దక్షిణాయన పుణ్యకాలం
భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి కాలగణను అద్భుతంగా చేశారు. ప్రతి సంవత్సరాన్ని రెండు అయనాలుగా విభజించారు. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. పన్నెండు రాశుల్లో సూర్యుని ప్రవేశాన్ని బట్టి ప్రతినెలా సంక్రాతి వస్తుంది. ఆ పరంపరలో మకరరాశిలో సూర్యుని ప్రవేశం ‘మకర సంక్రాతి’గా నాటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంగా ఆచరిస్తారు. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుని ప్రవేశాన్ని దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంగా లెక్కిస్తారు. దీనినే కర్కాటక సంక్రాతి అని కూడా అంటారు. కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం నాటి నుంచి మకరరాశిలో సూర్యుడి ప్రవేశం వరకు మధ్య కాలాన్ని దక్షిణాయనం అంటారు. ఆరునెలలు దక్షిణాయనం, ఆరునెలలు ఉత్తరాయణం.
హిందూమతంలో దక్షిణాయన ప్రారంభం దేవతలకు రాత్రి సమయ ప్రారంభంగా విశ్వసిస్తారు. మానవుడి సంవత్సరకాలం దేవతలకు ఒకరోజు. దేవతలకు దక్షిణాయనం రాత్రి పూటగా, ఉత్తరాయణం పగటిపూటగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం దక్షిణాది రాష్ట్రాల పంచాంగం ప్రకారం జూలై 16 నుంచి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఉత్తరాది పంచాంగాలలో ఇది జూన్ 21 నుంచి ప్రారంభం అవుతుంది. సూక్ష్మంగా చెప్పాలంటే దక్షిణాయన సూర్యుడి దక్షిణం వైపు (దక్షిణం వాలినట్లుగా)వూపయాణం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. జూలై 16 నుంచి జనవరి 14 లేదా 15 వరకు ఈ కాలం ఉంటుంది. ఈ సమయంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. పగటి సమయం తక్కువగా ఉంటుంది. పురాణాలలో దక్షిణాయనం ప్రారంభమైన రోజు నుంచి విష్ణుమూర్తి నిద్రకు ఉపక్షికమిస్తాడని విశ్వాసం. దీనినే ‘దేవశయన ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ సమయంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది.
కర్కాటక సంక్రాతి రోజున పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించడం లేదా పిండ ప్రదానం చేయడం పురాణకాలం నుంచి వస్తున్న ఆచారం. మరికొన్ని పురాణాలలో వరాహమూర్తి విష్ణుమూర్తిని పూజించిన రోజుగా ప్రసిద్ధికెక్కింది. తమిళనాడులో దక్షిణాయనం ప్రారంభ నాటి నుంచే ఆడి(ఆషాఢ మాసం) ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి ఎటువంటి పండగలు, శుభకార్యాలు చేసుకోరు. అదేవిధంగా దేవతలకు రాత్రిపూటగా భావించే దక్షిణాయనంలో కొన్ని ముఖ్యమైన పండగలు కూడా వస్తాయి.వాటిలో ప్రప్రథమంగా ‘వరలక్ష్మీ వ్రతం’ శ్రావణమాసంలో వస్తుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ వ్రతాన్ని భారతదేశమంతా ఆచరించడం అందరికి తెలిసిన విషయమే. రుషులు, సన్యాసులు, పీఠాధిపతులు ఈ కాలంలో చాతుర్మాస్య దీక్షను చేపడుతారు.
ఖగోళ విశేషాలు: సూర్యుని గమనాన్ని లెక్కించడానికి రెండు పద్ధతులు పాటిస్తారు. దీనిలో దృక్ సిద్ధాంతం ప్రకారం కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం దక్షిణాయన ప్రారంభంగా లెక్కిస్తారు.నిరాయణ పద్ధతి ప్రకారం కూడా కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం దక్షిణాయనంగా భావిస్తారు. ఇది జూలై 16న జరుగుతుంది. మోడ్రన్ సైన్స్ ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం కాలం, శక్తి రెండు పరస్పర ఆధారభూతాలు. ఇది నిరూపితమైనది. అదేవిధంగా కాంతి అనేది కాలంతో పాటు ప్రయాణిస్తుందన్న విషయం కూడా సైన్స్ ప్రయోగాల్లో నిరూపితమైంది. ఈ సత్యాన్ని హిందువులు పూర్వకాలంలోనే కనుగొన్నారు. పలు శాస్త్రాల్లో సైతం కాలానికి అత్యంత విలువని ఇచ్చారు. సమయాన్ని కాలంతో విభజించారు. సూర్య సిద్ధాంతం ప్రకారం మృత, అమృతగా విభజించారు. ప్రాణతో ప్రారంభమైయ్యేదే సత్యమని, తృథితో ప్రారంభమైయ్యేది(అణువుతో) అసత్యమని భావించేవారు.
సూక్ష్మంగా కాల విభజన ఎలా చేసారంటే....
సూక్ష్మ కాలం పరమాణు ఇది సెకన్‌లో 60,750 భాగంగా లెక్కించారు.
-100 తృథి - 1 తత్పర (100 Truti =1 Tatpara)
-30 తత్పర = 1 నిమిష(కనుప్ప కొట్టిన కాలం)
30 Tatpara=1 Nimesha ( Blinking of eye )
-18 నిమిష = ఒక కస్థ 18 Nimesha = 1 Kastha (bit)
-30 కస్థ = 1 కాల(నిమిషం) 30 Kastha= 1 Kala(minute)
-తత్పర 30 కాల= 1 ఘటిక(అరగంట)
30 Kala =1 Ghatika ( Half hour)
-2 ఘటికలు = 1 క్షణ/మూహుర్త (గంట)
(2 Ghatika = 1 Kshana /Muhurta ( 1 hr)
-30 ముహుర్తలు = 1 ఆహోరాత్ర 30 Muhurtas= 1 Aho ratra (Aho ratra-Day and Night)
-30 అహోరావూతలు = 1 సూర్య మాసాలు(నెలలు)
30 Ahoratras= 1 Solar Month
-6 సూర్య మాసాలు = 1 ఆయన 6 Solar Months= 1 Ayana
-1 సంవత్సరం = రెండు అయనలు
1 Year = 2 Ayanas (Dakshinayana and Uttarayana)
దక్షిణాయనం ప్రాముఖ్యత
కర్కాటక రాశి నుంచి ధనస్సు రాశి వరకు సూర్యుని గమనాన్ని దక్షిణాయనంగా పరిగణిస్తారు.సం.. అనగా దగ్గరగా రావడం, క్రాంతి అనగా తీవ్రమైన లేదా వేగంగా మార్పు. అనగా ఈ సమయం నుంచి కాలంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయి. దానితో మానవుని జీవితం కూడా ప్రభావితమవుతుంది. దీనికి ఉదాహరణ కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం అనగా ఈ సమయం వర్షాకాలం. ఈ సమయంలో పంటలు, వ్యవసాయ పనులు ప్రారంభమై ఊపందుకొంటాయి. అదేవిధంగా మిగిలిన మూడు నెలలు చలికాలం వస్తుంది.
ఇక ఆధ్యాత్మికంగా ఇది చాలా విలువైన కాలం. శ్రావణ నుంచి కార్తీక మాసం వరకు చాతుర్మాస దీక్ష చేసే కాలం. ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా విశ్వసిస్తారు. విష్ణుమూర్తి యోగనివూదలోకి వెళ్లే సమయం ఇది. ఆషాఢ శుక్ల ఏకాదశిని హరి శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు యోగనివూదలో గడిపిన విష్ణువు తిరిగి ద్వాదశి లేదా ఉత్థన ద్వాదశి నాడు యోగనిద్ర నుంచి బయటకు వస్తాడని ప్రతీతి. ఇక ఈ సమయంలోనే ముఖ్య పండగలన్నీ వస్తాయి. నాగ చతుర్థీ, వరలక్ష్మీ వ్రతం, ఉపాకర్మ(క్షిశావణ పూర్ణిమ), శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, రుషిపంచమి, శ్రీ అనంత చతుర్దశి, శరన్నవరావూతి(దేవి నవరావూతులు), విజయదశమి, దీపావళి మొదలగు ముఖ్య పర్వదినాలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. మరో విధంగా దక్షిణాయనంలో పితృపక్షాలు వస్తాయి. ఉత్తరాయణం దేవతలకు ప్రీతికరం కాగా, దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించిందిగా భావిస్తారు. ఈ పితృపక్షాలలో తండ్రులు, తాతలు, తల్లి(చనిపోయిన పెద్దలకు) శ్రాద్ధకర్మలు నిర్వహించడం, వారి పేరుమీద పిండవూపదానం, దాన ధర్మాలు చేయడం ఆనవాయతీగా వస్తుంది. ఇలాంటి ప్రాముఖ్యతలు గల కాలం దక్షిణాయనం జూలై 16 నుంచి ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక వాదులకు ఇది చాలా విలువైనది.
ఈ సమయంలోనే అయ్యప్ప మాలా దీక్షాధారణ, కార్తీక మాస దీక్షలు అన్నీ వస్తాయి. వాతావరణంలో వేగంగా జరిగే మార్పులకు తట్టుకొని రోగాల బారిన పడకుండా ఉండేలా పూర్వీకులు రకరకాల దీక్షలు, వ్రతాలు, ఆచారాలను ప్రవేశపెట్టి ఇటు శారీరక రక్షణతోపాటు, మనిషిని దైవం వైపు నడిపించేలా కాలాన్ని విభజించడం నిజంగా ముదావహం. వీటిలోని కొన్ని మూఢాచారాలను వదిలి, శాస్త్రీయత గలవాటిని పాటిస్తూ జీవితానికి అర్థం, పరమార్థం కల్పించుకోవాలన్నదే పెద్దల లక్ష్యం. శుభం భూయాత్.
- కేశవపంతుల వెంక శర్మ (9440885463)
Other News