Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, May 23, 2013
 


Home >> Features >> Bhakthi


ఈ వారం పూజలు

మాస శివరాత్రి
Hindu_calendarశివదర్శనం ముక్తిదాయకం - శివనామం కల్యాణకరం. ఆయన పేరులోనే ఉంది ఆ గుణం. ‘శం’ మేలు. ‘కర’ కూర్చువాడు. సమస్త లోకాలకు ఆదిశక్తి పరాశక్తి అయిన పార్వతీదేవి దుర్గగా, ఛండిగా, కాత్యాయనిగా, కాళిగా, సరస్వతిగా, త్రిపురాసుందరిగా వేరువేరు రూపాలతో వేర్వేరు శక్తివూపభాసగా పూజలందుకుంటున్నది. భక్త సులభుడు కనుకనే ఆ స్వామిని హృదయపు గుళ్లలోనూ, దేవాలయాల్లోనూ ప్రతిష్టించుకుంటున్నారు. విష్ణువు అలంకార ప్రియుడు. శివుడు అభిషేక ప్రియుడు. ఈరోజు శివుని స్మరిస్తూ ఉపవాసం చేస్తారు. సాయంకాలం శివున్ని పాలతో, తేనెతో అభిషేకించి పూజిస్తారు. కొబ్బరికాయ, పళ్లు నివేదనగా సమర్పిస్తారు. కొందరు మారేడు దళములతో అర్చన చేస్తారు. ఈ వ్రతం వల్ల అన్ని కోరికలు సిద్ధిస్తాయి.

పోలాల అమావాస్యనోము
ఒక బ్రాహ్మణ పండితునికి ఏడుగురు కొడుకులు, ఏడుగురు కోడళ్లు పోలాల అమావాస్య నోము నోచుకుందామనుకున్నారు. ఆఖరు కోడలికి అమావాస్య రోజునే ఒక పిల్ల చచ్చిపోయింది. అందరూ నోము మానేశారు. ప్రతియేడూ అమావాస్యనాడు నోము నోచుకుందామనే సరికి చివరి కోడలికి బిడ్డ చనిపోతుండెను. ఇలా ఏడేళ్లు అయ్యింది. తక్కిన కోడళ్లంతా చివరామెను తిట్టిపోసుకున్నారు. ఈసారైనా అమావాస్యనాడు నోము నోచుకుందామనుకుంటుండగా చివరామె బిడ్డ చనిపోగా ... ఆమె శవమును ఇంట్లోనే ఉంచి, తాళం వేసి తోడికోడళ్లు ఇళ్లలో ఒకరింట నీళ్లుమోసి, మరొకరికి తలంటు పోసి, ఒకింట పిండికొట్టి, తానూ నోము నోచుకున్నది. రాత్రివరకూ ఉపవాసం చేసి చచ్చిన బిడ్డను భుజం మీద వేసుకుని ఆ రాత్రి ఒంటిగా పోలేరమ్మ గుడికి వెళ్లి అమ్మా! యేడేళ్ల నుంచి నోములు నోచాలనుకున్నా బిడ్డలు చనిపోవడం వల్ల నోచుకోలేకపోయాను.

ఈ సంవత్సరం నీ దయవల్ల నోము నోచుకున్నారు. తరువాత నీ దయ అని ఆమె పాదాలవద్ద తన బిడ్డనుంచెను. ఆమె మాటలకు పోలేరమ్మ ఆనందించి.. ప్రత్యక్షమై ‘బిడ్డా! నీవేం భయపడకు. నీవు నీ బిడ్డలను ఎక్కడ పాతావో అక్కడికి వెళ్లి పిలిస్తే నీ బిడ్డలు వస్తారు’ అని చెప్పింది. అలాగే జరిగింది. ఈ విషయం తోడికోడళ్లు, ఊరివారందరు విని, వింతను చూసి ఆశ్చర్యపోయారు. నాటినుంచి ఆమె ప్రతియేడూ నోము నోచుకుంటూ సర్వ సౌభాగ్యాలతో తులతూగింది. ఈరోజున ప్రాతఃకాలాన లేచి, స్నానం చేసి, శుచిగా, మడిగా ఉండి కుడుతలు తయారు చేసుకుని, వేపమండలను తెచ్చి పోలేరమ్మ పేరు పెడతారు. ఆ వేపమండకు చద్దన్నం నైవేద్యం పెట్టి శ్రద్ధాభక్తులతో చేసెదరు. ఇలా చేస్తే ఏ బాధా, చీకూచింతా ఉండవని నమ్మకం.

అమావాస్య
బ్రహ్మదేవునితోపాటు ఉద్భవించిన పవివూతమైన ‘ధర్భలను’ శుచిగా, పవివూతంగా కోసి భద్రం చేస్తారు. ఈరోజు కోసినవైతేనే వాటిని మరల మరల వాడుకోవచ్చు. ఇలా దర్భలను పవివూతంగా కోసి భద్రం చేయడాన్ని పవివూతోత్సవం అంటారు.

