Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, June 19, 2013
 


Home >> Features >> Bhakthi


నవగ్రహ పూజతో మనశ్శాంతి

islamiccosmos-the-art-archi నేను 1958 అక్టోబర్ 5న సాయంత్రం ఆరు గంటల 10 నిమిషాలకు వరంగల్ జిల్లాలో జన్మించాను. నాకు వైవాహిక జీవితం బాగా లేదు. చాలా కష్టాలన్నాయి. అవి ఎప్పుడు తొలగిపోతాయి? భవిష్యత్ ఎలా ఉంటుంది?

- ఎన్. కృష్ణకుమారి, వరంగల్


మీ నక్షత్రం ఆరుద్ర, రెండవపాదం, మిథున రాశి. మీ జాతకంలో వైవాహిక జీవితంలో చాలా సమస్యలున్నాయి. శష్ట, సప్తమ, అష్టమ భావాధిపతులు రాహుతో కలయిక మరియు శష్ట, సప్తమ అధిపతులు ఒకే డిగ్రీలో కలిసి ఉండటం ప్రధాన సమస్య. అందువల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ఒక్కోసారి విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని శాంతిపక్షికియలు పాటించండి. దానివల్ల కొంచెం సమస్య తీవ్రత తగ్గుతుంది. జూలై 2012 వరకు బుధునిలో చంద్రుడు, జూలై 2012 నుంచి జూలై 2013 వరకు గురునిలో బుధుడు, జూలై 2013 నుంచి జనవరి 2016 వరకు బుధునిలో రాహువు, జనవరి 2016 నుంచి ఏప్రిల్ 2018 వరకు బుధునిలో గురువు, ఏప్రిల్ 2018 నుంచి జనవరి 2021 బుధుడిలో శని భుక్తులున్నాయి. ఇక్కడ బుధునికి చంద్రుడు కంట్రోలింగ్ ఫ్యాక్టర్. మీ జాతకంలో బుధుడు వివాహస్థానాధిపతియై ఉండి, శష్టమ భావంలో సాఫ్ట్ ఇండికేటర్ అయి, శష్టమ భావాధిపతితో ఒకే డిగ్రీలో కలిసి ఉన్నాడు. దాని ఫలితమే ఇన్ని సమస్యలు. భృగుపాశుపత హోమం చేయించుకోండి. ఇంద్రాణి రూపు ధరించండి. రాహు, కేతులకు పూజ చేయించుకోండి. 2012 నుంచి 2013 మధ్య వైవాహిక జీవితంలో కష్టాలు ఎక్కువ కాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీకు, మీ భర్తకు గొడవలయి విడిపోయే అవకాశం ఉంది. మీరు కూడా కొంత కఠినంగా మాట్లాడటం తగ్గించుకోండి. నైతిక విలువలు పాటించండి. మీ అదృష్ట దైవం దత్తావూతేయ స్వామి. అతడిని ఆరాధించండి. మీకు మంచి జరుగుతుంది. మీరు 5కేరెట్ల కనకపుష్యరాగం పొదిగిన ఉంగరాన్ని కుడిచేతి చూపుడు వేలుకి ధరించండి. మీ జీవితంలో కొన్ని ప్రధానమైన సమస్యల నుంచి బయటపడతారు. ప్రతి సంక చతుర్థినాడు గణపతికి ఉపవాసం ఉండి అభిషేకం చేయించుకోండి. వినాయక చవితిరోజు వినాయక ఆరాధన మరవొద్దు. మీకు భద్రమహాపురుషయోగం ఉన్నా కూడా అది యోగించుట లేదు. కాబట్టి సూచించిన శాంతివూపక్షికియలను తప్పకుండా పాటించండి. ప్రతిరోజూ నవక్షిగహ స్తోత్రాలను పఠించండి. మీ కష్టాలు పూర్తిగా కాదుగానీ, ఒక మోస్తరుగా తొలగిపోతాయి. రానురాను మీకు మనశ్శాంతి కూడా దొరుకుతుంది.

నేను 1985 డిసెంబర్ 6వ తేదీన రాత్రి 8.30 నిమిషాలకు కామాడ్డిలో జన్మించాను. నాకు వివాహం ఎప్పుడు? లవ్ మ్యారేజా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? భవిష్యత్ ఎలా ఉంటుంది?

- శృతి, కామాడ్డి


మీది ఉత్తరానక్షత్రం, నాలుగవ పాదం, కన్యరాశి. మీకు గత జన్మలో భర్తగా వచ్చిన వ్యక్తే ఈ జన్మలో కూడా వస్తాడు. మీకు పూర్వజన్మ పుణ్యం తక్కువగా ఉంది. ప్రేమ వివాహానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మీరు మీ తండ్రిగారి అనుమతి ఉంటేనే వివాహం చేసుకోండి. ఎందుకంటే మీ జాతకంలో పూర్వజన్మ పుణ్య స్థానాధిపతి స్థితి బాగా లేదు. మే 2012 నుంచి నవంబర్ 2014వరకు రాహులో బుధుడు ఉంటాడు. ఈ సమయంలోనే మీకు వివాహం అవుతుంది. నవంబర్ 2014 నుంచి డిసెంబర్ 2015 వరకు రాహువులో కేతువు, డిసెంబర్ 2015 నుంచి డిసెంబర్ 2018 వరకు రాహువులో శుక్రుడు, డిసెంబర్ 2018 నుంచి నవంబర్ 2019 వరకు రాహువులో రవి, నవంబర్ 2019 నుంచి మే 2021 రాహువులో చంద్రుడు, మే 2021 నుంచి మే 2022 వరకు రాహువులో కుజుడు ఉన్నారు. ఇక్కడ రాహువుకి శుక్రుడు, శని కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్. మీరు 2007 నుంచి ఓ అబ్బాయిని ఇష్టపడుతున్నారు. అయితే మీ వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. నాలుగు కేరెట్ల గోమేధుకం పొదిగిన ఉంగరాన్ని కుడిచేతి మధ్య వేలుకి ధరించండి. జీవితంలో మీరు ప్రధానంగా చేయాల్సింది గురు చరిత్ర పారాయణం. అది మీయొక్క కర్మని, మీ తండ్రి యొక్క స్థితిని సమూలంగా మార్చేస్తుంది. పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం ఏలిననాటి శని నడుస్తున్నది కావున ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి 1.25 కేజీల నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. చిన్నపాటి సర్జరీస్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. గురు, శనివారాలు నియమం పాటించండి. తండ్రిగారితో విబేధాలకు పోకండి. మంచిదికాదు.

నేను 1991 ఆగస్టు 7న ఉదయం 9.30గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట్‌లో జన్మించాను. నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వోద్యోగం వస్తుందా? వివాహం ఎప్పుడవుతుంది? భవిష్యత్ ఎలా ఉంటుంది?

- కెయశావణి, మహబూబ్‌నగర్


మీ నక్షత్రం ఆరుద్ర, మొదటిపాదం, మిథునరాశి. ఆగస్టు 2012 నుంచి జూలై 2013 వరకు గురులో కేతువు, జూలై 2013 మార్చి 2016 వరకు గురులో శుక్రుడు, మార్చి 2016 నుంచి జనవరి 2017 వరకు గురులో రవి, జనవరి 2017 నుంచి మే 2018 వరకు గురులో చంద్రుడు, మే 2018 నుంచి ఏప్రిల్ 2019 వరకు గురులో కుజుడు, ఏప్రిల్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 వరకు గురులో రాహువు భుక్తులున్నాయి. ఇక్కడ గురువుకి బుధ, శని, సూర్యుడు కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్. మీకు ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా వస్తుంది. గట్టివూపయత్నాలు చేయండి. మీకు శక్తివంతమైన వ్యక్తి భర్తగా వస్తాడు. అతడు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశాలున్నాయి. మీ జాతకంలో బుధ, శుక్ర గ్రహస్థితి బాగా లేదు. గుడ్డు, చికెన్‌కు దూరంగా ఉండండి. మీరు తరచుగా ఉద్యోగాలు మారుస్తారు. మీకు 2016లో ప్రభుత్వోద్యోగం వచ్చే అవకాశాలున్నాయి. మీకు కుజదోషం ఉంది. అంగారక పాశుపత హోమం చేయించుకోండి. 2012 ఆగస్టు నుంచి మీకు వివాహ సమయం ప్రారంభం కాబోతోంది. భవిష్యత్ ఆశాజనకంగా ఉంది. మీరు మంగళ, బుధ, శుక్రవారాలు నియమం పాటించండి. మీయొక్క అదృష్ట దేవుళ్లు సూర్యభగవానుడు, మహాలక్ష్మీదేవి. వారిని ఆరాధించండి. జీవితంలో సుఖసంతోషాలతో వెలిగిపోండి. ఈ ఫలితాలు రావాలంటే మీరు ప్రతిమంగళవారం లక్ష్మీనర్సింహ స్వామి లేదా సుబ్రహ్మణ్యస్వామి యొక్క ఆలయ దర్శనం చేయడం తప్పనిసరి. మీరు ఎప్పుడూ కాళ్లను ఊపకూడదు. మానేయండి. మీకు ఆత్మగౌరవం ఎక్కువ. అది ఇతరులకు పొగరులాగ కనిపిస్తుంది. దానిని తగ్గించుకోండి. ఇతరులతో మాట పట్టింపులు ఎక్కువగా పెట్టుకోకండి. నోరు జారకండి. సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. మీకు హంసమహాపురుషయోగం, రాజయోగం ఉన్నాయి. కానీ ఇక్కడ రాజయోగం పనిచేయుట లేదు. పైన చెప్పిన శాంతివూపక్షికియలు పాటిస్తే మీకు బాగుంటుంది.

గమనిక :
జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తి పేరు, పుట్టిన తేది, పుట్టిన సమయం, పుట్టిన స్థలం (30 కిలోమీటర్లు దగ్గరలో ఉన్న పట్టణం, నగరం, జిల్లా వివరాలు) తప్పక పంపాలి.
మా చిరునామా : జిందగీ (ఆస్ట్రాలజీ), నమస్తే తెలంగాణ
8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్ నం. 10, బంజారాహిల్స్ - 34. [email protected]

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine