రంజాన్ - జకాత్, ఫిత్రా
ఇస్లామిక్ మతాసారం ‘జకాత్’ అతి ముఖ్యమైన అంశం. ఇస్లాంలో ‘నమాజ్’ ప్రార్థన తర్వాత ‘జకాత్’కే అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. జకాత్ అంటే ‘ప్రతి విశ్వాసి (ముస్లిం) తప్పనిసరిగా తన ధర్మ సంపాదనలోంచి చెల్లించే దానం’. జకాత్ అనే పదం ‘సద్‌ఖా’ (ధర్మ సంపాదనలో తన అవసరానికి అధికంగా ఉన్నదాన్ని దానం చేయడం) అనే అర్థంలోనూ ప్రయోగించబడినది. మనిషి ఐచ్ఛికంగా దైవమార్గంలో చేసే ఇతర దానానికి కూడా ఇది వర్తిస్తుంది. దీనివల్ల తెలిసేదేమంటే ‘జకాత్’ అనేది సమాజంలోని ధనికవర్గం నుంచి వసూలు చేయబడినసంపద నిరుపేదలకు పంచడమే కాకుండా, దీనివల్ల సంపద వ్యాపించి, కొంతకాలానికి వర్గతారతమ్యాలు సమసిపోతాయి. సమానత్వం వెల్లివిరుస్తుంది.
మహావూపవక్త (స.అ.స) ఇలా ప్రబోధించారు.
‘అల్లాహ్ ఎవరికయితే ఐశ్వర్యం ప్రసాదించాడో ఆ వ్యక్తి తన ధనంలో నుంచి జకాత్ చెల్లించకపోతే, ఆ ధనం తీర్పు దినాన విషసర్పంగా రూపుదాల్చుతుంది. దాని పడగపై రెండు నల్లటి చుక్కలుంటాయి. ఆ సర్పం అతని కంఠాన్ని భారమైన హారంగా చుట్టుకుంటుంది. ‘నేను ధనాన్ని, నీవు కూడబెట్టిన నిధిని’ అంటూ.. ఆ సర్పం అతని దవడలను గట్టిగా కరుచుకుంటుంది’(అలి ఇమ్రాన్ సూరా నెం : 10). దీన్నిబట్టి తెలిసేదేమిటంటే సంపద ఒక చోట పోగవడం, మనిషి డబ్బు పామై దాన్ని కాపలాకాయడం ఇస్లాం ఎన్నటికీ సహించదు. ధనం సమాజంలో సంచరిస్తూ ఉండాలని ఇస్లాం కోరుకుంటుంది. సంపద ఏ ఒక్క ప్రత్యేక వర్గంలో నిల్వ ఉండకుండా సాధ్యమైనంత అధికంగా సమాజంలో పంపిణీ జరగాలి. అనేది ఇస్లాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇస్లాం ఈ లక్ష్యం దాని వారసత్వపు చట్టం ద్వారా కూడా నెరవేరుతుంది. ఒక వ్యక్తిచనిపోయిన తర్వాత అతని ఆస్తిమొత్తం అతని కుటుంబంలోని సభ్యులందరికీ అనగా కుమారులు, కూతుళ్లు ఇతర బంధువులకు చెందుతుంది.
జకాత్ చెల్లించడం ద్వారా మనిషిలో మమత, మమకారం, సౌమ్యత, సౌభ్రాతృత్వం, త్యాగం, ధాతృత్వాలు జనింపజేస్తాయి. అందుకే ధనికులు తాము చెల్లించే జకాత్ పేదల హక్కుగా భావించాలని ఖురాన్ ఉపదేశిస్తుంది. దీనికి ప్రతిఫలం పరలోకంలో ఉంటుందని అల్లాహ్ ఖురాన్ ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. మానవుని సంకుచిత దృష్టిలోని రెండవ కోణంలో పరిశీలించినట్లయితే మనిషి ప్రతిపని యొక్క ఫలితం వెంటనే లభించాలని ఆశిస్తాడు. ప్రతి విషయంలోనూ తన స్వలాభాన్నే చూసుకుంటాడు. తన సంపద, తన సుఖ సంతోషాల కోసమే ఖర్చు కావాలంటాడు.
ఎవరికైనా ఇస్తే దానికి ఫ్రతిఫలంగా అధికారమో, హోదాయో లేదా పేరు ప్రతిష్టలో దక్కాలని ఆశిస్తాడు. మనిషి ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే అతను స్వార్థ పరుడిగానే మిగిలిపోతాడు. ఒకవేళ అతను డబ్బు ఖర్చుపెట్టే విధానంలో మార్పు చేసుకుని తన మనోరంజకమైన వాటిపై ఖర్చ చేసినట్లయితే అనగా తాగుడు, అశ్లీలం వాటికి పెట్టినట్లయితే సమాజంలో భోగలాలసత్వం, విశృంఖలత్వం పెరిగిపోయి సమాజంపై దుష్ప్రభావం పడుతుంది. దీని మూలంగా సమాజంలోని నిరుపేదలు మరింత నిరుపేదలుగా మారి, అలజడులు పెట్రేగిపోతాయి. చివరికి సమాజం అంతరించిపోతుంది. కాబట్టి ఇస్లాం సూచించిన జకాత్‌ను ప్రతి ఒక్క పౌరుడు (ధనికుడు) దైవ ప్రీతితో సమాజంలో ఖర్చు చేసినట్లయితే ధర్మసంస్థాపన నెలకొంటుంది. మానవునిలోని అత్యాశ, లోభం, ద్వేషాలని నిర్మూలించడం, తద్వారా సమాజాన్ని సంస్కరించడం. అప్పుడే సమాజానికి ఒక భద్రమైన, సుస్థిరమైన ప్రపంచాన్ని సాధించగలం. అక్కడే మనుషులంతా పరస్పర గౌరవ మర్యాదలతో, సామరస్యంగా జీవించగలుగుతారు.
ఫిత్రాదానం
రంజాన్ నెలలోనే ఉపవాసమున్నవారు ఫిత్రా చెల్లించాల్సి ఉంటుంది. ఫిత్రా అనగా దానం. ఎవరికైనా ప్రారంభించిన పని ఏదైనా జయవూపదంగా ముగిస్తే అమితమైన సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా ఆ పనిచేయడానికి సద్బుద్ధి ప్రసాదించి, దాన్ని జయవూపదంగా పూర్తవడానికి అవకాశం కల్పించిన దైవంపట్ల మన హృదయం కృతజ్ఞతాభావంతో నిండిపోతుంది. అప్పుడు మనం దేవునికి కృతజ్ఞతతో ప్రార్థిస్తాం. అదేవిధంగా రంజాన్, ఉపవాస దీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయితే దైవదాసునికి కలిగే ఆనందం వర్ణనాతీతం. ఉపవాసి సత్కార్యాల ప్రతిరూపం. అతడి బాహ్య శరీరంలో పవివూతాత్మ నిత్యం జాగృతమై ఉంటుంది. ఉపవాసం ఉన్నవారు. అసత్యాలు, చాడీలు, అసభ్యకరమైన పలుకులు, ఇతరుల మనసు నొప్పించడం, వారి హక్కులు హరించడంలాంటి ఏవిధమైన చెడ్డ పనులకు పాల్పడడు. అన్ని రకాల చెడులనుంచి సురక్షితంగా ఉంటాడు. కనీసం అలా ఉండటానికి ప్రయత్నిస్తాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో చేతల ద్వారానో, మాటలద్వారానో చెడు జరగొచ్చు.
అందుకుగాను మహావూపవక్త (స.అ.స) ఉపవాసులకు ఇలాంటి లోపాలకు అతీతంగా, పవివూతంగా పూర్తిచేయడానికి ఒక ప్రతైకమైన దానం చేయాల్సిందిగా హితవుపలికారు. దీనిని ఇస్లామిక్ షరియత్ (చట్టం)వూపకారం ‘సద్‌ఖా పిత్’్రఅంటారు. హదీసుల్లో ఇలా ఉంది. - ‘ఫివూతాదానం చెల్లించనంతవరకు రంజాన్ రోజాలు భూమ్యాకాశాల మధ్య వేలాడుతూ ఉంటాయి. దైవసన్నిధికి చేరవు’ (తర్‌గీల్). ఫిత్రాదానం ప్రతిఒక్కరూ చెల్లించాలి. ధనవంతుడుగానీ పేదవాడు గానీ తప్పనిసరిగా ఫిత్రాదానం చెల్లించాలి. ఎవరివద్దనైతే పండుగనాడు తన కుటుంబానికి సరిపడా ధనధన్యాలు పోగా మిగిలినదానిలో కుటుంబంలోని ప్రతిఒక్కరి తరపున ఒక ‘సా’ ఎత్తు (ధాన్యం) చెల్లించగల స్తోమత ఉంటే అతను తన కుటుంబ సభ్యులందరి తరపున ఫిత్రాదానాలు చెల్లించడం తప్పనిసరి. ఇక్కడ ‘సా’ అంటే పావు తక్కువ రెండు సేర్లు. అంత మోతాదులో ధాన్యం (బియ్యం లేదా గోధుమలు) లేదా దానికి ఖరీదు చెల్లించాలి. కుటుంబంలో చిన్నా, పెద్దా తారతమ్యాలు లేకుండా ఎంతమంది సభ్యులుంటే అంతమంది చెల్లించాలి. అప్పుడే పుట్టిన పిల్లలు, స్వతంవూతుడు, బానిస, స్త్రీ, పురుషులు ప్రతిఒక్కరూ ఇందులో భాగస్తులవుతారు. అంటే అందరికీ ఫిత్రాదానం వర్తిస్తుంది. ఫిత్రాదానం పండుగ ‘‘ఈద్ ఉల్ ఫిత్’్ర’ కు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది.
ఒక హదీసులో ‘దైవం ధనవంతుడిని అతడి సద్‌ఖా (జకాత్)మూలంగా పరిశుద్ధ పరుస్తాడు. పోతే పేదవాడు ఎంత ఫిత్రాదానం చేస్తాడో అంతకంటే ఎక్కువ అతడికి దేవుడు తిరిగిస్తాడు’.(ఇతరుల దానం అతనికి ఇప్పించడం ద్వారా) (అబూదావూద్) అంటే దైవదాసుడు సంకల్ప శుద్ధితో దైవమార్గంలో ఖర్చుపెడితే అతను ఖర్చు పెట్టే ఒక రూపాయికి బదులుగా దైవం ఏడింతలు ఇవ్వవచ్చు. అంతేకాకుండా దైవం ఇష్టపడితే అతని పుణ్యఫలం కొన్ని వేలట్లు అధికం కావచ్చు కూడా. పేదలకు ధన సహాయంతోపాటు ధర్మ వ్యాప్తికోసం వీలైనంత ఎక్కువగా ఖర్చు చేసినట్లయితే విశ్వాసికి ఎంతో లాభదాయకంగా ఉంటుందని ఇస్లాం విశ్వసిస్తుంది. రంజాన్ మాస శుభాలు విశ్వాసికి ఎంత లాభదాయకమైనవో దీనిద్వారా తెలుస్తుంది. సత్కార్యాలు చేయడానికి ప్రతిఒక్క విశ్వాసి ఒకరితో ఒకరు పోటీ పడేట్లు రంజాన్ చేస్తుంది. దైవాన్ని విశ్వసించే విశ్వాసులందరూ ఆత్మ తృప్తితో వారి దీక్షలు కొనసాగించాలని, నమాజ్, రోజా, జకాత్‌ను ప్రతిఒక్కరూ విధిగా పాటించాలని, దాంతో సమాజంలోని అన్ని అలజడులకు సమాధానం దొరుకుతుందని ఆశిస్తూ... ఆమీన్... సుమ్మా ఆమీన్..
- ఎం.డి.బాబర్‌ఖాన్, వలిగొండ,
నల్గొండ జిల్లా, 9499759
Other News