Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Tuesday, May 21, 2013
 


Home >> Features >> Bhakthi


కోపం

Jesus‘‘బుద్ధి హీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానం గలవాడు కోపం అణచి దానిని చూపకుండును’’ (సామెతలు 29 : 11)కోపం అంటే.. ఒక అవసరం గానీ, ఆశించినదిగానీ తీరకపోతే కలిగే బలమైన ఉద్రేకం లేక అయిష్టం. లేఖనాలతో కోపదారిని ముక్కోపి, కోపిష్టి అని పిలుస్తారు. ‘‘కోపిష్టుడు కలహం రేపును. ముక్కోపి అధికమైన దుష్క్రియలు చేయును’’ (సామెతలు 29:22). పాత నిబంధనలో కోపం అనే పదానికి తరచుగా వాడిన పదం ‘అప్’. దీనికి అక్షరాలా ముక్కు లేక ముక్కుపుటాలు అని అర్థం. ఆపైన ‘అప్’ అనే పదాన్ని ముఖ కవళికలన్నిటినీ సూచించడానికి హిబ్రూ పదజాలంలో వినియోగించారు. కొత్త నిబంధన గ్రంథంలో గ్రీకు పదం ‘ఓర్జ్’కు మొదట్లో సహజ సంవేదన లేక కోరిక అని అర్థం. తరువాత కాలంలో దీనికే బలమైన అనుభూతి లేక కోపం అనే అర్థం వచ్చింది. ఇది శక్తి కలిగి దీర్ఘకాలం ఉండే అనుభూతి గనుక ‘ఉక్షిగత’ అని తర్జుమా చేశారు.

కోపం పరిమితి
వేడిమి వలెనే కోపానికి కూడా తరగతులుంటాయి. తేలికపాటి మొదలుకొని అదుపులో ఉండే చిరాకు, పళ్లు పటపట కొరికే క్రోధం వరకు ఇది ఉంటుంది. ఇలాంటి అనేక అనుభూతులను వర్ణించేందుకు కోపం అనే పదం ఉపయోగిస్తారు. అయోగ్యంగా మనకు అనిపించినదేదో న్యాయంగా చెలామణి అయిపోతూ ఉంటే ఇది కలుగుతుంది. లూకా 13:14లో యేసు సబ్బాతు దినాన స్వస్థత జరిగించడం ద్వారా మోషే ధర్మశాస్త్రాన్ని మీరినట్టు గ్రహించిన సమాజ మందిరపు అధికారి దీనికి లోనయ్యాడు. ‘‘యేసు విశ్రాంతి దినమున స్వస్థత పరచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి, జన సమూహమును చూసి, పనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినంలోనే వచ్చి స్వస్థత పొందుడి. విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను’’ (లూకా 13 :14)

క్రోధం లేక మండే అనుభూతి, పగ తీర్చుకోవాలన్న భావం ఇందులో ఉంది. క్రోధమనేది ఒక అనుభూతి స్థాయి నుంచి బయటికి కనిపించే స్థాయికి మారుతుంది. రోమా 1:18-20లో మనిషి ఇష్టపూర్వక పాపానికి ప్రతిగా దేవునికోపం బయలుపడిన సంగతి ఉంది. ‘‘దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల సమస్థ భక్తిహీనత మీదను , దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుచున్నది. (రోమా 1 :18) ఆగ్రహం అంటే కోపం అదుపుతప్పి చెలరేగి ఇంగిత జ్ఞానాన్ని నశింపచేసే ఆవేశం, హాని కలిగించేలా, నాశనం చేసేలా, బలవంత పెట్టే శక్తి అని ఈ పదానికి అర్థం. అ.పొ.కా 5:33లో సన్ హెడ్రిన్ సభ్యులు కొందరు పేతురు, తదితర అపొస్తలులపై మండిపడ్డారు. నకీస్తు దైవత్వాన్ని ప్రకటించినందువల్ల) వారిని చంపజూశారు.ఉగ్రత అంటే అగ్నిజ్వాలల వలె ఎగిసిపడుతూ తనపై తనకు తాత్కాలికంగా అదుపుతప్పి ఉన్మాదిగా మార్చివేసే కోపం. ద్వితీ 19:4-6లో పత నిబంధన ధర్మశాస్త్రం విషయం తెలియకుండా పగ తీర్చుకొనేందుకు వస్తున్నవాడి ఉగ్రతనుంచి నిర్దోషిని తప్పించే చట్టాలున్నాయి. ‘‘క్రోధం క్రూరమైనది, కోపం వరదలై పొర్లునది’’ (సామెతలు 27 :4)

కోపం రావడం పాపమా?
కోపం రావడం పాపం కాదు. ఆరంభంలో కోపం రావడం దేవుడిచ్చిన అనుభూతి. ఆ భావనకు నీవు స్పందించే తీరును బట్టి అది పాపంగా మార్పు చెందుతుందో లేదో అన్నది ఆధారపడి ఉంటుంది. దేవుని వాక్యం ఇలా చెప్పుచున్నది. ‘కోపపడుడిగానీ పాపం చేయకుండి, సూర్యుడస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు’’ (ఎపెసి 4 :26)

కోపాన్ని దుర్వినియోగపరచడం
అడపాదడపా ప్రతి ఒక్కరూ కోపం వేడిమిని అనుభవిస్తూనే ఉంటారు. అయితే ఆ వేడిమిని నీవు ఏమి చేస్తున్నవా అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. అడవిలో వేసుకున్న చిన్న వెచ్చటి చలిమంట అడవినంతటినీ తగలబెట్టే అగ్నిజ్వాలగా మారగలదు. అలాగే మొదట్లో మేలుకై ఉపయోగపడివలసిన కోపం నిప్పురవ్వను ఆ ప్రయోజనం నెరవేరకముందే ఆర్పివేసే ప్రమాదం కూడా ఉంది. నీ కోపాన్ని నీవేవిధంగా దుర్వినియోగపరుస్తున్నావో చూడు.

దీర్ఘకాలిక కోపం
దీర్ఘకాల కోపం అంటే చాలా కాలం మనసులో ఉంచుకునే కోపం. గతంలో జరిగిన ద్రోహానికి క్షమించలేని హృదయం దీనిని సూచిస్తుంది. క్షమించలేని హృదయం చివరకు నిరసన భావానికి, లోతైన చేదు ఆలోచనలకూ దారితీస్తుంది. ఇది సంబంధాలన్నింటినీ పాడుచేస్తుంది.

అణచిపెట్టే కోపం
కోపాన్ని తననుంచి, ఇతరులపట్ల ప్రదర్శించకుండా మనసులోనే ఉంచుకోవడం. తన నెగిటివ్ భావాలను ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడు ఇలా జరుగుతుంది. ఇలాంటి కోపం ఎప్పటికైనా ప్రమాదకరమే. ‘‘పగవాడు పెదవులతో మాయలు చేసి, అంతరంగంలో కపటం దాచుకొనును’’ (సామెతలు 26 :24)

కవ్వించిన కోపం
ముక్కుమీద కోపం. ఈ కోపం ఊరికే వస్తుంది. ఉత్తి పుణ్యానికి కోపం తెచ్చుకునే వ్యక్తి పరిశుద్ధాత్మునిపై ఆధారపడటం నేర్చుకోవాలి. చటుక్కున చిరాకుపడే గుణాన్ని సంస్కరించేలా ఆయనకు అవకాశమియ్యాలి. ప్రథమ కోపం ఉండే లక్షణం ఎదుటివ్యక్తిని ఎగతాలి చేసేవంకతో విమర్శించడానికి, వ్యంగంగా మాట్లాడటానికి దారి తీస్తుంది. ‘‘ఆవూతపడి కోపపవడవద్దు, బుద్ధిహీనుల అంతరింవూదియములందు కోపం సుఖ నివాసం చేయును’’ పసంగి 7 :9)

పట్టరాని కోపం
బద్దలయ్యే కోపం శక్తివంతమైంది. అదుపుచేయ వీలుకానిది. ఈ కోపాన్ని వ్యక్తపరచడంలో హింస, దూషణ, ఇతరులను కించపరచడం ఉంటాయి. ‘‘కోపిష్టుడు కలహం రేపును. ముక్కోపి అధికమైన దుష్క్రియలు చేయును’’ (సామెతలు 29 :22)
కారణాలు
కోపానికి నాలుగు కారణాలు. కోపమనేది గతంలో మనం అనుభవించి అపరిష్కృతంగా మిగిలిపోయిన బాధమూలంగా కలిగే ప్రతిస్పందన అని మనలో చాలా మందిమి గ్రహించం. కొన్ని సార్లు నిప్పురవ్వ పుట్టి ఆ ప్రదేశంలోనే ఇంకి ఉన్న పెట్రోలు, లేక బయటకు వస్తున్న వంట గ్యాస్ మూలంగా మంటలు లేచినట్టు... అగ్నిపర్వతాలు లావాను వెళ్లగక్కినట్టు, కోపం కూడా నాలుగు కారణాలమూలంగా రాజుకుంటుంది. వ్యక్తిగత హక్కులు, అభిలాషలు వదిలి క్రీస్తు వంటి పరిణితిలోనికి ఎదగడం కష్టంగా ఉంటుంది.
1. గాయం
హృదయానికి గాయం తగిలింది. షరతులు లేని ప్రేమను చూరగొనాలని ఒక్కరిలోనూ అభిలాషను దేవుడు పెట్టాడు. ఈ రకమైన తిరస్కారం, బాధ ఎదురైనప్పుడు కోపమనేది మనుషులకు, బాధను దూరంగా ఉంచే రక్షణ కవచంలా పనిచేస్తుంది.

బైబిలు ఉదాహరణ

యాకోబుకున్న కొడుకుల్లోకి యోసేపు నిస్సందేహంగా ప్రియకుమారుడు. తమ తండ్రి తిరస్కారం, బాధ అనుభవించిన కొడుకులు తమ తమ్ముడి విషయంలో కోపం, పగ పెంచుకున్నారు. ‘‘యోసేపు ఇశ్రాయేలు (యాకోబు)వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి, అతనికొరకు విచివూతమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. (ఆది 37 :3-4)
2. అన్యాయం
ఇది మంచిది అనిపించిన విషయం భంగమైంది. నీపట్ల, నీవెవరిపట్లనైనా ఏదో ఒక అన్యాయం జరిగినట్టు నీకు అనిపిస్తే నీకు, మనకు కోపం వస్తుంది. ఇలాంటి దాన్ని మనసులో ఉంచుకుంటే, పరిష్కారం లేని ఆ కోపం నీ హృదయంలో గూడు కట్టుకోవడం మొదలుపెడుతుంది.
బైబిలు ఉదాహరణ
సౌలురాజు దావీదు పట్ల కనబరుస్తున్న అన్యాయ ప్రవర్తన, యోనా సాతానులో కోపం రేకెత్తించింది. (1సమూ 20 :32-34)
3. భయం
భవిష్యత్‌కు ముప్పు వాటిల్లుతున్నది. ప్రతి ఒక్కరిలోనూ భద్రత కొరకైన అవసరతను దేవుడు ఉంచాడు. ముప్పు వాటిల్లుతున్నట్లు భావిస్తే పరిస్థితులలో కలిగిన మార్పు విషయంలో కోపం తెచ్చుకుంటే హృదయం భయంతో నిండుతుంది.
బైబిలు ఉదాహరణ
యుద్ధరంగంలో దావీదు సాధించిన అనేక విజయాలను బట్టి సౌలు చాలా కోపగించుకున్నాడు. దావీదు అందరిలోనూ మంచి పేరు తెచ్చుకోవడం వల్ల తన పదవికి ఎలాంటి ముప్పు కలుగుతుందోనని భయపడ్డాడు. (15 సమూ 18 :5-15, 28-29)
4. చిరాకు
నీవు చేసి చూపించినది ఆమోదయోగ్యం కాలేదు. ప్రతి ఒక్కరిలోనూ ప్రాధాన్యత కొరకైన అంతరంగ అవసరత దేవుడు పెట్టాడు. మన ప్రయత్నాలన్నీ అంచనా మేరకు రాకపోతే, మన ప్రాధాన్యత దెబ్బతిన్నట్టు భావిస్తాం. మన గురించి, ఇతరులు ఊహించినది జరగకపోతే అది కోపానికి దారితీసే కారణం అవుతుంది.
బైబిలు ఉదాహరణ
కయీను హేబులు అర్పణలు. కయీను అర్పన దేవునికి ఆమోదయోగ్యం లేదు కనుక అతని స్వప్రయత్నాన్ని తిరస్కరించినప్పుడు కయీను చిరాకుపడ్డాడు. (ఆది : 4:3-8)
ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవపూను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చును. (యాకోబు 1:19-20)

‘‘కోపపడుడి కానీ, పాపం చేయకుడి, సూర్యుడస్తమించువరకు కోపం నిలిచియుండకూడదు’’ అని బైబిలు వాక్యం బోధించుచున్నది. గనుక కీర్తనకారుడు బోధిస్తున్నట్లు మనం కూడా ప్రార్థించవపూను. ‘‘దేవా! నన్ను పరిశోధించి, నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ కాయాసకరమైన మార్గం నాయందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్న నడిపింపుము. (కీర్తన 139 :23-24)

- కె.యేసుదాసు, 9490469837

Other News
    Most Viewed galleries


    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine