Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Saturday, May 25, 2013
 


Home >> Features >> Salaha


మైగ్రేన్ కాదు..

Are-Sinu talangana patrika telangana culture telangana politics telangana cinemaనావయసు 17 సంవత్సరాలు. సంవత్సరకాలంగా ఒక వైపు తల నొప్పితో బాధపడుతున్నాను. తలనొప్పి ఉదయం నిద్ర లేవడంతో మొదలవుతుంది. ఎడమ కనుబొమ్మ పైన ఎక్కువగా వస్తుంది. తల వంచితే ఎక్కువవుతుంది. ముక్కు బిగుసుకుపోయి గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. తరచుగా జలుబు చేస్తుంది. తలస్నానం చేసినపుడు ఎక్కువగా వస్తోంది. మైగ్రేన్ సంబంధించిన అల్లోపతి మందుల వాడుతున్నా సరైన గుణం కనిపించడం లేదు. నాకు హోమియోలో సరైన సలహా ఇవ్వగలరు.

- భరత్, పరకాల


తరచుగా జలుబు చేస్తు ముక్కులోని కండారలు వాచి గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండడం గోంతలోకి కఫం రావడం తల దిమ్ముగా ఉండి , డల్‌గా ఉండే లక్షణాలను సైనసైటిస్ అంటారు. ఇది అక్యూట్ అండ్ క్రానిక్ అని రెండు రకాలు. వ్యాధి తీవ్రత ఆధారంగా మరియు మన ముఖభాగంలో కపాలం కింద వాటి ప్రదేశాన్ని బట్టి వ్యాధి ఉంటుంది. చాలా వరకు అలర్జీ వల్ల తరచుగా జలుబు చేస్తుంటుంది. దాని వల్ల ముక్కులో కండరాలు వాచి సైనస్‌ల ముఖద్వారాలు మూసుకు పోయి వాటిలో మ్యూకస్ అలాగే పేరుకు పోతుంటుంది. అది ఇన్‌ఫెక్ట్ అయినపుడు విపరీతమైన తలనొప్పి, చలితో కూడిన జ్వరం, ముఖం వాపు, మాటలో మార్పు రావడం చూస్తుంటాం. సరయిన జాగ్రత్తలు తీసుకుంటూ హోమియో చికిత్సతో దీనిని సమూలంగా నివారించవచ్చు. ఎక్స్‌రే, పీఎన్‌ఎస్, సీబీసీ, ఏబీసీ లాంటి రక్త పరీక్షలతో వ్యాధి నిర్థారించవచ్చు. చలిగాలిలో తిరగడం తగ్గించాలి. చెవులలోకి చల్ల గాలి వెల్లకుండా జాగ్రత్త పడాలి. ఐస్‌క్రీం, కూల్‌వూడింక్ లాంటి చల్లని ఆహారం తీసుకోకూడదు. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి.

నా వయసు 60 సంవత్సరాలు. నేను గత ఆరు నెలలుగా మూత్రవిసర్జన సమస్యతో బాధపడుతున్నాను. తరచుగా విసర్జనకు వెళ్లడం, వెళ్లినా తృప్తిగా అనిపించకపోవడం, మళ్లీ వెళ్లాలని అనిపించడం, మూత్రధార చాలా సన్నగా రావడం జరుగుతోంది. రాత్రుళ్లు ఎక్కువ సార్లు లేవడం వల్ల నిద్ర పట్టడం లేదు. బీపీ, షుగర్ లేవు. నాకు సరయిన హోమియో ఔషధం సూచించగలరు

- బాలరాజు, సంగాడ్డి


50సంవత్సరాలు దాటిన మగవారిలో మూత్రాశయం వద్ద ఉన్న ప్రొస్టేట్ గ్రంథి వాచి వారికి పై లక్షణాలు కనపడుతుంటాయి. వాటితోపాటు ఎంతో తొందరగా మూత్రం వస్తున్నట్టనిపిస్తుంది. వెళ్తే కొంచెంగా విసర్జన చేస్తారు. వెళ్లేలోపలే బట్టలోచుక్కలుగా పడుతుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో ప్రొస్టేట్ గ్రంథి వాపును నిర్ధారించవచ్చు. ఇది కొన్ని సార్లు క్యాన్సర్ కూడా కావచ్చు. స్కానింగ్‌లో ప్రొస్టేట్ గ్రంథి సైజు దీని ఉపరితల స్థితిని బట్టి ఏరకం అనేది చెప్పవచ్చు. అలాగే పీఎస్‌ఏ అనే రక్త పరీక్ష ద్వార నిర్థారించవచ్చు. హోమియోలొ చక్కని పరిష్కారం ఉంది. మీ వ్యాధి లక్షణాలకు సమాల్ సరులేట200 వారానికి ఒక డోస్ ఎనిమిది వారాలు వాడితే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఆకుకూరలు, పచ్చి కూరగాయలు, పండ్లు ఎక్కువగా వాడండి.

మా పాప వయసు 15 సంవత్సరాలు. రెండు సంవత్సరాల క్రితం నెలసరి మొదలయ్యింది. మొదటి రెండు నెలలు సరిగ్గానే వచ్చాయి. తర్వాత నుంచి నెల సరిగ్గా రావడం లేదు ఒక్కోసారి 6 నెలలకొకసారి వస్తుంది. వచ్చినపుడు 15 రోజులు 20 రోజుల వరకు రక్తవూసావం కనిపిస్తుంది. మరికొన్ని సార్లు వారం తేడాతో మళ్లీ మొదలవుతుంది. సరయిన పరిష్కారం చూపగలరు. పాపకు తరచుగా గొంతునొప్పి కూడా వస్తుంది. చలి గిట్టదు. చాక్‌పూట్లు, ఐస్‌క్షికీములు ఇష్టం. త్వరగా అలసి పోతుంది. చమట కూడా ఎక్కువ.

- విజయ, వరంగల్


ఈ వయసు ఆడపిల్లలకి హార్మోన్ సమస్యల వ్ల నెలసరి ఇబ్బందులు వస్తాయి. ఒక్కోసారి నెలల తరబడి బ్లీడింగ్ అవడం కొన్ని సార్లు 6, 7 నెలల వరకు నెలసరి రాకపోవడం వంటివి జరుగుతాయి. స్కానింగ్ వంటి పరీక్షల వల్ల వ్యాధి నిర్థారణ జరుగుతుంది. మీ పాపకు ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్డు రోజు అందిస్తూ మాంసాహారం చక్కెర వస్తువులు తగ్గిస్తాయి. రోజు 40 నిమిషాల నుంచి గంట సమయం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. కాల్కేరియా కార్బ్ 200 వారానికి మూడు మోతాదులు ఆరువారాలు వాడాలి.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine