వేసవి వ్యాధులకు హోమియో
వేసవిలో వేధించే కొన్ని రకాల వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యపూన్నింటినో తెచ్చిపెడతాయి. సొరియాసిస్, పైల్స్, మైగ్రేన్ లాంటి ఈ జబ్బులను హోమియోచికిత్సతో పూర్తిగా నయం చేయవచ్చంటున్నారు నిపుణులు.
సొరియాసిస్
సొరియాసిస్ వ్యాధిక్షిగస్థులు వేసవిలో మరింత ఎక్కువగా బాధపడతారు. చర్మానికి సంబంధించిన వ్యాధిగా పరిగణించి పైపూత మందుల ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తారు గగానీ ఇవి తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే. సొరియాసిస్ సోకిన వారిలో చర్మం పొలుసులుగా రాలిపోతుంది. మచ్చలు మొదట లేత గులాబీ రంగులో ఉండి తరువాత ఎర్రగా మారి తెల్లటి పొలుసులుగా వస్తాయి. దురద ఎక్కువగా ఉంటుంది. దీనిబారిన పడిన వ్యక్తి చర్మంలోని పై పొర కణాలు ఇతరుల చర్మంలోని కణాల కన్నా పదిట్లు ఎక్కువగా పెరుగుతాయి. మోకాళ్లు, మోచేతులు, పాదాల ప్రాంతంలో జబ్బు ఎక్కువగా ఉంటుంది.
కారణాలు
సొరియాసిస్ అన్ని వయసుల వారిలోనూ రావచ్చు. 15 నుంచి 30 ఏళ్లలోపువారిలో ఎక్కువ. మానసిక ఒత్తిడి, ఆల్కహాల్, పొగతాగడం వల్ల వ్యాధిక్షిగస్థుల శాతం పెరుగుతోంది. వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశాలూ ఉన్నాయి. ఇన్‌ఫెక్షన్లు సోకి వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయినవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
హోమియోచికిత్స
రోగనిరోధక శక్తిలో మార్పుల వల్ల ఈ వ్యాధి మొదలవుతుంది. హోమియోలో దీనికి మంచి పరిష్కారం ఉంది. రోగనిరోధక శక్తిని పెంపొందించి, గ్రంథులను ఉత్తేజపరిచి శరీరభాగాల్ని వ్యాధికారకాల్ని తగ్గించే విధంగా చికిత్స అందిస్తారు. ఇది కణజాల స్థాయిలో పనిచేస్తుంది. ఎటువంటి దుష్ప్రభావాలుండవు. సొరినమ్, అల్యుమినా, సల్ఫర్, గ్రాఫైటిస్ లాంటి మందులు బాగా పనిచేస్తాయి.

పైల్స్
వేసవిలో తరచూ డీహైవూడేషన్‌కు గురవడం వల్ల ఈ వ్యాధి ఎక్కువ అవుతుంది. దాహం తీర్చుకోవడానికి వాడే కూల్‌వూడింక్స్ వల్ల పైల్స్ సమస్య మరింత పెరుగుతుంది. మలద్వారం లోపల రక్తనాళాలు ఉబ్బడానేన పైల్స్ అంటారు. లోపలి వైపు ఏర్పడే అర్శమొలల వల్ల నొప్పి అంతగా ఉండదు. పైల్స్ వల్ల మలవిసర్జన సమయంలో రక్తవూసావం అవుతుంది. కొన్నిసార్లు రక్తనాళాలు మలద్వారం గుండా బయటకు వస్తాయి. వీటిని తిరిగి లోపలకు నెట్టకపోతే తీవ్రమైన నొప్పికి దారితీస్తాయి. ఇవి బయటకు కనిపించవు. మలద్వారం చుట్టూ వెలుపల చర్మంపై ఏర్పడే పైల్స్ బొడిపెలా కనబడతాయి. ఇవి పగిలినపుప్డు రక్తవూసావం అవుతుంది.
మైగ్రేన్
వేసవిలో ఎక్కువ మందిని వేధించే సమస్య ఇది. దీర్ఘకాలిక నరాలకు సంబంధించిన వ్యాధి. చాలామందిలో నొప్పి తలకు ఒకవైపు మొదలవుతుంది. నరాలు కొట్టుకుంటూ ఉండటం, వికారం, వాంతులు, చిన్న చిన్న శబ్దాలను భరించలేకపోవడం, వెలుతురు తట్టుకోలేకపోవడం లాంటి లక్షణాలుంటాయి. తలనొప్పి ప్రారంభమయ్యే సమయంలో వస్తువులు మసగ్గా కనిపించడం గమనిస్తాం. పురుషుల్లో కన్నా స్త్రీలలో మూడు శాతం ఎక్కువ. టీనేజ్‌లో ఉన్న పిల్లల్లో ఇది ఎక్కువ. తల్లిదంవూడుల్లో ఏ ఒక్కరికి ఉన్నా వంశానుగతంగా పిల్లలకు వచ్చే అవకాశం యాభైశాతం ఉంటుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న మహిళలు గర్భం దాల్చినప్పుడు సమస్య మరింత జటిలం అవుతుంది.
హోమియో చికిత్స
వ్యాధి తీవ్రత, మూలకారణాలను తెలుసుకుని చికిత్స అందిస్తారు. ఏ వయసువారికైనా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చికిత్స సాధ్యమవుతుంది. దీనివల్ల శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
బెల్లడోనా - మైగ్రేన్‌కి మంచిమందు. చిన్న చిన్న శబ్దాలకు, వెలుతురుకు తలనొప్పి వస్తున్నా, పడుకున్నప్పుడు నొప్పి ఎక్కువ ఉన్నా వాడదగిన ఔషధం ఇది.
Other News