చాతుర్మాస వ్రతం
చాతుర్మాస్య వ్రతం హిందూమతంలో అత్యంత ప్రధానమైంది. ఈ కాలంలో గృహస్థులు మొదలు పీఠాధిపతుల వరకు దీక్షలో భగవంతుని అర్చిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకొంటారు. ఈ నాలుగు నెలలు అనగా ఆషాడ శుక్ల ఏకాదశి(శయన ఏకాదశి) మొదలు కార్తీక శుక్ల ద్వాదశి వరకు దీక్షను చేపడుతారు. శయన ఏకాదశి నాడు దేవతలకు నిద్రకు ఉపక్షికమించి ఉత్థాన ఏకాదశినాడు నిద్ర నుంచి మేల్కొంటారు అని ప్రతీతి.ఈ దీక్షను పీఠాధిపతులు, జ్ఞానులు, యోగులు, భక్తులు తమతమ కోర్కెల సాధనకు లేదా అంతిమ లక్ష్య సాధనలో భాగంగా చేస్తుంటారు. దీక్షా సమయంలో దీక్షను చెప్పట్టిన వారు నేలపై పడుకొంటారు. కఠిన నియమాలను ఆచరిస్తారు. మౌనంగా ఉంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధిస్తారు.కొన్ని ప్రాంతాలలో ఈ నాలుగు నెలల కాలం కూడా పెళ్లిల్లు, నూతన గ్రహవూపవేశాలు, ప్రారంభోత్సవాలు, తదితర శుభకార్యాలు కూడా దూరంగా ఉంటారు. కార్తీక మాసంలో ఏకాదశి తర్వాత వీటిని చేసుకొనే సాంప్రదాయం ఉంది. చాతుర్మాస్య దీక్ష కఠినమైనది ఎంతమాత్రం కాదు. కేవలం విశ్వాసం, భక్తి ఉంటే ఎవరైనా చేయవచ్చు.ఈ దీక్షను చేయాలనుకొనే వారు ప్రాతఃకాలమందే నిద్రలేవాలి.
సూర్యోదయానికి పూర్వమే. కాలకృత్యాలను తీర్చుకొని భగవత్ ఆరాధన చేయాలి. ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదు. ముఖ్యంగా ఒక్కో నెల ఒక్కో రకం ఆహార పదార్థాలను స్వీకరిస్తూ ఉంటారు. వాటిని పరిశీలిస్తే .. శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగు, ఆశ్వీయుజ మాసంలో పాలను, కార్తీక మాసంలో మినపప్పును తీసుకోకుండా దీక్షను చేపడుతారు. ముఖ్యంగా విష్ణుపూజా కార్యక్షికమాలను చేస్తారు. విష్ణుమూర్తికి అభిషేకం, విష్ణుసహవూసనామ స్తోత్రాల పఠనం, విష్ణుకథాలాపనం, భజనలు చేస్తు దీక్షను కొనసాగిస్తారు.చివరి రోజున బ్రాహ్మణులకు, బీదలకు దానధర్మాలను చేస్తారు. ఆహార పదార్థాలు, వస్త్రాలు, నిత్యావసర వస్తువులను దానంగా ఇచ్చే సాంప్రదాయం ఉంది. చాలా మంది భక్తులు రామాయణ, భారత భాగవతాది పురాణాలను, భగవద్గీత తదితర ఆధ్యాత్మిక పుస్తక పఠనం, దేవాలయ సందర్శనం, పేదలకు సేవా కార్యాక్షికమాలు, విష్ణు దేవాలయ సందర్శన, దేవాలయ నిర్వహణలో పాలు పంచుకోవడం లాంటివి చేస్తుంటారు.
దీక్ష సమయంలో ఉపవాసాలు చేయడం వల్ల లాభాలను పరిశీలిస్తే....
* ఉప్పు తినక పోవడం వలన గుండె జబ్బులు లాంటివి దూరమవుతాయి. మంచి కంఠస్వరం వస్తుంది.
* నూనె పదార్థాలను స్వీకరించకపోవడం వల్ల ఆయుఃవూపమాణం పెరుగుతుంది.
* పచ్చి పండ్లు, కూరగాయలను ఈ వర్షాకాలంలో తీసుకోకపోవడం వల్ల ఈ నెలల్లో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
* పాలు తీసుకోకపోవడం వల్ల ప్రశాంతత, తేనె లేకుండా గడపడం వల్ల బద్దకం వదలడం, వేడి వేడి ఆహారపదార్థాలు తీసుకోకపోవడం వల్ల పిల్లలకు దీర్ఘాయుష్షు, వక్కలు తదితర పదార్థాలు తీసుకోకపోవడం వల్ల సంతోషం, నేల మీద పరుండడం వల్ల విష్ణు అనువూగహం, ఒక్క పూట భోజనంతో అగ్నిహోత్రం చేసిన ఫలితం, మధ్యాహ్నం మాత్రమే ఆహారం తీసుకోవడం వల్ల దేవలోక ప్రాప్తి, కేవలం రాత్రి భోజనం చేయడం వల్ల దైవ క్షేత్ర సందర్శనా ఫలితం కలుగుతాయని విశ్వసిస్తారు.
* అదేవిధంగా దీక్ష చేస్తున్న వ్యక్తి పాదాలను తగిలితే విజయం ప్రాప్తిస్తుందని, ఈ కాలంలో దేవాలయాలను పరిశుభ్రం చేసే కార్యక్షికమాల్లో పాల్గొంటే మంచి ఇళ్లు, దేవాలయ సందర్శన వల్ల మోక్షం, దేవాలయంలో భక్తి పాటలు పాడితే గంధర్వలోక ప్రాప్తి, సహవూసనామ పారాయణం వల్ల విష్ణులోక ప్రాప్తి, దేవాలయాల ముందర పరిశుభ్రం చేసి ముగ్గులు లాంటివి పెడితే అప్సర లోక ప్రాప్తి, విష్ణుమూర్తికి పూజ చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
* అదేవిధంగా యోగాభ్యాసం వల్ల మోక్షం, ఆకుల్లో (అరటి, మోదుగ లాంటి) ఆహారం తీసుకోవడం వల్ల మహాభారత పఠనం వల్ల వచ్చే ఫలితం, నిత్యం స్నానం చేయడం వల్ల స్వర్గ ప్రాప్తి, చెడు మాటలు, పనులకు దూరంగా ఉండడం వల్ల అధికార ప్రాప్తి కలుగుతాయని పూర్వకాలం నుంచి విశ్వసిస్తున్నారు.
ఇక ఈ నాలుగు నెలల్లో మొదట వచ్చేది శ్రావణ మాసం ఇది పరమ పవిత్ర మాసాల్లో ఒకటి. ముఖ్యంగా ఉత్తర భారతీయులు దీన్ని శివుడికి పరమ పవివూతమాసంగా భావించి పూజాదికాలు నిర్వహిస్తారు. సోమవార దీక్షలను చేస్తారు. పురాణకథలననుసరించి సాగరమథనంలో భాగంగా దాన్నుంచి వెలువడిన విషాన్ని(కాలకూటం/ హలాహలం)న్ని స్వీకరించింది శ్రావణ మాసంలోనేని విశ్వసిస్తారు. హలాహలం తీసుకొన్న శివుడి కంఠం నల్లగా మాడిపోవడంతో ఆయన్ను నీలకంఠ అని కూడా పిలుస్తారు. ఆవిధంగా ప్రపంచాన్ని కాలకూట విషం నుంచి రక్షించిన మాసం కాబట్టి దీన్ని పవివూతంగా భావిస్తారు. నాలుగు నెలలు దీక్షను పరిశీలిస్తే ఇది శాస్త్రీయంగా కూడా మానవుని ఆరోగ్యాన్ని కాపాడే చర్యలను భాగంగా దీక్షను తీర్చిదిద్దారు మన పూర్వీకులు. వాటిని పరిశీలిద్దాం.. ముఖ్యంగా ఈ కాలం వర్షాకాలం. కాబట్టి ఈ సమయంలో అనగా శ్రావణ మాసంలో ఆకుకూరలను తీసుకోకుండా ఉంటారు.
- కేశవపంతుల వెంక శర్మ venkat.keshva@gmail.com
Other News