భాద్రపదమాసం
పూర్వాభాద్ర లేక ఉత్తరాభాద్ర నక్షవూతంలో కూడిన పూర్ణిమ ఈ మాసంలో సంభవిస్తుంది. కాబట్టి భాద్రపదమాసమని పేరు వచ్చింది. ఈ నెలలో ఉత్తరేణి పూలతో శివునికి అర్చన చేస్తారు. ఇలా చేస్తే వారు ధ్వజముతో కూడిన విమానంలో పుణ్యపదం చేరతారని నమ్మకం. ఈ నెలంతా ఒకేరకమైన ఆహారం తింటూ వ్రతమాచరిస్తే ధనం, ఆరోగ్యం కలుగుతాయని కూడా నమ్మకం. విష్ణువూపీతికి గుడోదనం, లవణాలను దానమిస్తారు. ఈరోజు కొందరు అప్పములనోము, పార్సీలు ‘నూతన సంవత్సరం’ జరుపుకుంటారు.
అధికమాసం

ఈ మాసంలో శుభకార్యాలు నిర్వహించరు. సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగిరావడానికి భూమికి 365రోజుల ఐదుగంటల 4 నిమిషాల 45.51 సెకనుల కాలం పడుతుంది. కానీ మనం సాధారణంగా 365రోజులనే లెక్కిస్తాం. అధికంగా మిగిలిన ఐదుగంటల 4 నిమిషాల 45.51 సెకనులను అంటే దాదాపు పావు రోజును ... ప్రతినాలుగేళ్లకు కలిపి లీపు సంవత్సరాన్ని ఏర్పాటు చేసుకున్నాం. హిందూ కాలనిర్ణయంలోనూ ఇలాంటి ఏర్పాటే జరిగింది. పంచాగాన్ని బట్టి చాంద్రామాన సంవత్సరానికి 354రోజులు-నక్షవూతమాస సంవత్సరానికి 366రోజులు. అంటే ఈ రెండింటి మధ్య 12 రోజుల తేడా ఉంది. ఆ తేడాను సరిచేసి రెండు కాలమానాల మధ్య సమన్వయం సాధించేందుకుగాను, అధికమాసాన్ని ఏర్పాటు చేశారు పండితులు. దాని ప్రకారం ప్రతిమూడేళ్లకోసారి అధికమాసం వస్తుంది.

అధికమాసం లేకుండా మరోమార్గం పరిశీలిస్తే ఇలా ఉంటుంది. రెండు సంవత్సరాల్లోని తేడా పన్నెండు రోజులు గనుక సంవత్సరంలోని మొదటి నెలకూ, ఆరవనెలకూ ఆరేసి రోజుల చొప్పున సమానంగా కలిపితే మంచిదని కొందరి అభివూపాయం. తేడా ఉన్న పన్నెండు రోజుల్ని ఒక్కో నెలకు ఒక్కోరోజు చొప్పున పన్నెండు మాసాలకు కలిపితే సరిపోతుందని మరికొందరి అభివూపాయం. కానీ ఈ రెండు పద్ధతులనూ పెద్దలు, పండితులు అంగీకరించనందువల్ల అధికమాసం కాల పరిగణనలోకి వచ్చింది.
365రోజుల 6 గంటల 9 నిమిసాల 9.5 సెకనులకు ఒక సంవత్సరం అని ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం వలన తెలుస్తున్నది. చాంద్రమాన సంవత్సరానికి 354రోజుల గంటల 4 నిమిషాల 31.6 సెకనులు- అంటే ఈ తేడాను భర్తీ చేసేందుకు చాంద్రమానం అవలంబించేవారు. ఒకపూర్తి అధికమాసాన్ని ఏర్పరుచుకున్నారు. అయితే అవసరార్థం సృష్టించుకున్న అధికమాసాలకు ప్రాచీనకాలం నుంచి విలువలేదు. అధర్వణ వేదంలో అధికమాసాన్ని అనర్థదాయకం అన్నారు. అందుకే ఈ నెలలో వివాహాది శుభకార్యాలు చేయరు. కనీసం పితృకర్మలు కూడా చేయరు.

శుద్ధ విదియ
ఈరోజు బలరాముని జన్మదినం.
శుద్ధతదియ
ఈరోజు సువర్ణ గౌరీవూవతం ఆచరిస్తారు. దీనిని హరితాళికావూవతం, షోడశోమావూవతం అనగా పదహారు కుడుముల తద్ది అని కూడా పిలుస్తారు. వ్రతంలో భవానీ శంకరులను పూజించడం వల్ల స్త్రీలకు వైధవ్యం కలగదని, పుత్రపౌవూతులు కలుగుతారని నమ్మకం.

Other News
    Most Viewed galleries


    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine