భవిష్యత్ నిర్దేశం
భవిష్యత్ ఏమిటి? ఎలా ఉంటుంది? రానున్న సంవత్సరం గడ్డుకాలమా? ఇలా అందరూ తమ రాశి ఫలాలు చూసుకుంటారు. అయితే మానవుని కర్మ, అది శ్రేష్ట కర్మ లేదా తప్పుడు కర్మ అయినా ఫలితం నిశ్చయం. ఈ విషయంలో పరమాత్మ కూడా ఏమీ చేయలేడు.
కొందరు భవిష్యత్‌ను అంచనా వేసేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. అందుకోసం ఎంతైనా వెచ్చిస్తారు. రానున్న కాలానికి సంబంధించిన అనేక అనుమానాలు, సందేహాలు మనసులో వస్తూ ఉంటాయి. అయితే ప్రతివ్యక్తి ఒక విషయాన్ని మరిచిపోతాడు. అతని భవిష్యత్ అతని చేతిలో ఉందన్న విషయం తెలుసుకోలేకపోతాడు. భవిష్యత్ మన కర్మలలోఉంది. మనం ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి ఫలితం, అలాంటి భవిష్యత్ ఉంటుంది. కర్మ చేయకుండా లేదా అలాంటి సాధనం లేదా విధి ఏదీ లేదు. మీ కోరికలు సత్వరం పూర్తికాగల విధివిధానం, మంత్రదండం లాంటిది ఏదీ లేదు. అన్నీ అంటే ఏమిటి? ఏ ఒక్క కోరికో కర్మ చేయకుండా పూర్తికాదు.
తీరదు. సహజంగా ప్రజలు కర్మ విరుద్ధంగా పనిచేస్తారు. మరలా జ్యోతిష్యుల వద్దకు వెళ్లి భవిష్యత్‌ను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారు. డబ్బులు ఖర్చు చేస్తారు. ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మీరు గత జన్మలో మంచి కర్మలు చేసి ఉండకపోవడం.
ఈ జన్మలో ఇతరులకు దుఃఖం కలిగించే కర్మలు చేసి ఉండటం వల్ల. మభ్యపెట్టి మోసగించడం వంటి పనులు చేయడం ద్వారా ఇతరులకు కష్టం కలిగించి ఉండవచ్చు. మీరు చేసిన కర్మలకు జ్యోతిష్యులు ఏం చేస్తారు? నేడు మానవులు అనేక రకాల విలువైన రత్నాలు, వజ్రాలు, పగడాల ద్వారా గ్రహదోషం తొలగిపోతుందని భావిస్తారు. కొద్దికాలంపాటు గ్రహదోషం కోసమేనని భావిద్దాం. అయితే మీ కర్మల భారం అక్కడితో అయిపోదు. కొద్దికాలం తరువాత మీ లెక్క చెప్పాల్సిందే. ఎందుకంటే మానవుని ప్రతికర్మ, అంటే శ్రేష్ఠమైన, తప్పుడు కర్మల ఫలితం అనుభవించడం ఖాయం. ఇందులో పరమాత్మ ఏమీ చేయలేడు. వారి మనుష్య ఆత్మలపై ఆధారపడటం అన్నది ఎంతవరకు సమంజసం? ఒకవేళ వారి తప్పుడు కర్మల లెక్క పత్రం జమ ముగిసిపోవడమంటూ జరిగితే నేడు ప్రపంచంలో ఉన్న ధనవంతులు సుఖశాంతులతో జీవిస్తూ ఉండేవారు.
అందుకే భవిష్యత్‌ను గణించే బదులు అనుమానాస్పదంగా శంకిస్తూ, చింతిస్తూ ఉండేదానికన్నా...మీరు ఎలాంటి కర్మలు చేస్తున్నారో పరిశీలించుకుని, మీ అంతరాత్మ కోరిక ప్రకారం మీ కర్మలను నిర్వహిస్తున్నారా? అనే విషయంపై దృష్టి సారించండి. ఈ విషయాన్ని వివేచనతో విశ్లేషించండి. స్వయంగా మీరే నిర్ణయించుకోండి. మీరు ఏం చేయడం ద్వారా మీ కోరిక పూర్తవగలదో తెలుసుకోండి. మీరు జీవితంలో విజయం, సుఖం, శాంతి కోరుకుంటున్నారు. మంచి కర్మలు చేయకుండా ఉంటే సత్ఫలితాలు వస్తాయా? మీకోసం ఆకాశం నుంచి సుఖం, శాంతి కురవదు. మీరు ఆలీబాబా కారు. మీరు మంత్రం పఠించగానే స్వర్గ ద్వారం తెరుచుకుంటుందా? మీరు సత్కర్మలు, మంచి పనులు చేయకుండా మీకు కీర్తి ప్రతిష్ఠలు రావు.
కర్మ లేకుండా ఏ కోరికా, సంకల్పం సంభవం కాదు. మీ భవిష్యత్ మీ చేతిలో ఉంది. ఎలాగైనా, ఏది చేసినా అలాంటి ఫలితమే మీకు లభిస్తుంది. మన చేతుల్లోనే మన భవిష్యత్‌ను చూడవచ్చు. వ్యర్థమైన విషయాలు తెలుసుకునేందుకు అటూ, ఇటూ తిరగాల్సిన అవసరం లేదు. కానీ అలా జరగడం లేదు. నేడు ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత సుఖ సాధనలు ఉన్నప్పటికీ, వారు అదే విధమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ ఎక్కువగా చర్చించకుండా మనం ఈ సమస్యల నుంచి బయటపడాలంటే వర్తమాన పరిస్థితులను మనం శ్రేష్ఠంగా తయారు చేసుకోవాలి. మనం మంచి కర్మలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మన భవిష్యత్‌ను ఉజ్వలంగా చేసుకోగలం. భవిష్యత్ పట్ల ఎలాంటి శంక, అనుమానాలు మన మనసులోకి తీసుకురావద్దు. మన లక్ష్యాలను సాధించేందుకు ఏం చేయాలో? మీరు ఏం కోరుకుంటున్నారో కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచించండి. ఏం చేయడం ద్వారా మీరు అనుకున్నది సాధించగలరో యోచించండి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుని నిబద్ధతతో పనిచేయండి. అప్పుడు అన్ని మీరు అనుకున్నట్టే జరుగుతాయి. మీరు కోరుకున్నవి మీకు లభిస్తాయి.
కోరికలు గుర్రాల వంటివి. గుర్రం కళ్లెం మనం సరిగ్గా అదుపు చేయగలుగుతూ, యుక్తితో మనం ఏ మార్గంలో వెళ్లాలో నిర్ణయించుకుని, ముందు చూపుతో అంచనా వేసుకుంటూ.. అందుకు తగినట్లుగా సామాక్షిగిని సిద్ధం చేసుకుని, సంపూర్ణమైన విశ్వాసంతో మన లక్ష్యం దిశగా గుర్రాన్ని నడిపించినప్పుడు విజయ తీరం చేరుకుంటాం. మీ భవిష్యత్ మీ చేతిలోనే ఉంటుంది. మీ భవిష్యత్‌కు మీరే నిర్మాతలు కూడా.
- బ్రహ్మకుమారీస్, 9010161616, 9010599266
Other News