Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, May 22, 2013
 


Home >> Features >> Salaha


కంట్రోల్ తప్పితే..

Body05 talangana patrika telangana culture telangana politics telangana cinema
‘వర్షం పడుతోంది కదా.. ఇది సాధారణమే..’ పదే పదే మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలా అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో మాత్రం దీన్ని సమస్యగా పరిగణించాల్సి వస్తుంది. కంట్రోల్ తప్పి లీక్ అవుతుంటే దాని వెనుక ఏదో సమస్య ఉందని అనుమానించాల్సిందే. మూత్ర విసర్జనపై కంట్రోల్ తప్పడాన్ని యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటారు. మహిళల్లో ఇది సర్వసాధారణం. బయటకు చెప్పడానికి సిగ్గుపడి చాలామంది ఈ సమస్యతో లోలోపలే కుమిలిపోతుంటారు. కనీసం డాక్టర్‌ని సంప్రదించడానికి కూడా వెనుకాడుతుంటారు. కానీ ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి.

కారణాలు..
యురెత్రా పరిమాణం కేవలం 4 సెంటీమీటర్లు మాత్రమే ఉండడం ఒక కారణమైతే కటి భాగంలోని కండరాలు, కణజాలాలు బలంగా లేకపోవడం మరో కారణం. నార్మల్ డెలివరీ అయినవాళ్లలో ప్రసవం తరువాత ఈ సమస్య సాధారణంగా కనిపిస్తుంది. పుట్టేటప్పుడు ఏవైనా గాయాలైనా, యాక్సిడెంట్‌కు గురయి దెబ్బలు తగిలినా కూడా పెల్విక్ కండరాలు బలహీనపడి ఈ సమస్య తలెత్తుతుంది. పురుషుల్లో యురెత్రా 25 సెంటీమీటర్లు ఉంటుంది. కాబట్టి సమస్య తక్కువే. నరాల సమస్యలు, ప్రొస్టేట్ సమస్యలున్నవాళ్లలో ఈ సమస్య మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Yankaya talangana patrika telangana culture telangana politics telangana cinema

లక్షణాలు
- నవ్వినా, దగ్గినా, తుమ్మినా, బరువుపూత్తినా, వ్యాయామం చేసినా మూత్రం పడుతుంది. న్యూరోజెనిక్ స్పైనల్‌కార్డ్ ఇంజురీస్ అంటే వెన్నెముకకు దెబ్బలు తగలడం వల్ల నరాలు ప్రభావితమై ఇటువంటి సమస్య తలెత్తవచ్చు. దీన్నే స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటారు.
- బాత్రూమ్‌లోకి వెళ్లేలోపే మూత్రం పడిపోతుంది.
- రాత్రి పక్క తడుపుతారు.
- తరచుగా పదే పదే బాత్రూమ్‌కి వెళ్లాల్సి వస్తుంది.

ఆపరేషన్ తరువాత..
కటి భాగంలోని అవయవాలకు ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఆపరేషన్ తరువాత ఇలాంటి సమస్య రావచ్చు. సర్జరీ సమయంలో ఏవైనా గాయాలు కావడం, కొన్నిసార్లు యురెత్రా దగ్గర్లోని కణజాలాలను తొలగించాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు కూడా ఆ భాగం బలహీనమై సమస్య వస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి పెద్దది కావడం వల్ల బ్లాడర్‌పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల మూత్రం పూర్తిగా విసర్జన కాదు. దాదాపు లీటర్ దాకా మూత్రం బ్లాడర్‌లోనే ఆగిపోయి లీక్ అవుతూ ఉంటుంది. దీన్ని ఓవర్‌ఫ్లో ఇన్‌కాంటినెన్స్ అంటారు. ప్రొస్టేట్ సమస్య ఉన్నప్పుడు కండరాలకు పనివుండదు కాబట్టి ప్రొస్టేట్ ఆపరేషన్ తరువాత కూడా అవి అంత సమర్థవంతంగా పనిచేయవు. మూత్ర విసర్జనలో రెండు కవాటాల్లాంటి నిర్మాణాలు పనిచేస్తాయి. కండరాలు సంకోచించినప్పుడు ఈ కవాటాలు తెరుచుకుంటాయి.

మూత్రం విసర్జన అవుతుంది. తర్వాత అవి మూసుకుంటాయి. ప్రొస్టేట్ సమస్య వల్ల ప్రొస్టేట్ గ్రంథిని తొలగించాల్సి వచ్చినప్పుడు గ్రంథితో పాటు అంతర్గత కవాటాన్ని కూడా తీసేయాల్సి వస్తుంది. ఇకపోతే బాహ్య కవాటం అప్పటివరకు ఎక్కువ పనిలేకుండా ఉండడం వల్ల దాని సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అందువల్ల ప్రొస్టేట్ ఆపరేషన్ అయినవాళ్లలో సైతం ఈ సమస్య కనిపిస్తుంది. సాధారణంగా ఇటువంటి సమస్యను మందులతోనే తగ్గించవచ్చు. తీవ్రంగా మారితే మాత్రం సర్జరీ అవసరం అవుతుంది.

వరల్డ్ కాంటినెన్స్ వారం సందర్భంగా కరీంనగర్ పట్టణంలో సిప్లా ఫార్మసుటికల్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెడికల్ క్యాంపు జరుగుతోంది. రిజిస్టర్ చేయించుకోవడానికి 9849616870 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.

ఈ నెల 18 నుంచి 24 వరకు
‘వరల్డ్ కాంటినెన్స్ వీక్’

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine