మధుమేహానికి ఆయుర్వేదం
ఈ రోజుల్లో మనదేశంలో ప్రతి వంద మందిలో పద్నాలుగు మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఎటువంటి లక్షణాలు చూపని అతి ప్రమాదకరమైన వ్యాధి మధుమేహం. అయితే కొంత మందిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అతిగా దాహం వేయడం, ఎక్కువ సార్లు మూత్రవిర్జన చేయాల్సి రావడం, విపరీతమైన ఆకలి, ఎంత తిన్నా శక్తి హీనంగా, నీరసంగా ఉండడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
దుష్ప్రభావాలు
చూపు మందగించడం, మధుమేహం సోకిన కొన్నేళ్ల తర్వాత రక్తనాళాలు దెబ్బతినడం గుండెదడగా ఉండడం, కాళ్లు, చేతులు మంటలుగా ఉండడం, కిడ్నీలకు కూడా నష్టం వాటిల్లవచ్చు. సెక్స్ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.
చికిత్సావిధానం
ప్రస్తుతం అందుబాటులో ఉన్న హలోపతి మందుల వల్ల చర్మం మీద మచ్చలు, తలనొప్పి, జీర్ణసంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కానీ ఆయుర్వేదం ఎంతో ప్రాచీనమైంది. ఆయుర్వేదంలో రోగ లక్షణాలతో పాటు అది అనువంశికమా లేక ఆధునిక జీవన విధానం వల్ల వచ్చిందా అనే విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఆయుర్వేద మందులు మొదలు పెట్టిన తర్వాత నెమ్మదిగా హలోపతి మందులు తగ్గిస్తూ పోతారు. జీవన విధానంలో చేసే చిన్నచిన్న మార్పులతో మధుమేహాన్ని జయించవచ్చు. మందులతో పాటు పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఉప్పు తగ్గించి తినాలి, చక్కెర పూర్తిగా మానేయాలి, తీసుకునే ఆహారం మితంగా పౌష్టికమైనదిగా ఉండాలి. తగినంత వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఇలా చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాదు ప్రీడయాబెటీస్ స్థాయిలో ఉన్నావారికి పూర్తిగా తగ్గించే ఆస్కారం కూడా ఉంటుంది. మధుమేహం విషయంలో నిర్లక్ష్యం పనికి రాదు. దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మీ మొత్తం శరీరాన్ని కబళించి నిర్విర్యం చేస్తుంది.
డాక్టర్ మంజరి రమేష్
ఆయుర్వేద ఇంటర్నేషనల్
హైదరాబాద్, 9959911099
Other News