల రెండువందల నలభై సర్వైకల్ క్యాన్‌ర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య 2025వ సంవత్సరం కల్లా రెండులక్షలు దాట వచ్చునని ఒక అంచనా. సర్వైకల్ కాన్సర్ వల్ల ఏటా మరణిస్తున్న వారి సంఖ్య డెభ్బైరెండు వేల పై మాటే.
సర్వైకల్ కాన్సర్ అంటే ఏమిటి?
గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్‌కాన్సర్ అంటారు. గర్భాశయ ముఖద్వారం అనేది గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నని ప్రదేశం. ఇది పేరుకు తగ్గట్టుగానే గర్భాశయానికి ముఖధ్వారం లాగానే పని చేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. గర్భాశయానికి ముఖ ద్వారపు క్యాన్సర్‌ను మిగతా అన్ని రకాల క్యాన్సర్‌ల కంటే సులభంగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిండమే దీనికి ఉత్తమ పరిష్కార మార్గం. సర్వైకల్ క్యాన్సర్‌కు చికిత్స చేయడం కూడా చాలా సులభం. అయితే దీనిని ఎంత ముందు గా గుర్తిస్తే అంత సులభంగా చికిత్స చేయవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ 50 సంవత్సరాలు నిండిన మహిళలు ఎవరికైనా రావచ్చు.
కారణాలు
హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్ సర్వైకల్ క్యాన్సర్‌కి ముఖ్యకారణం. ఈ వైరస్ సెక్స్ ద్వారా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాప్తి చెందుతుంది.దాదాపు సగం మంది జనాభా జీవితంలో ఏదో ఒక సమయం లో హెచ్‌పీవీ వైరస్ కలిగి ఉంటారు. అయితే అందరి లోను ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు దారి తీయదు. కేవలం కొంత మంది మహిళలకు మాత్రమే క్యాన్సర్ రావచ్చు. సెక్స్‌లో పాల్గొనటం మొదలు పెట్టిన స్త్రీలు, లేదా వారి భాగస్వాములు ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనటం వల్ల హెచ్‌పీవీ సోకే అవకాశం మరీ ఎక్కువ. హెచ్‌పీవీ వైరస్ అనేక రకాలు. సాధారణంగా హెచ్‌పీవీ దానంతటదే నశించి పోతుంది. ఒక వేళ నశించక పోతే కొంత కాలం తరువాత క్యాన్సర్‌కి దారి తీయవచ్చు. హెచ్‌పీవీ వైరస్ మాత్రమే కాదు, ధూమపానం, ఎయిడ్స్, ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం గర్భనిరొధక మాత్రలు వాడటం, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనడం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు.
నివారణ
పాప్ పరీక్ష అత్యంత ఆధారపడదగిన, ఉపయు క్తమైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష. 21 సంవత్సరాలు నిండిన లేదా శృంగారంలో పాల్గొనటం ప్రారంభించి 3సంవత్సరాలు గడిచినా క్రమం తప్పకుండా పాప్ పరీక్ష చేయించుకోవాలి. అంటే మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. శక్తి వంతమైన వైరస్, బాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం యాంటిబాడిస్‌ను తయారు చేస్తుంది. అయితే హెచ్‌పీవీ వైరస్ విషయంలో మన శరీరం ఎటువంటి యాంటీ బాడీలను తయారు చేయదు. దాని వల్ల ఇన్‌ఫెక్షన్ జీవితాంతం ఉండిపోతుంది. ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. ఈ యాంటీ బాడీల వల్ల హెచ్‌పీవీ నుంచి రక్షణ దొరుకుతుంది. హెచ్ పీ వీ వ్యాక్సిన్ యోని మరియు గర్భా శయ ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్‌లను నివా రించడానికి తోడ్పడుతుంది. అమెరికన్ క్యాన్సర్‌లను నివారించడానికి తోడ్పడు తుంది. అమెరికన్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వారి రికమెం డేషన్ ప్రకారం 11 సంవ త్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకు ఇప్పించాలి. అయితే 9 నుంచి 18 సంవత్సరాల లోపు వయ సు వరకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఈ వ్యాక్సి న్‌ను 6 నెలల వ్యవధిలో 3సార్లు ఇప్పిం చాలి. దీని వల్ల సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine