సెటిల్‌మెంట్ ఎప్పుడు?
నేను 11 సెప్టెంబర్ 1987 ఉదయం 3.15నిమిషాలకి హన్మకొండలో జన్మించాను. ఎంబీఏ పూర్తి చేసి సంవత్సరం అయింది. ఏ పని చేసినా కలిసి రావడం లేదు. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి.:- సంతోషచారి, హన్మకొండ
మీ నక్షత్రం అశ్వని, 2వపాదం. మేషరాశి. మీకు గజకేసరి యోగం ఉంది. వజ్ర మహాపురుష యోగమూ ఉంది. ధన యోగాలు కూడా బాగున్నాయి. ధనానికి లోటు ఉండదు. చరాస్థులు ఎక్కువగా ఉంటాయి. జూన్ 2012 నుంచి అక్టోబర్ 2012 వరకు రవిలో కుజ, అక్టోబర్ 2012 నుంచి సెప్టెంబర్ 2013 వరకు రవిలో రాహు, సెప్టెంబర్ 2013 నుంచి జూలై 2014 వరకు రవిలో గురువు, జూలై 2014 నుంచి జూన్ 2015 వరకు రవిలో శని, జూన్ 2015 నుంచి ఏప్రిల్ 2016 వరకు రవిలో కుజ, ఏప్రిల్ 2016 నుంచి సెప్టెంబర్ 2016వరకు రవిలో కేతువు, సెప్టెంబర్ 2016 నుంచి సెప్టెంబర్ 2017 వరకు రవిలో శుక్ర భుక్తులున్నాయి. ఇక్కడ రవికి శుక్రుడు, బుధుడు, చంద్రుడు కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్. మీకు రవి మహాదశ యోగిస్తుంది. అయితే ఎడ్యుకేషనల్ పరంగా యోగించాలంటే.. రాహు, కేతువులకు శాంతి చేయించాలి. మీకు ఈ సంవత్సరంలో ఉద్యోగం వస్తుంది.. తదుపరి 2013చి వరన మరొక జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2016- 2017మధ్యన పూర్తి స్థాయిలో సెటిలవుతారు. వివాహం 2014-2015మధ్య అవుతుంది. మీరు సుబ్రహ్మణ్యస్వామికి ఏడు మంగళవారాలు పాలాభిషేకం చేయించుకోండి. శక్తి కంకణం ధరించండి. ప్రతిరోజూ శని, రాహు, కేతువుల స్తోత్రాలను పఠించండి. 3కేట్ల కనకపుష్య రాగాన్ని కుడి చేతి చూపుడు వేలుకి ధరించండి. మీరు ఉద్యోగ పరంగా ముందు, ముందు మంచి స్థాయిలో ఉంటారు. మీ జాతకం జీవితంలో ఎగువ స్థాయిలో ఉండే జాతకం. మీకు ధన, వృత్తి స్థానాల్లో గ్రహాల కలయిక అద్భుతంగా ఉంది. అవే మిమ్మల్ని తారాస్థాయిలో నిలబెడతాయి. కాకపోతే.. భాగ్యాధిపతి కేతువు నక్షవూతంలో ఉండడం, ఆ కేతువుకి తృతీయ వ్యయాయధిపతి కలయిక వల్ల మీకు మనఃచాంచల్యం, జీవిత ఉన్నతికి కాస్త అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. అందువల్ల మీరు గణపతి మూల మంత్రాన్ని రోజూ 30నిమిషాలు జపించండి. అష్టముఖి రుద్రాక్షను ధరించండి. అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు. రోజూ దుర్గాష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించండి. శనివారం నియమం పాటించండి.
నేను 2 ఫిబ్రవరి 1990 ఉదయం 5.30నిమిషాలకు వరంగల్‌లో జన్మించాను. బీటెక్ 2011లో పూర్తిచేశాను. నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది? సాఫ్ట్‌వేరా లేదా గవర్నమెంటా? లేకపోతే ఎంటెక్ చదవమంటారా? నేను ప్రేమించిన అబ్బాయితోనే వివాహం జరుగుతుందా? లేక ఆరెంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటానా?:- సుప్రియ, వరంగల్
మీది అశ్వని నక్షత్రం, 3 పాదం. మేషరాశి. మీకు మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. మీ జాతకంలో గ్రహాల కలయిక మిమ్మల్ని నష్టపరిచే స్థాయిలో ఉంది. మీరు ముందు ఉద్రేక, మొండి స్వభావాన్ని మానుకోండి. మీకు కొంచెం గర్వం ఉంటుంది. ఎదుటి వాళ్లతో సున్నితంగా మాట్లాడితే మంచిది. వర్తమానం మీకు ఆగస్టు 2012 నుంచి ఫిబ్రవరి 2013 వరకు రవిలో చంద్ర, ఫిబ్రవరి 2013 నుంచి జూన్ 2013రకు రవిలో కుజ, జూన్ 2013 నుంచి మే 2014వరకు రవిలో రాహు, మే 2014 నుంచి మార్చి 2015 వరకు రవిలో గురువు, మార్చి 2015 నుంచి ఫిబ్రవరి 2016 వరకు రవిలో శని, ఫిబ్రవరి 2016 నుంచి డిసెంబర్ 2016 వరకు రవిలో బుధ, డిసెంబర్ 2016 నుంచి ఏప్రిల్ 2017 వరకు రవిలో కేతువు, ఏప్రిల్ 2017 నుంచి ఏప్రిల్ 2018 వరకు రవిలో శుక్ర. ఇక్కడ రవికి చంద్రుడు, బుధుడు, శుక్రుడు కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్. రవి మహాదశలో మీకు తండ్రితో విరోధం, దుందుడుకు స్వభావం, మాట పట్టింపులు, ఆత్మవిశ్వాసం లోపించడం, సరైన గుర్తింపు లేకపోవడం లాంటి ఫలితాలనిస్తాయి. మీకు ఉద్యోగం 2014లో వస్తుంది. గవర్నమెంట్ జాబ్ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌లో రాణిస్తారు. ఎంటెక్ పూర్తి చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంది. మ్యారేజ్ 2013లో అయ్యే అవకాశాలు ఉంది. తల్లిదంవూడులను కాదని ఏమీ చేయకండి. తల్లిదంవూడుల అనుమతితోనే పెళ్లి చేసుకోండి. వ్యక్తిగతంగా సంప్రదిస్తే బాగుంటుంది. దత్తావూతేయ స్వామిని ఆరాధించండి. మీరు అనుకున్న విషయాల్లో లబ్ధి చేకూరుతుంది. మీరు వీలైతే.. వైఢూర్యం 3కేట్లు కుడిచేతి ఉంగరపు వేలుకి ధరించండి. నవక్షిగహ స్తోత్రాలను పఠించండి. వీలైతే.. నవక్షిగహ పాశుపత హోమం జరిపించుకోండి. నిత్యం నవక్షిగహ ప్రదక్షిణలు చేయండి. నాన్ దూరంగా ఉండండి.
నేను 23 మే 1980 సాయంత్రం 5.30నిమిషాలకి హైదరాబాద్‌లో జన్మించాను. ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. కొత్త జాబ్ వస్తుందా? భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి.:- క్రాంతికుమార్, హైదరాబాద్
మీది ఉత్తర నక్షత్రం 1వపాదం. కుంభరాశి. మీ జాతకంలో ధన యోగాలు అద్భుతంగా ఉన్నాయి. అసాధారణ ధన యోగం ఉంది. భవిష్యత్ చాలా బాగుంటుంది. మీకు జూన్ 2013 వరకు రాహులో బుధుడు, జూన్ 2013 నుంచి జూలై 2014 వరకు రాహులో కేతువు, జూలై 2014 నుంచి జూలై 2015 వరకు రాహువులో శుక్రుడు, జూలై 2015 నుంచి జూన్ 2018 వరకు రాహువులో రవి, జూన్ 2018 నుంచి డిసెంబర్ 2019 వరకు రాహువులో చంద్రుడు, డిసెంబర్ 2019 నుంచి డిసెంబర్ 2020 వరకు రాహువులో కుజుడు. తదుపరి గురు మహాదశ. ఇక్కడ రాహువుకు కేతువు, శుక్రుడు కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్. మీ జాతకంలో శుక్ర స్థితి బాగా లేనందున రాహు మహాదశ అంతగా యోగించదు. గురు మహాదశ యోగిస్తుంది. గురు మహాదశ యోగించాలంటే.. మీరు ఒక గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకొని సాధన చేయాలి. మీ జాతకంలో తండ్రికి ఆకస్మాత్తుగా కష్ట, నష్టాలు కనపడుతున్నాయి. దానికి కారణం.. మీరు శ్రీమన్నారాయణుని ఆలయంలో చేసిన ఒక తప్పిదం. మీకు అలా కష్టనష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున మీరు ఒక సంవత్సరం పాటు శ్రీ వేంక ప్రతీ బుధవారం నాడు పూజాధి కార్యక్షికమాలు జరిపించుకోండి. మీకు గజకేసరి యోగం, చ్రంద మంగళ యోగం లాంటివి ఉండి యోగించినా, అక్కడే గురు చంఢాల యోగం, అనపత్య దోషం స్పర్శ వల్ల మీకు కొంత యోగభంగం జరిగింది. తప్పకుండా మీరు ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి. అది గణపతి కానీ లేదా హనుమన్ మూల మంత్రం, శ్రీవేంక మూల మంత్రం కానీ ఉపదేశం తీసుకోవాలి. మీరు నాలుగు కేరెట్ల మయూర నీలం కుడి చేతి మధ్యవేలుకు ధరించండి. శుక్రవారం నియమం పాటించండి. భవిష్యత్తు బాగుంది. మీకు 2014లో జాబ్‌లో మార్పు కనిపిస్తుంది. 2021 నుంచి మంచి స్థితిలోకి వెళతారు. నిత్యం కేతు గ్రహ స్తోత్రాన్ని 7సార్లు పఠించండి.
నేను నవంబర్ 14, 1983 ఉదయం 7.25నిమిషాలకు హైదరాబాద్‌లో జన్మించాను. నా నక్షత్రం, రాశి ఏమిటి? లైఫ్ సెటెల్‌మెంట్ ఎప్పుడు జరుగుతుంది. రెమిడీస్ ఏమి పాటించాలో చెప్పండి. నా సర్టిఫికేట్స్‌లో వేరే పుట్టిన తేదీ ఉంది? దానివల్ల నా భవిష్యత్ మీద ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా?:- మాధవడ్డి, హైదరాబాద్
మీ నక్షత్రం శతభిష, 2పాదం. కుంభరాశి. మీకు శశిమహాపురుష యోగం ఉంది. మీకు 2012 ఏప్రిల్ నుంచి డిసెబర్ 2014 వరకు శనిలో బుధుడు, డిసెంబర్ 2014 నుంచి జనవరి 2016 వరకు శనిలో కేతువు, జనవరి 2016 నుంచి మార్చి 2019 వరకు శనిలో శుక్రుడు, మార్చి 2019 నుంచి మార్చి 2020 వరకు శనిలో రవి, మార్చి 2020 నుంచి అక్టోబర్ 2021 వరకు శనిలో చంద్రుడు, అక్టోబర్ 2021 నుంచి నవంబర్ 2022 వరకు శనిలో కుజుడు, నవంబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2025 వరకు శనిలో రాహువు, సెప్టెంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2028వరకు శనిలో గురువు. ఇక్కడ శనికి రాహువు, చంద్రుడు, శుక్రుడు కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్. మీకు శని మహాదశ ఉత్తరార్ధం యోగిస్తుంది. దశమాధిపతి స్థితి బాగాలేదు. అదేవిధంగా ఆ దశమాధిపతే ఆరవ భావానికి సబ్‌లార్డ్ అయి ఉన్నాడు. దీనివల్ల ఉద్యోగంలో స్థిరత్వం లోపిస్తుంది. కానీ లైఫ్ సెటిల్‌మెంట్ బాగానే ఉంటుంది. మీరు 2016 నుంచి జీవితంలో స్థిరత్వం ఉంటుంది. అక్కడి నుంచి ముందు, ముందు బాగుంటుంది. 2019-2020 మధ్యన జాగ్రత్తగా ఉండండి. సర్టిఫికెట్స్‌లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే.. మీరు కానీ, ఎవరైనా కానీ వారి, వారి కర్మలను అనుసరించే ఆ గ్రహాలు ఆయా స్థితిలో ఉన్నప్పుడే జన్మించడం జరుగుతుంది. గ్రహాల స్థితిగతులు మీ త్రివివిధ కర్మల గురించి తెలియచేస్తాయి. కాబట్టి జన్మించిన తేదీ, సమయం అనేది ఒక జాతకుడి ఉనికిని చాటుతుంది. అది ఒక మనిషికీ, మరో మనిషికీ తేడాగా ఉంటుంది. కాబట్టి మంచి కర్మలు చేయాలంటే.. మంచి బుద్ధి ఉండాలి. బుద్ధి ఎప్పుడైతే సక్రమంగా ఉంటందో మన కర్మలు కూడా సక్రమంగా ఉండి మన జాతక దిశను మార్చేస్తుంది. తద్వారా మనకు ఫ్రీడమ్ ఆఫ్ విల్ అనే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే.. స్వేచ్ఛాయుతమైన సంకల్ప బలం ఎక్కువగా వస్తుంది. అప్పుడే మనం గొప్పవ్యక్తులుగా మారుతాం. జీవితంలో చేసే ప్రతి పని కూడా మీకు ఫలితాలను ఇవ్వగలుగుతుంది. అది మంచి కానీ, చెడు కానీ. కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీ వైవాహిక జీవితం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆడవాళ్లకు దూరంగా ఉండాలి. అంతకముందు జన్మలలో ఉద్యోగ కర్తవ్య నిర్వహణ సరిగా చేయలేదు. మీ మనసు సంపాదన కోరుకుంటుంది. అవి కూడా కష్టపడకుండా రావాలి అంటుంది. అలా చేసి ఉన్నందువల్లే మీ జాతకం ఈవిధంగా ఉంది. శ్రమను నమ్ముకోండి. భగవంతుడిని ఆరాధించండి. విజయం నీ సొంతమవుతుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. రాహు, కేతువులకు అభిషేకం చేయించండి. ప్రతి ఆదివారం శునకాలకు తీపి చపాతీలు తినిపించండి. బుధ, శని, రవి స్తోత్రాలను పఠించండి. ఆదివారం నియమం పాటించండి. కుడిచేతి చూపుడు వేలుకి కనకపుష్యరాగం 3కేట్లు ధరించండి. వీలైతే.. 2.5కేరెట్ల కెంపును కుడిచేతి ఉంగరం వేలుకి ధరించండి.
గమనిక :
జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తి పేరు, పుట్టిన తేది, పుట్టిన సమయం, పుట్టిన స్థలం (30 కిలోమీటర్లు దగ్గరలో ఉన్న పట్టణం,
నగరం, జిల్లా వివరాలు) తప్పక పంపాలి.
మా చిరునామా : జిందగీ (ఆస్ట్రాలజీ), నమస్తే తెలంగాణ
8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్ నం. 10, బంజారాహిల్స్ - 34. features@namasthetelangaana.com
Other News