Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >> Features >> Salaha


ఇది ప్రాణదానమే

Blood
సింధూరకు పుట్టిన రోజు పండగలాగే అనిపించడం లేదు. కారణం చిన్నప్పటి నుంచి కలిసి పుట్టినరోజు జరుపుకునే రాహుల్ ఈ సంవత్సరం లేడు. నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సమయానికి రక్తం అంది ఉంటే అతడు బతికి ఉండే వాడని డాక్టర్లు అన్నారు. ఇంకా అదే విషాదంలో ఉన్న సింధూర ఇలా మరొకరికి జరగకూడదని అనుకుంది. అందుకే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపవూతిలో రక్త దానం చేయాలని బయలుదేరింది. ఈ సంవత్సరమే కాదు ఇక నుంచి తన ప్రతి పుట్టిన రోజున రక్తం ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకుంది. అంతేకాదు, తన స్నేహితులకు కూడా ఈ విషయంలో అవగాహన కల్పించాలని, వారిని కూడా రక్త దానం చేసేలా ప్రోత్సహించాలని అనుకుంది. ఇలా తమవరకు వస్తేకానీ ఆలోచించక పోవడం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. కాబట్టి నష్టనివారణకు ఈరోజే మొదటి అడుగు వేద్దాం. ఈ ‘బ్లడ్ డొనోషన్ డే ’ సాక్షిగా ప్రతి 3నెలల కొకసారి రక్త దానం చేద్దాం.

రక్తం ప్రాణాధారం. సమయానికి రక్తం దొరకక పోవడం వల్ల రోజు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన దేశంలో రక్తదానం పట్ల అవగాహన చాలా తక్కువ. ఈ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 18 నుంచి 60 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉన్న ఎవరైనా ప్రతి మూడు నెలలకొక సారి రక్త దానం చేయవచ్చు. ఈ లెక్కన నిరంతరాయంగా 42 సంవత్సరాల పాటు రక్త దానం చేస్తే ఒక్కొక్కరు సుమారు 500 మంది ప్రాణాలు కాపాడిన వారవుతారు. ఒకసారి రక్తన్ని దానం చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు.
ఎప్పుడూ కొరతే
ప్రతి రెండున్నర సెకన్లకు ఒకరికి రక్తం అవసరం పడుతోంది. ప్రతి రక్తపు బొట్టు మరొకరి ప్రాణానికి ఆధారమవుతోంది. వందలో ఒకరు రక్తం దానం చేస్తే చాలు మనిషి ప్రాణాలను కాపాడుకోవడచ్చు. కానీ రక్తదానం అవసరానికి సరిపోయేంతగా జరగడంలేదు. అందువల్ల రక్తం అవసరమైనపుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆసుపవూతులైనా, ప్రైవేటు ఆసుపవూతులైనా రక్తం దొరకడం కొంచెం కష్టంగానే ఉంటోంది. ఇక అరుదైన గ్రూప్ రక్తం గురించైతే చెప్పనవసరమే లేదు. ప్రభుత్వ ఆసుపవూతుల్లో రక్తం అవసరమైతే వారి బంధువుల్లో ఒకరు బదులుగా రక్తం ఇస్తేనే బ్లడ్ బ్యాంకులో వారికి అవసరమైన రక్తం ఇస్తామనే నిబంధన పెట్టారం అర్థం చేసుకోవచ్చు రక్తం కొరత తీవ్రత ఎంత ఉందో.
కొంత పర్వాలేదు
ప్రతి సంవత్సరం కేవలం హైదరాబాద్ నగరం పరిధిలోనే 3.20 లక్షల యూనిట్ల రక్తం అవసరమవుతోంది. కేవలం 2.17 లక్షల యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంటోంది.
ఈ మధ్య రక్తదానం గురించి జరుగుతున్న ప్రచారం మూలంగా యువతలో కొంత అవగాహన పెరుగుతోంది. నగరంలో స్వచ్ఛందంగా రక్తం దానం చేయడానికి యువతరం ఉత్సాహం చూపుతోంది. ప్రత్యేక సందర్భాల్లో ఇచ్చే విధంగా నగరంలో ఎక్కుడైనా శిబిరాలు ఏర్పాటు చేశారా? అని తెలుసుకుంటున్నారు. తాము ఇస్తున్న రక్తం అవసరమైన వారికి చేరేలా చూసే విశ్వసనీయ సంస్థల కోసం, వ్యక్తుల కోసం వారు చూస్తున్నారు. ఆ భరోసా తమకు కావాలని అడుగుతున్నారు. అత్యవసరంగా రక్తం కావాలని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో, సెల్‌ఫోన్‌లకు సందేశాలు. పంపిన వెంటనే చాలా మంది స్పందించడం ఇందుకు నిదర్శనం. గతంతో పోలిస్తే నగర వాసుల్లో రక్తం దానం పట్ల అవగాహన పెరిగింది కానీ అది సరిపోదు. మరింత మంది రక్త దానానికి ముందుకు రావాలి. కావాలిసిన దానికంటే దాతల సంఖ్య తక్కువగా ఉండడం ఈ అవగాహన అవసరాన్ని తెలుపుతోంది.
అపోహలు వద్దు
రక్త దానానికి సంబంధించిన అపోహలు చాలా ఎక్కువ. రక్తదానం చేసిన తర్వాత ఏ పని చేయలేనంతగా నీరసించిపోతారని, వాళ్లు ఎంత రక్తం తీసుకుంటారో అని ఇలా చాలా రకాల అపోహలు ఉన్నాయి. ఈ అపోహల వల్ల రక్తం దానం చేయడానికి ముందుకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరగడం లేదు. పర్యవసానంగా మనం చెల్లిస్తున్న మూల్యం కొన్ని ప్రాణాలనే విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
ఇవి గుర్తుంచుకుంటే చాలు
- ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 60 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు రక్తదానం చేయ్యొచ్చు.
- జీవిత కాలంలో ఒక వ్యక్తి దాదాపు 168 సార్లు రక్త దానం చెయ్యొచ్చు
- మత్తు మందులకు అలవాటు పడిన వారు, హెపటైటీస్ బీ, సి, హెచ్‌ఐవీ, రక్తపోటు అధికంగా ఉన్న వారు రక్తదానానికి అనర్హులు.
- ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మహిళలైతే ఆరు మాసాలు, పురుషులైతే మూడు మాసాలు తర్వాతనే రక్తాన్ని రెండవసారి ఇవ్వడానికి వీలుంటుంది.
- రక్తం ఇచ్చే వారు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి. ఎటువంటి రుగ్మతలు ఉన్నా రక్తాన్ని స్వీకరించరు.
జాగ్రత్తలు
- తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాతనే రక్తం ఇచ్చిన చోటు నుంచి బయటకు రావాలి.
- రక్తం ఇచ్చిన తర్వాత సదరు ఆసుపవూతులు లేదా బ్యాంకులు ఇచ్చే ఆహారం తీసుకోవాలి.
- 48 గంటల పాటు ఏ వ్యాయామం చేయకూడదు
- పొగతాగడం, మద్యం సేవించడం లాంటివి 24 గంటల పాటు చేయకూడదు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine