Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, May 23, 2013
 


Home >> Features >> Salaha


ఎందుకిలా బలం తగ్గిపోతోంది?

neuron-str talangana patrika telangana culture telangana politics telangana cinema
నా వయసు యాభై సంవత్సరాలు. నేను నాలుగు నెలలుగా నరాల బలహీనతతో బాధపడుతున్నాను. పాదాలనుంచి మోకాళ్ల వరకు తిమ్మిర్లు ఉంటున్నాయి. కింద కూర్చుని లేవలేకపోతున్నాను. చేతుల్లో కూడా బలం తగ్గిపోతోంది. ఎన్ని మందులు వాడినా రోజురోజుకి బాగా తగ్గిపోతుంది. చేతులు, కాళ్లు సననబడిపోతున్నాయి. నాడు సమస్యకు పరిష్కారం చెప్పగలరు.

-

రవి, జనగాం


రమేష్ గారు, మీకు షుగర్ వ్యాధి ఉందో, లేదో తెలుపలేదు. షుగల్ వ్యాధి ఉన్న వారికి కూడా మీరు చెబుతున్న లక్షణాలు ఉండవచ్చు. షుగర్ లేదంటే మీరు సిఐడిపి అనే జబ్బుతో బాధపడుతుండవచ్చు. ఈ జబ్బు నరం మీద ఉండే నరం మీద ఉండే తొడుగు ఊడిపోతుంది. వల్ల వస్తుంది. కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడం, నడుస్తున్నపుడు, పాదాలకి స్పర్శ తెలియకపోవడం, కళ్లు మూసుకుంటే కింద పడిపోవడం కింద కూర్చుని పైకి లేవలేకపోవడం, చేతులతో బరువైన వస్తువులు తలపైకి ఎత్తలేకపోవడం ఈ జబ్బు లక్షణాలు. ఈ వ్యాధిని నర్వ్ కండక్షన్ స్టడీస్ అనే టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. కొన్ని రక్త పరీఓల ద్వారా సకారణం వల్ల ఇలా నరాల దెబ్బతిన్నాయన్న విషయం తెలుసుకోవచ్చు. ఈ జబ్బును స్టిరాయిడ్ ఇంజెక్షన్, ప్లాస్మాఫెరసిస్, ఇమ్యునోగ్లొబలిన్ ఇంజెక్షన్స్ ద్వారా తగ్గించవచ్చు. తర్వాత కూడా కొన్ని నెలల నుండి, సంవత్సరాల వరకు టాబ్లెట్లు వాడాల్సి ఉంటుంది. అయితే చాలా సందర్భాలలో ఈ జబ్బుని దాదాపు నయం చేయవచ్చు. మీరు నాలుగు నెలలుగా బాధపడుతున్నారు. కాబట్టి న్యూరాలజిస్ట్‌కి చూపించుకొని అవసరమైన పరీక్షలు చేసుకొని చికిత్స తీసుకోవడంలో జబ్బు నయమయ్యే అవకాశం ఉంది.

Suresh0 talangana patrika telangana culture telangana politics telangana cinema
నా వయసు 45 సంవత్సరాలు. నేను గత మూడు నెలలుగా నడుము నొప్పితో బాధపడుతున్నాను. పదిరోజులుగా బాగా ఇబ్బంది పడుతున్నాను ఎటు కదలలేకుండా అవుతోంది. నడుం నుంచి పాదాల వరకు తిమ్మిర్లు వస్తున్నాయి. మూడు రోజులుగా మూత్రం కూడా ఆగి, తిరిగి వస్తోంది. ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించాము. అయితే కొంత మంది సర్జరీ అవసరమని అంటున్నారు. కొంత మంది వద్దంటున్నారు. మా కొలిగ్స్ సర్జరీ చేయించుకుంటే కాలు పడిపోవచ్చుని భయపెడుతున్నారు. మీ సలహా చెప్పగలరు.

- విజయ్, హైదరాబాద్


మీరు ఎల్5/ఎస్1 రెడిక్యులోపతి తో బాధపడుతున్నారు. అయితే నొప్పి మాత్రమే ఉన్న వారిలో, నడుముకి బెల్ట్ వేసుకోవడం, మందులు వాడుకోవడంతోను రెస్ట్ తీసుకోవడం తోను 80 శాతం మందిలో నొప్పి తగ్గించవచ్చు. మిగిలిన వారిలో సర్జరీ అవసరం పడుతుంది. కాళ్లకి సంబంధించిన నరాలు, మలవిసర్జన, మూత్రవిసర్జనకు సంబంధించిన నరాలు అన్ని నడుము నుంచి కిందకి వెళతాయి. అయితే వెన్ను పూసలు అరిగినపుడు డిస్క్‌లు బయటికి జారి ఈ నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల నడుము నొప్పి, తిమ్మిర్లు, మూత్రవిసర్జనలో ఇబ్బంఒది వస్తున్నా వెంటనే ఆపరేషన్ చేసుకోవటం అవసరం. సమయం వృధా చేసే కొద్దీ, పరిస్థితి మరింత జఠిలమవుతుంది.

మీరు చెబుతున్న దానిని బట్టి మీకు కచ్చితంగా సర్జరీ అవసరమవుతుంది. సరియైన న్యూరోసర్జరీ డాక్టరునే సర్జరీ చేయించుకోవడం వల్ల ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మైక్రోస్కోప్ ద్వార కేవలం గంట కన్నా తక్కువ సమయంలోనే సర్జరీలు చేస్తున్నారు. మూడు రోజులలో నడుచుకుంటూ ఇంటికి కూడా వెళ్ల వచ్చు. అయితే మంచి ఆసుపత్రి, నిపుణులను ఎంచుకోండి.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine