Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >> Features >> Bhakthi


వృద్ధాప్యం

Mormon-christus-at-salt-lak‘‘ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. నేనే చేసి యున్నాను, చంకన పెట్టుకొనువాడనునేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే’’
దేవుడైన యెహోవా ఇక్షిశాయేలు ప్రజలను గూర్చి- యాకోబు ఇంటివారులారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించినవారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నాచేత భరింపబడినవారలారా, తల్లిఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకనపెట్టుకొనినవారలారా, నామాట ఆలకించుడి - అని అనుచున్నాడు. ముదిమి వచ్చువరకు అనగా ముసలితనం వచ్చువరకు, వయసు వచ్చినప్పుడు వృద్ధాప్యంలో తల నెరయువరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే అని దేవుడైన యెహోవా చెప్పుచున్నాడు.

వృద్ధాప్యం అనగా
పరిపక్వత పొందడానికి శారీరకంగా, మానసికంగా, భావోవూదేకపరంగా క్రమంగా ఎదగడానికి వయసు ఎదగడం ‘‘టీలీయోస్’’ అనే గ్రీకు పదం కొత్త నిబంధనలో సంపూర్ణత అని అర్థమిచ్చే పదంగా అనువదించబడింది. దీనికి మానసిక, నైతిక ప్రవర్తనలో ఎదగడం అని అర్థం. మన ఎదుగదలకు కాలాలు సూచించబడుచున్నవి.

వసంత ఋతువు లేక కాలం
యువతలోవున్న కాలం 20 నుంచి 40 సంవత్సరాల వయసులో యున్న కాలం. ఈ యువత కాలంలో వ్యక్తిగత కాంక్షలు, నెరవేర్చుకోవాలని ప్రయత్నించే సంవత్సరాలు. మంచి ఆరోగ్యం, శక్తికలిగిఉండే ప్రాముఖ్య సంవత్సరాలు. కొన్ని సమయాలలో సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోలేని అశక్తత, ఫలితంగా జీవితంలో దేవుడు అనుక్షిగహించే అవకాశాలను కోల్పోవడం, ముండ్లపొదలలో పడిన విత్తనమును పోలినవారు. కాలం గడిచిన కొద్దీ ఈ జీవసంబంధమైన విచారముల చేతనూ, ధనభోగముల చేతనూ అణచివేయబడి పరిపక్వంగా ఫలింపనివారు.

వేసవికాలం
మధ్యవయస్కులు 40 నుంచి 65 సంవత్సరాలు గలవారు. ఈ వయసు ఇతరులకు సహాయం చేయడానికి సమయాన్ని, సామర్థ్యాలను వెచ్చించే సమయం. సృజనాత్మక, ఉత్పాదకత సాధించే సంవత్సరాలు. ఎదుగుదలలేని స్థితి అయితే దాస్యం, నడివయస్సు సందిగ్ధ స్థితి. ఫలితంగా ప్రవర్తనలో ఎదగలేకపోవడం.

ఆకురాలేకాలం
వృద్ధులు 65 నుంచి 80 సంవత్సరాల వయసుగలవారు. ఈ కాలంలో నాయకత్వాన్ని ఇతరులకు అప్పగించే సంవత్సరాలు. శారీరకంగా క్షీణత సంభవించే సంవత్సరాలు. ఎదుగుదల లోపిస్తే, తనను, ఇతరులను తిరస్కరించడం, ఫలితంగా దేవుని విషయంలో కఠినహృదయులు కావడం.

శీతాకాలం
వయోవృద్ధులు 80 సంవత్సరాల పైన వయసుగలవారు. ఈ కాలం వయస్సుగల వారు తమకు గౌరవమర్యాదలు దక్కాలని కోరుకునే సంవత్సరాలు. శారీరకంగా ఇతరుల సహాయం ఆశించే సంవత్సరాలు. ఎదుగుదల క్షీణత. జీవిత అర్థాన్ని, ఉద్దేశాన్ని పోగొట్టుకోవడం. ఫలితంగా నిరీక్షణ కోల్పోయి మరణాన్ని ఎదుర్కోవడం.

లక్షణాలు
జీవితంలో ఒక్కోకాలం నుంచి వేరే కాలానికి మారుతున్న కొద్దీ గుర్తించదగ్గ మార్పులు సంభవిస్తూ ఉంటాయి. దేవుని రూపకల్పనలో మొగ్గ తొడిగే పచ్చని వసంతం తెల్లబారిన శీతాకాలం వస్తుంది. అయినప్పటికీ శారీరకంగా వయసు పెరుగుతున్న క్రీస్తులో పాదుకొన్న జీవితం ఆధ్యాత్మికంగా వికసిస్తూ ఉంటుంది.

శారీరక క్షీణత
శారీరక సహజ తరుగుదల వృద్ధాప్యంలో అవయవాల సహకారం క్షీణించడం, దానివల్ల తరిగిపోయే ఆకారం, పళ్లు కదిలిపోయి ఊడిపోవడం. వినికిడి శక్తి తగ్గిపోవడం, నిద్రపట్టకపోవడం, రక్షించుకునే శక్తి క్షీణించిపోవడం, వెంట్రుకలు నెరసిపోయి తెల్లబడటం, శక్తులు ఉడిగిపోయి సంభోగశక్తి లోపించడం జరుగుతుంది.

జ్ఞానియైన ప్రసంగి ఈవిధంగా బోధించుచున్నాడు. ‘‘దుర్దినములు రాకముందే - ఇప్పుడు వీటియందు నాకు సంతోషంలేదని చెప్పు సంవత్సరాలు రాకముందే తేజస్సునకు సూర్య, చంద్ర, నక్షవూతములకును, చీకటి కమ్మకముందే, వాన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.’’ పసంగి 12:1-2) ఎందుకంటే ముసలితనంలో వారు వణుకుదురు. బలిష్టులైనను వారు వంగుదురు.

buddaఆధ్యాత్మిక వికాసం
- సంపూర్ణతకు రుజువు

నీతిమంతులు ఖర్జూర వృక్షమువలె మువ్వ వేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడినవారై, వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యదార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనము లేదనియు, ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు. - (కీర్తన 92 : 12-14) అని బైబిలు బోధించుచున్నది. ఆధ్యాత్మిక వికాసం అనగా వయసు పెరుగుదల కాలాల్లో దృక్పథం, మార్పును, సవాలును ఎదుర్కోగల ధైర్యం, దైవిక నీతికి, విలువలకు వ్యక్తిగతంగా సమర్పించుకోవడం, వ్యక్తిగతంగా చేసిన పొరపాట్లకు నవ్వుకునే సమర్థత కలిగి ఉండటం. ఇతరులకు సేవ చేయాలన్న కోరిక, లోతైన విశ్వాసంలో ఎదుగుతూ, భావికాలపు ఆశతో జీవించడం. అందంగా ఎదగడం.

ఆహ్లాదకరమైన వృద్ధాప్యం
కార్ల్ విల్సన్ బేకర్ ఈ విధంగా అనుచున్నాడు - నేను అందంగా ఎదుగుతూ వృద్ధుడనే తాను ఎన్నో మంచిపనులు చేస్తూ, లేసులు, దంతం, బంగారం, పట్టువస్త్రాలు కొత్తవి అవసరం లేదు. పెద్ద వృక్షాలలో స్వస్థత ఉంది. పాత వీధుల్లో ఒక అందం ఉంది. వీటిలాగే నేను కూడా ఎందుకు అందంగా ఎదుగుతూ వృద్ధుడిని కాకూడదు. ఆయన కృపలో ఎదుగుటకు మన వృద్ధాప్యంలో అన్ని దశలలోను తనతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. కృపలో ఎదగడం అంటే మనలో ఉన్న క్రీస్తు సన్నిధిని ఎరిగి ఎదగడం అని అర్థం. వయసులో పెరిగేకొద్దీ మనం ఎదుర్కొనే నష్టాలు దేవునితో లోతైన సంబంధానికి వంతెనలు అవుతాయి. జీవితమంతటిలో దేవుడు చూపిన ప్రేమను గ్రహించుచు దేవునితో నిజమైన ఏకాంత సమయం గడుపుచు, దేవుని మంచి తనమునకు, గొప్పదానికి మధ్యవర్తిగా యుండవపూను. సందిగ్ధానికి ఆక్షేపణలకు, వ్యతిరేకతలకు, నిరాదరణకు, విసుగు చెందడానికి ఇప్పుడు సమయం లేదు. ఆయన చిత్తానికి, ఆయన సమయ నిర్ణయానికి, నా భావికాలం దేవునికే చెందాలన్నదే అంతిమ గమ్యం అని ఆయన చిత్తానికి వదిలివేయవపూను. ఎందుకంటే రక్షించువాడు ఆయనే గనుక. ‘‘నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవినీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును’’ (సామెతలు 16:31)

- కె.యేసుదాసు, 9490469837

Other News
    Most Viewed galleries


    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine