ధన్యురాలు

‘‘సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని యందురు’’ (లూకా 1:49)
పైన చెప్పబడిన మాటలు మనం లూకా సువార్త మొదటి అధ్యాయం 49వ వచనములో మన ప్రభువైన ఏసుక్షికీస్తు తల్లియైన మరియ పలికిన మాటలు. కొత్త నిబంధన గ్రంథంలో నాలుగు సువార్తలో, అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 14వ వచనంలో మనం చూడగలం. కొత్త నిబంధన గ్రంథంలో మరియ పేరుగల ఇతర స్త్రీలు కూడా గలరు. మరియ అనే పదం హెబ్రి భాష నుంచి తీయబడినది. మరియ అనగా ‘‘మిరియం’’ అని పిలువబడును. ఆ పేరు గల వారి వివరములు ఈ విధంగా యున్నవి.
1. ‘‘మగ్దలేనే మరియ’’ ప్రభువైన యేసు ఈమెలోనున్న ఏడు దయ్యములను వెళ్లగొట్టినాడు. ఈమె ప్రభువైన యేసు క్రీస్తునందు మిక్కిలి నమ్మకం కలిగిన స్త్రీ, మరియు క్రీస్తును ఎప్పుడునూ వెంబడించే స్త్రీ. ప్రభువు మరణం జయించి లేచినప్పుడు మొదటిగా ‘‘మగ్దలేనే మరియ’’ కే కనబడినాడు. (మార్కు 16 :12). ఈమె మగ్దలేనే అనే ప్రాంతానికి చెందిన స్త్రీ. ఈ మగ్దలేనే అనే ఊరు గలీలయ సమువూదమునకు ఉత్తర దిక్కున కలదు.
2. మరియ - బేతనియా గ్రామమునకు చెందిన స్త్రీ. ఈమె సహోదరి మార్త సహోదరుడు లాజరు. (యోహాను 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 37 వరకు లూకా 10:38-42 వరకు చూడగలరు)
3. యాకోబు తల్లియైన మరియ. (మత్తయి 28 : 1-10, మార్కు 16 : 1-8, లూకా 24 :1-10) ఈ మూడు సువార్తల్లో యాకోబు తల్లియైన మరియ గురించి రాయబడియున్నది.
4. మార్కు అనుమారు పేరుగల యోహాను త్లలియైన మరియ (అపొ 12:12)
5. క్లోపా భార్యయైన మరియ. బహుశ ప్రభువైన యేసుకు దగ్గరి బంధువై ఉండవచ్చు. (యోహాను 19 :25)
6. ప్రభువైన యేసుక్షికీస్తు తల్లియైన ‘మరియ’ పరిశుద్ధులు రాసిన నాలుగు సువార్తలలో ఈ ఆరు పేర్లు గల మరియలను మనం చూడగలం. వీరిలో ప్రభువైన యేసుతల్లి ‘‘ధున్యారు’’ అని పిలువబడినది. ప్రవక్తయైన యెషయా ప్రవచించిన కన్యక ఈమెనే యోషయా గ్రంథం 7 14లో కన్యక గర్భవతియై కుమారుని కనును అని ప్రవచించినాడు. ఆ కన్యకనే దేవుడు ఏర్పరుచుకొనిన ధన్యురాలు మరియ. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక గలీలియలోని నజరేతు అనే ఊరుకు చెందినది. ప్రదానం చేయబడిన తర్వాత యోసేపును మరియయు వారేకము కాక మునుపు అనాగా ఆమె (మరియ) పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.
దయావూపాప్తురాలు :
ఈమె దేవుని దయపొందిన స్త్రీ. దేవుడు ఈమెను ఏర్పరుచుకొనిన దయవూపాప్తురాలు. అందుకని గబ్రియేలను దేవదూత ఆమెను చూసి ‘‘దయావూపాప్తురాలా నీకు శుభం. ప్రభువు నీకు తోడై యున్నాడని’’ చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరడపడి, ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా... దూత ‘‘మరియా! భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు.
ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును’’ అని చెప్పెను. అందుకు మరియ ‘‘నేను పురుషుని ఎరుగనిదాననే, ఇదేలాగు జరుగును’’ అని ధూతతో అనగా, ఆ ధూత - ‘‘పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును’’ అని చెప్పెను. ఈ మరియ సాధారణమైన స్త్రీ, యాజకుడైన జెకర్యాకు అతని భార్యయైన ఎలీసబేతుకు బంధువురాలు.
ఎలీసబేతు, జెకర్యా ఇద్దరు బహుకాలం గడిచిన వృద్ధులు. వారికి పిల్లలు లేరు. దేవుడు జెకర్యా ప్రార్థన విని, వృద్ధాప్యమందు వారికి ఒక కుమారుని అనుక్షిగహించినడు. మరియ దేవుని కృప పొందినది. అంతేకాకుండా ప్రభువు దీన దాసురాలినని చెప్పి ప్రభువును స్తుతించిన స్త్రీ. ఎలీసబేతుకు ఆరవ మాసం గర్భంతో యున్నప్పుడు మరియ ఆమెకు వందనములు చెప్పుటకు వారి ఇంటికి వెళ్లినప్పుడు, ఎలీసబేతు గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసెనని బైబిలు బోధించుచున్నది. ఎలీసబేతు పరిశుద్ధాత్మ నిండుకొనినదై మరియతో ‘‘స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినదానవు, నీ గర్భ ఫలం ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను.
ఇదిగో నీ శుభ వచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక ఆమె ధన్యురాలనెను. కనుక మరియ నిజంగానే ధన్యురాలని, తనకు పుట్టబోయే కుమారుడు రక్షకుడు - మెస్సియా అని గ్రహించగలిగి దేవునియందు ఆనందించినది. నిజంగా మరియ కృప పొందినది. దీనురాలు. దేవునియందు విశ్వాసం, భయభక్తులు గల స్త్రీ. మరియలోక రక్షకున్ని కనిన స్త్రీ. అంతేకాకుండా ఆయన సిలువ మ్రాను మీద చనిపోయినప్పుడు కూడా లోక రక్షకుడు సర్వలోక పాపమునకు ప్రాయశ్చిత్తంగా పాతిపెట్టినట్టు రక్షకున్ని ఆమె చూడగలిగినది. ఎప్పుడైతే ఆమె గర్భం ధరించి పరిశుద్ధాత్మ వలన యేసుకు జన్మనిచ్చినదో అప్పుడు మరియ ఈ విధంగా దేవుని స్తుతించినది.
‘‘నా ప్రాణ ప్రభువును ఘనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ, నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక, ఇది మొదలుకొని అన్ని తరములవారునూ నన్ను ధన్యురాలని యందురు’’
నిజంగానే ఆమె ధన్యురాలు. ధన్య జీవి. గనుక ప్రభువైన యేసు తల్లియైన మరియ జీవితం ద్వారా మనం, ముఖ్యంగా తల్లులు ఎంతగానో నేర్చుకొనవలసియున్నది. కుటుంబంలో తల్లి అతివూపాముఖ్యమైన పాత్ర వహించుచున్నది. ‘‘గుణవతియైన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది.’’ (సామె 31 :10) బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు (సామె 31 :25) ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. (సామె 31 : 28)
దేవుడు దీవించునుగాక !
- కె.యేసుదాసు, 9490469837
Other News