దీవెనలు
‘ధర్మశావూస్తం మోషే ద్వారా మనకు అనుక్షిగహించబడినది’ (యోహను 1:17). పరిశుద్ధ గ్రంథము అనగా.. బైబిలు పాతనిబంధన గ్రంథములోని మొదటి ఐదు గ్రంథములు. ఆదికాండము, నిర్గమా కాండము, లేవీయా కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము మోషే ద్వారా మనకు అనుక్షిగహింపబడినది. దేవుడైన యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇదివరకు పుట్టలేదు అని బైబిల్ గ్రంథము బోధించుచున్నది.
ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయములో దేవుని దీవెన వచనములు, శాప వచనములు రాసి ఉన్నవి. దేవుని సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో ‘నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు... నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకొనిన యెడల మీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే మిమ్ములను హెచ్చించును. మీరు మీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల అనగా.. ఆయనిచ్చిన ఆజ్ఞలను, కట్టడాలను గైకొని నడచిన యెడల ఈ దీవెనలన్నియు మీ మీదకు వచ్చి మీకు ప్రాప్తించును (ద్వితీ 28:1-3)’ అని ఇశ్రాయేలు ప్రజలనుద్దేశించి చెప్పిన మాటలు. ఎప్పుడైతే మనము కూడా దేవుని మాట వినిన, ఆయనిచ్చిన ఆజ్ఞల కట్టడాలను అనుసరించి హృదయపూర్వకముగా పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతో అనుసరించి నడుచుకొనిన.. ఈ దీవెన వచనములు మనకు కూడ ప్రాప్తించగలవు.
-మనం ఉండే ప్రాంతంలో, మనం ఉండే స్థలంలో, గ్రామంలో, పట్టణంలో మనం దీవింపబడుదుము.
-మనం పొలంలో ఉన్నప్పుడు మనలని, మన పొలమును దీవించును.
-మన సంతానము దీవింపబడుతుంది.
-మన భూమిలో పండిన పంటలు దీవింపబడతాయి.
-మనకున్న పశువుల మందను, దుక్కిటెద్దులను, గొర్రె మందలను, మేక మందలు దీవింపబడును.
-మనము వెళ్లే ప్రతి స్థలమును, వచ్చి పోయే మార్గమును, మన ప్రయాణమంతటిలో మనకు కంచెలాగా ఉండి మనలను కాపాడుచూ దీవించును.
-మన శత్రువులు మన మీదికి దాడి చేయుటకు వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండును. మన శత్రువులు ఒక దారిలో బయలుదేరి వచ్చి దారి తెలియక ఏడు దారుల్లో నుంచి, మన ఎదుట నుంచి పారిపోవుదురు.
-మన కొట్లలోను, మనం చేయు ప్రయత్నములన్నింటిలోను మనకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును.
-మనకిచ్చుచున్న దేశములో అనగా.. మనం నివసించుచున్న దేశమును, మాతృభూమిని ఆయన దీవించును.
-ఆయన మనలను ప్రతిష్ట జనముగా స్థాపించును. ఆయన యందు విశ్వాసముంచి, ఆయనను నమ్ముకొని, ఆయనే సజీవుడైన దేవుడని నమ్మి ఆరాధించినట్లైన, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ఏర్పారచుకొని ప్రజలమని గ్రహించి పిలువబడుదుము.
-మనదేశము మీద వర్షము. దానికాలమందు గురిపించి దీవించును. మనము చేయు కార్యమంతయు దీవించును.
-ఆకాశమును, తన మంచి ధన నిధిని మనకు తేటపరిచి దీవించును.
-ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా మనలను బలపరిచి సమృద్ధితో మనలను దీవించును.
-సంఘంలో, సమాజంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా మనలను తలగా నియమించి దీవించును.
-ఎల్లప్పుడు మనం ప్రతి విషయములోను ఆధిక్యంతో ఉండునట్లు ఆయన మనలను దీవించును.
యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము, మొదటి కొన్ని వచనములు ఈ విధముగా రాసి ఉన్నది. జీవ వాక్యమును గూర్చినది ఆది నుంచి ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును చూచి, ఆ జీవమను గూర్చి సాక్షమిచ్చుచు, దానిని మీకు తెలియపరచుచున్నాము. గనుక మనము దేవుడిచ్చిన ఆజ్ఞలను, కట్టడాలను అనుసరించి నడుచుకొనుచు దేవునికి సాక్షిగా యుండుటకు దేవుడు మనలను దీవించి పైన పేర్కొనిన దీవెన వచనములు మనకు ప్రాప్తింపచేసి మనలను దీవించును గాక!
- కె.యేసుదాసు, 9490496837
Other News