Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Monday, May 20, 2013
 


Home >> Features >> Bhakthi


మరణానంతరం

startవిశ్వాసి స్థితి
ప్రపంచంలో సృష్టికర్త పెట్టిన విశ్వాస పరీక్ష ముగిసిన తర్వాత మనిషి తిరిగి సృష్టికర్త దగ్గరకు వెళ్లడమే మరణం. అంటే.. ఆత్మ దేహం నుంచి విడిపోవడమే. మరణానంతరం మనిషి సమాధి చేయబడతాడు. సమాధులలో పరీక్షించబడతాడు. మరణించిన వ్యక్తిని సమాధి చేసిన వ్యక్తులు 40అడుగులు దాటిన తర్వాత సమాధి దైవ దూతలు నల్లని శరీరంతో, నీలి కళ్లతో ఉండే (మున్‌కీర్, నకీర్) అనే ఇద్దరు దైవ దూతలు వచ్చి అతడిని లేపి కూర్చొబెడ్తారు. అతని సమాధి అతని కనుచూపు మేరకు చేయబడుతుంది. ఆ సమయంలో అతనికి సూర్యుడు అస్తమయం చేస్తున్నట్లు గోచరిస్తుంది. అప్పుడతను కళ్లు నులుముకుంటూ లేచి కూర్చొంటాడు. దైవ దూతలతో (తనను వారు ప్రశ్నించడానికి వచ్చారని భావించి) ముందు నన్ను (అసర్) నమాజ్ చేయనివ్వండి అంటాడు. అతని నమాజ్ ముగిసిన తర్వాత దైవదూతలు అతనిని మూడు ప్రశ్నలు అడుగుతారు. 1. ‘నీ ప్రభువు ఎవరు?’ దానికి ఆ వ్యక్తి ‘నా ప్రభువు అల్లాహ్’ అని సమాధానమిస్తాడు. 2. ‘నీ ధర్మం ఏమిటి?’ అని అడుగుతారు. దానికి నా ధర్మం ఇస్లాం అంటాడు. 3. ‘నీకు రుజు మార్గం చూపడానికి పంపబడిన వ్యక్తి గురించి నీ అభివూపాయం ఏమిటి?’అప్పుడతను ‘పవిత్ర పుణ్యాత్ముడు దైవం చివరి ప్రవక్త, మహ్మద్ ముస్తఫా సలాల్లాహు అలైవ సల్లం’అని చెబుతాడు. అదేవిధంగా ఆయనచే ప్రవచించబడి, ఆచరించబడిన దివ్య ‘ఖురాన్’చదివి దాన్ని నమ్మి అది దైవ గ్రంథమని ధృవపరచానంటారు. అప్పుడు ఆకాశం నుంచి ‘ నా దాసుడు నిజం చెపాపడు.

అతనికి స్వర్గం వస్త్రాలు ధరింపచేసి, స్వర్గపు పరుపు పరచండి. స్వర్గం వైపు కిటికీని తెరచిపెట్టండి.’అని దైవ వాణి వినిపిస్తుంది. అయితే దైవదూతలు మొదట సమాధిలో నరకం వైపు ఉండే కిటికీ తెరుస్తారు. అటువైపు నుంచి నరకంలోని అగ్నిజ్వాలలు ఒకదాన్ని ఒకటి మింగేస్తూ ఎంతో భయంకరంగా కనిపిస్తాయి. (విశ్వాసి అది చూసి లోలోన భయపడతాడు) వెంటనే దైవదూతలు అతనితో ‘అల్లాహ్ నిన్ను ఎలాంటి ఆపద నుంచి రక్షించాడో చూడు’అంటారు. ఆ తర్వాత నరకం వైపు కిటికీని మూసి స్వర్గం వైపు కిటికీని తెరుస్తారు. దాంతో విశ్వాసి సమాధిలోకి సువాసనలతో కూడిన స్వర్గపు గాలులు వీస్తాయి. అప్పుడు దైవదూతలు అతనితో ‘ఇదే నీ శాశ్వత నివాసం అంటూ నీవు ప్రపంచంలో ఇస్లాం పట్ల, మహావూపవక్త(స.అ.స) సున్నతుల పట్ల విశ్వాస స్థితిలో జీవించావు. అదే స్థితిలో నీకు మృత్యువు వచ్చింది. దైవం కనుకరిస్తే విశ్వాస స్థితిలోనే ప్రళయదినాన(సమాధి) నుంచి లేస్తావు’ అంటారు. ఆ తర్వాత ఘాటైన సుగంధ పరిమళంతో ఖరీదైన దుస్తులు ధరించిన సౌందర్యవంతమైన ఒక వ్యక్తి ప్రత్యక్షమై ‘నీకు పరామానందం కలిగించే శుభవార్త విను’అంటాడు. విశ్వాసి ‘ఎవరు నీవు?’అని ప్రశ్నిస్తాడు. నేను నీ సత్కర్మల రాసిని అంటాడు. సమాధిలోని ప్రశ్నల అనంతరం దైవదూతలు అతని ఆత్మను దేహం నంపచి వేరుచేసి సజ్జనుల ఆత్మ సప్తమాకాశంలోని ‘ఇల్లీస్’అనే చోటికి తరలిస్తారు.

అవిశ్వాసి స్థితి
సమాధి తీవ్రత గురించి మహావూపవక్త మహ్మద్ (స.అ.స) ఇలా ప్రవచించారు. నేను సమాధికంటే భయాందోళనకరమైన ప్రదేశమేదీ చూడలేదు. (తిర్మిజీ). ఒకసారి దైవవూపవక్త మహ్మద్ (స.అ.స) స్మశానంలోని సమాధి వ్యధాభరితమైన శిక్షను గుర్తు తెచ్చుయకుని ఎంత విలపించారంటే ఆయన కన్నీటితో సమాధి తడిచిపోయింది. ఆయన ఇలా అన్నారు... - మిత్రులారా దీనికోసం ఏమైనా సన్నాహాలు చేసుకోండి (తిర్మిజీ). ఇస్లాంలో సమాధి స్థితిలోని అతి ముఖ్యమైన ఘట్టం దైవదూతలు (మునకీర్, నకీర్) ప్రశ్నలు. విశ్వాసి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలడు. కానీ అవిశ్వాసి చెప్పలేడు. దైవధూతలు విశ్వాసిని అడిగిన మూడు ప్రశ్నలు అవిశ్వాసిని కూడా అడుగుతారు. 1. నీ ప్రభువు ఎవరు? 2. నీ ధర్మమేదీ? 3. నీ ప్రవక్త ఎవరు? దానికి అతను నాకేమీ తెలియదు అనిమావూతమే సమాధానమిస్తాడు. అప్పుడు ఆకాశం నుంచి ‘‘అతను అబద్ధం చెబుతున్నాడు. అతనికి ప్రాపంచిక జీవితంలో ఈ ప్రశ్నలకు సమాధానం మేం వివరించి, ఆచరింపజేశాం. కానీ అతను తిరస్కరించినాడు, అనుకరించలేదు. కావున అతనికి అగ్ని వస్త్రాలు కట్టబెట్టి, అగ్ని పడకమీద పడుకోబెట్టండి. అతని సమాధిలోని నరకంవైపు కిటికీ తెరిచిపెట్టండి’’ అని వినిపిస్తుంది.

దాని ప్రకారం ఆ అవిశ్వాసి ప్రళయం వరకు దుర్భరబాధలు కలిగేలా ఏర్పాటు అవుతుంది. దైవధూతలు అతనికి స్వర్గంవైపు కిటికీ తెరిచి స్వర్గంలోని సౌందర్యం, భోగభాగ్యాల దృశ్యం అతనికి కనువిందుచేస్తుంది. దైవధూతలు అతనితో ‘‘సత్యాన్ని తిరస్కరించినందుకు అల్లాహ్ నిన్ను స్వర్గ సుఖాలకు దూరం చేశాడంటారు. ప్రపంచంలో జీవితాంతం సత్యం, ధర్మం పట అపనమ్మకంతో జీవించావు. అటువంటి స్థితిలోనే నీకు మరణం సంభవించింది. దైవ చిత్తమైతే నువ్వు అపనమ్మకంతోనే పళయదినాన) సమాధినుంచి లేపబడతావు’’ అని అంటారు. ఆ తర్వాత అతని పక్కటెముకలలో ఒకదానితో ఒకటి కలిసిపోయటట్లుగా సమాధి చేయబడుతుంది. ఆ తర్వాత అత్యంత దుర్వాసనతో కూడిన మురికిబట్టలు ధరించిన ఒక వికృత ఆకారం అతని దగ్గరికి వస్తాడు. అతడిని చూసి అవిశ్వాసి ‘‘ఎవరు నీవు? నీ ముఖంలో కీడు చిహ్నాలు కనిపిస్తున్నాయి?’’ అంటాడు. దానికి కురూపి ‘‘నేను నీ దుష్కర్మల దాసిని అని చెబుతాడు. దాంతో అతను (తీవూవంగా భయపడుతూ) అయితే ప్రభువు ప్రళయం అంటాడు. (అహ్మద్, అయిదావూద్, మిస్కాల్ హదీసుల ఆధారంగా). సమాధిలో అవిశ్వాసి ప్రశ్నించిన తద్వారా దైవధూతలు అతని ఆత్మను అతని దేహం నుంచి వేరుచేసి డవ పాతాళంలోకి తోసి ‘‘సిజ్జిన్’’ అనే చోటికి తరలిస్తారు. (ఈ స్థితి ప్రపంచంలో ఎవరికీ రాకూడదని అల్లాహ్‌లో వేడుకుందాం) సమాధి శిక్షల నుంచి మనమందరం రక్షింపబడాలని, దైవ తిరస్కారాలుగా కాకుండా, సమాధి ప్రశ్నలను మనమందరం సులభంగా అధిగమించాలని కాంక్షిస్తూ... ఆమీన్.. సుమ్మా అమీన్...

- ఎం.డి.బాబర్‌ఖాన్, వలిగొండ,
నల్లగొండజిల్లా, 9849897589

Other News
    Most Viewed galleries


    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine