జీవిత పరమార్థం
‘దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సమువూదపు చేపలను ఆకాశ పక్షులను, పశువులను సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఎలుదురు గాక నియు పలికెను’(ఆదికాండము 1:26)
సర్వలోక సృష్టికర్త పరిశుద్ధుడైన దేవుడు, ఆరవ దినమున తన స్వరూపమందు నరుని సృజించినాడు, స్త్రీని గాను, పురుషునిగాను వారిని సృజించెనని బైబిలు బోధించుచున్నది. అంతేకాకుండా తాను సృజించిన సముద్ర చేపల పైన, ఆకాశ పక్షులపైన, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువుపైన వాటిని ఏలుటకు నరునికి అధికారమిచ్చినాడు. కనుక నరుని జీవితము శ్రేష్ఠమైన జీవితం. దేవుడు నిన్ను, నన్ను మనలందరినీ తన పోలికలో చేయడంలో ప్రాధాన్యత ఉంది.
పరమార్థం ఏమిటి?
మన జీవితంలో పరమార్థం అంటే.. మనం జీవించడానికి మంచి కారణాన్ని చూపేది. దేవుడు మనలను ఈ భూమిపై ఎందుకు సృష్టించాడో తెలిపేది. జీవితంలో మన ప్రయోజనం మనకే ప్రత్యేకం. మన కోసం దేవునికి ఉన్న వ్యక్తిగత పథకానికి అది చెంది ఉంటుంది. మానవుని ప్రాధాన్యత ఎంతో ప్రాముఖ్యమైనది. ‘వ్యక్తిగత విలువ యోగ్యత గలది. ఒక మానవతీతమైన ప్రయోజనాన్ని నెరవేర్చేటందుకు దేవుడు మన జీవితాన్ని సృష్టించాడు. ఇది వినడానికి అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రభువును ప్రతిబింబించడానికే మనం సృష్టింపబడ్డాం. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభువు మహిమను, అద్దము వలె ప్రతి ఫలింపచేయును. మహిమ నుంచి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము’ ( 2కొరి 3:18). మనకు ఆశాభావం ఉంది. నిరీక్షణ కర్తయైన దేవుడు మనలను సృష్టించాడు. దేవుడు మనలను ఒక పథకంతో సృష్టించాడు. దేవుని చిత్తాని అనుసరించడానికి మనం కోరుకుంటే మన బతుకులో ఆశాభావం, ప్రయోజనం నిండుతాయి. జీవితం షేక్స్‌పియర్ నాటకంలో ఒక పాత్ర కాదు, ఒక గంటసేపు రంగ స్థలంపై కనిపించి నిష్క్రమించే పాత్ర కాదు. మానవుని జీవిత ప్రాధాన్యత దేవుడు ఇచ్చిన అంతరంగ అవసరత.
మనకు ఏది శ్రేష్ఠమైనదో ఆ మేరకు వేరొకరి నుంచి మార్పులేని, షరతులు లేని అంకితభావాన్ని పొందడం. ‘నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారం, మీరొకనినొకడు ప్రేమించవపూననుటయే నా ఆజ్ఞ అని బైబిలు బోధించుచున్నది. అంటే.. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం.
మన జీవిత ప్రయోజనం, పరమార్థం గ్రహించడం. షేక్సిపియర్ విషాదాంత నాటకాలలో కథానాయకులు నిజ జీవితానికి దగ్గరగా ఉంటారు. మాక్‌బెత్ అనేవాడు స్కాట్‌లాండ్ రాజును హత్య చేయడం ద్వారా తన జీవిత పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తాడు. సింహాసనాన్ని చేజిక్కించుకుంటాడు. కానీ త్వరలోనే నాశనానికి దిగజారిపోతాడు. అతని గతంలో నుంచి దురాత్మలు అతడిని పీడిస్తుండగా మరోవైపు రాజ్యంలో అంతర్యుద్ధం చెలరేగుతుంటుంది. పూర్తి నైరాశ్యంలో తన జీవితానికి ఒక ప్రయోజనమంటూ లేదంటూ వాపోతాడు. ఈవిధంగా ఎంతో మంది వారి ప్రాధాన్యత జీవిత ప్రయోజనం గ్రహించకపోవడం. ‘మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను.’(కీర్త 57:2)
భద్రత : యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుల బహు ధైర్యము పుటిచునని వాక్యము బోధించుచున్నది. కనుక స్థిరమైన ఆమోదం, ఎవరో ఒకరికి చెంది యుండే భావన ఉండుట వలన మనకు భద్రత ఉంటుంది.
దేవుని ప్రయోజనం : మన జీవితానికి దేవుడు నియమించిన అత్యున్నత ప్రయోజనం మనలో క్రీస్తు వ్యక్తిత్వం ఏర్పడడం. కొత్త నిబంధన గ్రీకు పదం ‘సుమ్మార్ఫస్’కు పొలికలోకి మారడం అని అర్థం. అపొస్తులు డైపౌలు ఇలా చెప్పాడు. ‘దేవుడెవరని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను’(లోమా 8:29)
మహిమ కలిగించడం : ‘మహిమ’అని అర్థమిచ్చే కొత్తనిబంధన గ్రీకు పదం ‘దక్సా’అనగా ఒకరిలోను విలువను, యోగ్యతను సూచిస్తుంది. ఒక నగ విలువను సరియైన రీతిలో లెక్కగట్టి కంసాలి కాగితంపై రాసి ఇస్తాడు. క్రీస్తు లక్షణాన్ని సరిగా మనం అంచనా వేయగలిగితే ఆయనకు మహిమ చెల్లిస్తాం. ‘కాబట్టి మీరు భోజనం చేసినను, పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి’(1కొరి 10:31)వాక్యము బోధించుచున్నది.
- కె.యేసుదాసు, 9490747949
Other News