తల, మెడ క్యాన్సర్లు
తల భాగంలో శ్వాస, జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు అంటారు. పెదాలు,నోరు, చిగుర్లు, నాలుక, నాసల్‌క్యావిటి, పారింక్స్, స్వరపేటిక వంటి భాగాలలో ఈ క్యాన్సర్లు వస్తాయి. ఈ క్యాన్సర్లు 90 శాతం వరకు స్కామస్ సెల్ కార్సినోమా రకాలనికి చెందినవి. అంటే మ్యూకస్ ఉండి ఎప్పుడు తడిగా ఉండే లోపలి పెదాలు, చిగుర్లు, నాలుక వంటి భాగాలలో క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తాయి. మెదడు, అన్నవాహిక, థైరాయిడ్ గ్రంధి, తలలోని కండరాలు, చర్మానికి వచ్చే క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు కూడా పరిగణించరు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ లాగానే ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు ఆల్కహాల్, పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తులు అంతే కాకుండా హ్యూమన్ పాపిలూమా టైరస్‌అని చెప్పుకోవచ్చు. ఆల్కహాల్, పొగాకు రెండు అలవాట్లు ఉన్నట్టయితే ఈ ముప్పు ఇంకా ఎక్కువగా పొంచి ఉన్నట్లే. హెచ్‌పీవీ వైరస్ 16 నుంచి 1Nag రకాలను, నాలుక మొదటి భాగంలో, టాన్సిల్స్‌లో ఇంకా కొన్నిరకాల తల మెదడుకు సంబంధించిన క్యాన్సర్స్ కు కారణాలుగా చెప్పుకోవచ్చు. తలమెడకు సంబంధించిన క్యాన్సర్లకు 75శాతం కారణాలుగా పొగాకు, పొగాకు సంబంధించిన ఉత్పత్తులు, గుట్కా, పాన్, జర్ధా, నస్యం, వక్క, బీడి, చుట్ట, తమలపాకులు, సిగార్‌లు అన్ని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
నోటిలో తెలుపు, ఎరుపు మిళితమైన మచ్చలు, గొందు నొప్పి కారనంఒగా బొంగుతరు పోయి ఉండటం, మింగటానికి కష్టంగా ఉండటం, దవడలు వాపు, శ్వాస తీసుకోవడానికి, మాట్లాడటానికి కష్టంగా ఉండటం తలనొప్పి, వినికిడి శక్తి తగ్గటం, చెవిపోటు, లా క్యాన్సర్ కణితి పెరిగే ప్రదేశాన్ని బట్టి లక్షనాలు అనేక రకాలుగు ఉంటాయి. దంతాలు కొనదేరి ఉండి పరేపరే పెదాలలో లేక నోటి లోపలి భాగంలో పుండు పడేటట్టు చేసినా, మనదేశంలో కానీ ఇతర దేశాల్లో కాని వారి వారి ప్రాంతాలను బట్టి ఉండే అలవాటు హెచ్‌ఐవీ, పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ ఎప్‌స్పియన్ బార్ వైరస్ నిల్వ ఉండే ఆహారపదార్థాలు, చెక్కపొడి, ఆస్‌బెస్టాస్, మెటల్, టెక్స్‌టైల్ రంగాలలో పనిచేసే వారికి ఇతర ఆరోగ్య సమస్యలకు తలభాగంలో వచ్చే రేడియేషన్ ఈ క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం ఉంది.
లక్షణాలు అనుమానా స్పదంగా ఉంటే బయాప్సి, ఎంఆర్‌ఐ, సీటీ, పెట్ వంటి ఇమేజింగ్ ప్రొసిజర్లతో క్యాన్సర్ వచ్చిన భాగాన్ని, స్టేజ్, గ్రేడింగ్‌లను నిర్థారిస్తారు. చికిత్సా విధానాలు క్యాన్సర్ వచ్చిన భాగం, స్టేజ్, రోగి వయసు, వారి ఆరోగ్యం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. సర్జరీ రేడియేషన్, కీమో, టార్గెటడ్ థెరపీ లేక కొన్ని రకాల కాంబినేషన్ థెరపీలను అవసరాన్ని బట్టి నార్ణయిస్తారు. తల మెడ వంటి సున్నితమైన భాగాలలో చికిత్సలు చేసినపుడు ఆ ట్రీట్ మెంట్లు తర్వాత వాటి పనితీరు, మొహంలోఅనేక మార్పులు , ఆహారం తీసుకునేటపుడు, మాట్లాడేటప్పుడు, గొంతులో మార్పు, నమలడానికి ఇబ్బందిపడటం, దవడ ఎముక పట్టేసినట్లు ఉండటం, మొద్దుబారినట్లు ఉండటం వంటి అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి సర్జరీలను చాలా జాగ్రత్తతో చేసే అనుభవజ్ఞులైన వైద్యులదగ్గర చేయించుకోవటం చాలా ముఖ్యం.
Other News