రంజాన్ మాసం విశిష్టత
ఒక ప్రత్యేక జాతి లేదా వర్గం దైవత్వానికి చేరువయ్యేందుకు ఆధ్యాత్మికంగా విధివిధానాలను, దిశానిర్దేశాలను సత్ప్రవర్తన, ఇత్యాది అంశాల మార్గదర్శకత్వం చేసేది మతం. మత ప్రమేయం అక్కడితో ఆగిపోలేదు. మానవుల దౌనందిన జీవన చర్యలు, నైతికవిలువలు, సత్‌వూపవర్తన, సత్యసాధన, మానవతను పెంపొందించే విషయంలో తనదంటూ ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తూ వస్తున్నది. ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇస్లాం గురించి. ఇస్లాం మత అవలంబించేవారికి, ఆధ్యాత్మిక, సామాజిక వ్యక్తిగత, న్యాయ ధర్మ, శిక్ష వంటి అంశాలన్నింటికీ పరమపవివూతమైన ఖురాన్ గ్రంథమే ఆధారం కావడం అందుకు విలక్షణమైన ఉదాహరణ. ఇస్లాం అనే పదానికి పూర్తి వినయ విధేయతలతో సకల చరాచర సృష్టికర్త, సర్వేశ్వరుడైన అల్లాకు లోబడి ఉండటం అని అర్థం. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడే అపార కరుణామయుడు. ఎవరి అదుపు ఆజ్ఞలో సకల చరాచర లోకవ్యవస్థ ఆగమిస్తుందో అలాంటి పరమపవివూతమైన పరమేశ్వరుడైన అల్లాహ్‌కి లోబడి పవిత్ర ఖురాన్ నిర్దేశిత జీవన విధానాన్ని గడపడం ఇస్లాం మతం అవలంభించేవారి విధి. అయితే ఇస్లాంను పరిపూర్ణంగా అమలు చేసేందుకు ముస్లింలు ఐదు ముఖ్యమైన అంశాలను పాటించాల్సి ఉంటుంది. అవి
1. ఈమాన్ ( దైవత్వం పట్ల ప్రగాఢ విశ్వాసం)
2. నమాజ్ (8 సంవత్సరాలు దాటిన బాలబాలికలతో విధిగా 5 సార్లు పాటించవలసింది)
3. రోజా (ఉపవాస దీక్ష) 8 సంవత్సరాలు దాటిని బాలబాలికలతోపాటు అందరూ విధిగా పాటించాల్సింది.
4. జకాత్ / సద్కా (దాన ధర్మాలు) తమ స్థిర, చరాస్తులు, ఆదాయం, సంపదను బట్టి నిర్దేశించిన స్థాయిలో దానధర్మాలు చేయడం
5. హజ్‌యాత్ర : సౌదీ అరేబియా మక్కాలో నెలకొని ఉన్నా పరమపవివూతమైన దైవగృహం అనబడే కాబా క్షేత్రాన్ని నిర్దేశిత మ్సాంలో నిర్దేశిత నియమ నిబంధనలు పాటిస్తూ దర్శించి పునీతులు కావడమే హజ్ యాత్ర ఆంతర్యం. ఆర్థిక పుష్టి కలిగి, కుటుంబ బరువు బాధ్యతల నుంచి, అన్ని రకాల రుణాల నుంచి విముక్తమైనవారు తమ జీవితకాలంలో ఒకసారైనా హజ్‌యాత్ర చేయగలగాలి.
అయితే హజ్ యాత్ర తప్ప మిగతా నాలుగు అంశాలు ఆర్థి స్థోమతలో వ్యత్యాసాలున్నప్పటికీ, ప్రతి ముస్లిం స్త్రీ, పురుషులు పాటించాల్సిందే. పై ఐదు అంశాలు ‘దీన్’ అనగా దైవానికి (ఇస్లాంకు) మూల స్థంభాలాంటివిగా భావిస్తారు. ఐదు అంశాల్లో ఒకటైన రోజా (ఉపవాస దీక్ష) రంజాన్ మాసంలో అత్యంత భక్తిక్షిశద్ధలతో పాటించే దీక్ష. ఈ నెలలో ముస్లిం సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది. అందుకు ఎన్నో కారణాలున్నాయి. రంజాన్ మాసం గురించి దివ్య ఖురాన్ 2-185 అధ్యాయంలో ఇలా వివరించడం జరిగింది. ‘‘పవిత్ర దివ్య ఖురాన్ గ్రంథం అవతరించిన మాసం రంజాన్. మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. రుజు మార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుంచి రంజాన్ మాసాన్ని పొందే వ్యక్తి ఆ మాసం అంతా విధిగా ఉపవాస దీక్ష పాటించాలి. దైవ ప్రవక్తగా మహ్మద్ (స.అ.స) దైవ ప్రవక్తగా నియామకం జరిగింది రంజాన్ మాసంలోనే. మహోన్నత పరమ పవివూతమైన దివ్య ఖురాన్‌ను అవతరింపజేసినందుకు, మహమ్మద్ (స.అ.స)ను ప్రవక్తగా నియమించినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతను తెలియజేయడానికి ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తారనేది మరోకారణం. అందువల్లనే రంజాన్ మాసం ఇంతటి ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను సంతరించుకుంది. దైవ ప్రవక్త మహనీయులు మహమ్మద్ (స.అ.స) ఒక సందర్భంలో రంజాన్ గురించి ఇలా అన్నారు ‘‘ప్రజలారా రంజాన్ ఎనలేని లాభాల మాసం. ఈ మాసంలో ఒకరాత్రి వస్తుంది. ఆ రాత్రి వెయ్యి మాసాలకంటే ఎక్కువ శ్రేష్టమైనది. అల్లాహ్ ఈ మాసం అంతా విధిగా ఉపవాసాలు ఉండాలని ఆజ్ఙాపించాడు.
ఎవరైనా రంజాన్ మాసంలో ఒక పుణ్య విధిని నిర్వహిచేస్తే వారికి ఇతర మాసంలో నిర్వర్తించే 70సత్కార్యాల పుణ్యం లభిస్తుంది’’ అని. అందుకే రంజాన్ మాసంలో జకాత్ - సద్కా (దానధర్మాలు) ఎక్కువగా జరుగుతాయి. రంజాన్ సహనమాసం. సహనానికి ప్రతిఫలం స్వర్గం. పరస్పరంగా సానుభూతి కనబర్చాల్సిన మాసం. కోపతాపాలకు దూరంగా, శాంతంగా, దయాభావంతో ఉండాల్సిన కాలం. రంజాన్ మాసంలో దైవభక్తుల ఉపాధి, దైవికత, ఆర్థిక లబ్ధి, ఆధ్యాత్మిక అనుక్షిగహం ఎప్పుడూ లేనంతగా వృద్ధి చెందుతాయి.
రంజాన్ ఉపవాస దీక్ష విశేషాలు :
రంజాన్ నెలలో పూర్తి 30 రోజులు ఉపవాస దీక్ష పాటించాలి. సూర్యోదయం కంటే ముందే నిర్ధారిత సమయంలో ఆహార పానీయాలు తీసుకోవాలి. దీనిని ‘సహర్’ అంటారు. రంజాన్ ఉపవాసదీక్ష, నిరాహర, నిర్జల దీక్ష. ఉపవాస దీక్ష సమయంలో మందులు, మాకులు, ఇంజక్షన్లు, స్లైన్లు సైతం నిషేధం. పాన్, గుట్కా, సిగట్, బీడీలాంటి ధూమపానాలు కూడా నిషేధం. సూర్యాస్తమ సమయంలో ప్రతిరోజూ కొన్ని నిమిషాల తేడాతో ఉపవాస దీక్ష విరమణ నిర్దేశించడమైనది. దీన్ని ‘ఇఫ్తార్’ అంటారు. తియ్యని ఖర్జూర్, ఇతరత్రా ఫలాలతో ఉపవాస దీక్ష విరమిస్తారు. సహార్ మరియు ఇఫ్తార్ సమయాన్ని పూర్వకాలంలో ఆకాశంలో వెలుగు రేఖల్ని బట్టి నిర్ధారించేవారు. ఆధునిక సమాజంలో ప్రత్యేకంగా మోగే సైరన్లు ఉండటం సౌకర్యకరంగా మారింది. ఉపవాస దీక్షా సమయంలో విధిగా నమాజులు చేయాలి. అనైతిక ధర్మవిరుద్ధమైన, మరేవిధమైన దుష్కార్యాలకు పాల్పడకుండా ఉండాలి. అపవివూతమైన చర్యలవల్ల ఉపవాస దీక్ష సత్యలక్ష్యం దెబ్బతింటుంది. ఇఫ్తార్ సమయంలో దీక్షా వాసులకి ఎవరైనా ఇఫ్తార్ ఏర్పాటు చేస్తే ఉపవాసం వల్ల ఆ వ్యక్తికి ఎంత పుణ్యమైతే లభిస్తుందో అంతే పుణ్యం లభిస్తుంది. ఇందులో అంతర్లీనమైన ఉద్దేశం పరస్పర స్నేహభావం. ఆధ్యాత్మిక అనుబంధం మరింత ప్రగాఢంగా మారుతుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇతరులు ర్పాటు చేసే ఇఫ్తార్ విందులు సౌకర్యదాయకంగా ఉంటాయి. ఇందులో ఎంతో సౌహార్దత వ్యక్తమవుతుంది.
ఉపవాస దీక్ష కేవలం ఆహారం, నీరు తీసుకోకపోవడమే కాదు. దీక్షాపరులు అన్నిరకాల చెడు కార్యాలు, అధర్మ, పాపక్షికియలనుంచి కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. పంచేంవూదియాల వల్ల సంభవించే పాపకృత్యాలను నిగ్రహించుకోవాలి. దుష్ట, స్వార్థపూరిత, కుటిల, కుత్సిత భావాల నుంచి మనసును దూరంగా ఉంచాలి. శృంగారేచ్ఛ కామపైన కోరికలు మనసులోకి రానివ్వకూడదు. దీక్షాకాలంలో అల్లాహ్ స్మరణ, నమాజులు చేస్తూ, దానధర్మాలు నిర్వహిస్తూ, తనకు తాను అంతర్గతంగా ఆత్మ ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. రంజాన్ లేదా ‘రమాదాన్’ అనే అరబ్బీ పదానికి మండించడం లేదా దహించడం అని అర్థం. అంటే మనిషి తన మనసులోని కామ, క్రోధ, మదమోహమాత్సర్యాలను, స్వార్థ చింతనను, అనైతిక, అధర్మ దుర్గుణాలు దహింపచేసుకోవడమని అర్థం. ఉపవాసదీక్ష నుంచి కొందరికి మినహాయింపు ఉంటుంది. సరైన కారణం లేకుండా ఉపవాసం పాటించనివారు ఒక్కరోజుకు అరవై మందికి భోజనాలు పెట్టించి పశ్చాత్తాప పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది.
సామాజిక అంశం :
బీదలు పడే ఆకలి దప్పుల బాధ ఎలా ఉంటుందో ధనవంతులకు, ఉపవాసాల మూలంగా అనుభవంలోకి వస్తుంది. రంజాన్ నెలలో చేసే జకాత్ / సద్కా (దానధర్మాలు) వల్ల బీదలకు ధనధాన్యాలు, దుస్తులు బీదలకు లభిస్తాయి. ముస్లిం వ్యాపారులు, యజమానులు వారి దగ్గర పనిచేసే ఉద్యోగులకు ‘ఈది’ (పండుగ బహుమానం). సాధారణంగా డబ్బు రూపేణ కానుకలు ఇస్తారు. నెలమొత్తం, ఖర్జూరంతోసహా అనేక రకాల ఫలాల కొనుగోలు విరివిగా సాగి వ్యాపారం వృద్ధి చెందుతుంది. అందరూ తమ స్థోమతను బట్టి బట్టలు, పండుగసామాగ్రి కొనుగోలు చేస్తారు. కాబట్టి ఈ నెలలో మార్కెట్ ఎంతో కోలాహాలంగా ఉంటుంది. అందరూ ఎంతో కొంత ఆర్థిక సహాయం పొందగలుగుతారు. అందరూ ఆనందంతో ఉంటారు.
రంజాన్ మాసపు 30 రోజుల వర్గీకరణ :
మొదటి పదిరోజులు దైవకారుణ్యాన్ని ప్రతిబింబింపచేస్తాయి. తర్వాతి పదిరోజుల క్షమాభిక్షకు, చివరి పదిరోజులు నరకం నుంచి విముక్తికి ఉపకరిస్తాయని దైవవూపవక్త (స.అ.స) అభివర్ణించారు. ఇస్లాం మత విశ్వాసం ప్రకారం స్వర్గానికి గల ఎనిమిది ద్వారాల్లో ఒకటి రయ్యాన్, రంజాన్ నెల ఉపవాసాలు పాటించేవారు ఈ ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని విశ్వాసం. ఈ మాసంలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి తమకు మృత్యువు రంజాన్ మాసంలో సంభవించాలని ముస్లింలు కోరుకుంటారు. ఎన్నో అంశాల రీత్యా ఎంతో ప్రాధాన్యత గల రంజాన్ మాసాన్ని పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో పవివూతమైన భావనలతో ప్రార్థనలతో గడపాలి. ఈదుల్-ఫితర్‌తో ముగిసే రంజాన్ మాసం ముస్లింలకు అనిర్వచననీయమైన అనుభూతిని, దైవిక ఆధ్యాత్మికతను మిగిలిస్తుంది. రంజాన్ సకల మానవాళికి శుభాలు, శాంతి కలుగజేయాలని అల్లాహ్ కారుణ్యం అందరికీ లభించాలని కోరుకుంటూ... సుమ్మా ... అమీన్ సుమ్మా..
- ఎం.డి.బాబర్‌ఖాన్, వలిగొండ, నల్గొండ జిల్లా, 984987589
Other News