స్థూలకాయం.. నో సర్జరీ!!
ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ తాపవూతయపడతారు. అందం కోసమే కాదు.. ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది చాలా అవసరం. అయితే ఒత్తిడి, పోటీతత్వం, ఆహారపు అలవాట్లు శరీరాకృతిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వీటికి తోడు శారీరక వ్యాయామం లేకపోవడం, సమయపాలన లేని భోజనం వల్ల బరువు బాగా పెరిగి శరీరాకృతి దెబ్బతింటోంది. తీరిక దొరకని ఆధునిక జీవితంలో, ఎక్కువసేపు కదలకుండా కూర్చుని చేసే ఉద్యోగాలు పొట్ట పెరిగేలా చేస్తున్నాయి. అధిక కొవ్వు పేరుకుపోయి స్థూలకాయానికి గురవుతున్నారు. ఇది అనేక రకాల అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నది. ఇలా పెరిగిన కొవ్వును తగ్గించుకోవడానికి నాజూకైన శరీరాకృతి కోసం కాస్మెటిక్ సర్జరీల వెంట పరుగులు తీస్తున్నారు. కానీ వీటివల్ల శాశ్వత పరిష్కారం లభించకపోగా శరీరంపై మచ్చలు, గాట్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అత్యాధునిక పరిజ్ఞానమైన నాన్‌సర్జికల్ లైపోకెవి అందుబాటులోకి వచ్చింది. పొట్ట లేదా నడుము, మెడ, ముఖం, చెంపలు, భుజాల కింద పేరుకుపోయిన కొవ్వు తీసివేయడం ఈ విధానం ద్వారా చాలా సులువు.
బిఎంఐ..
మనిషి ఎత్తును బట్టి ఏ మేరకు బరువు ఉండవచ్చనేది బాడీమాస్ ఇండెక్స్ నిర్ధారిస్తుంది. ఇది 18 నుంచి 25 వరకు ఉంటే సాధారణ బరువుగా పరిగణిస్తారు. 25 నుంచి 29.9 ఉంటే అధిక బరువు, 30 నుంచి 40 దాటితే స్థూలకాయం లేదా ఒబెసిటీగా భావించవచ్చు. బిఎంఐ 30 నుంచి 30 మధ్యలో ఉన్నవారు ఒబెసిటీని తగ్గించుకునేందుకు నాన్‌సర్జికల్ చికిత్స చేయించుకోవచ్చు. ఏ శరీర భాగంలో అయినా చర్మం కింద అదనంగా పేరుకుపోయిన కొవ్వును తొలగించేందుకు ఈ నాన్‌సర్జికల్ లైపోసక్షన్ ఉపయోగపడుతుంది. దీనిలో భాగంగా కొవ్వును కరిగించాల్సిన భాగంలోకి అల్ట్రాసౌండ్ తరంగాలను పంపిస్తారు.
ముందుగా అల్ట్రాసోనిక్ జెల్‌ను రాసి తక్కువ ఫ్రీక్వెన్సీలో అల్ట్రాసోనిక్ తరంగాలను కొవ్వు కణాల పైకి పంపిస్తారు. ఈ విధానంలో రక్తనాళాలపైగానీ, నరాలపై గానీ ఎటువంటి ప్రభావమూ ఉండదు. పూర్తిగా సురక్షితమైన ట్రీట్‌మెంట్ ఇది. వారంలో రెండు రోజులు ఈ ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చికిత్స ద్వారా 10 నుంచి 15, 15 నుంచి 20 కిలోల బరువు తగ్గవచ్చు. శరీరంలో నీటిశాతం ఎక్కువగా ఉంటే సులువుగా బరువు తగ్గుతారు. తక్కువ సిట్టింగ్స్‌లో ట్రీట్‌మెంట్ పూర్తవుతుంది. నొప్పి ఉండదు. కుట్లు, గాట్లు ఏర్పడవు. ఎక్కువకాలం తిరిగి కొవ్వు ఏర్పడకుండా నివారించవచ్చు.
వదులైన చర్మానికి...
కొవ్వు పోయిన తరువాత చర్మం వదులుగా తయారవుతుంది. కాబట్టి దీన్ని బిగుతుగా చేయడానికి ఆర్‌ఎఫ్ అనే పరికరంతో చికిత్స చేస్తారు. దీనివల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ప్రసవం తరువాత చాలామంది మహిళల్లో పొట్ట పెరుగుతుంది. బిడ్డ పెరిగేటప్పుడు సాగిన పొట్ట మళ్లీ యథాస్థితికి చేరకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. 30 ఏళ్లు దాటినవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆర్‌ఎఫ్ పరికరం ద్వార సాగిన పొట్టను బిగుతుగా చేయడం సాధ్యమవుతుంది. పొట్టపై ఉన్న స్ట్రెచ్ మార్క్స్‌ను ‘సీఓటూ’ పరికరం ద్వారా తొలగించవచ్చు. పుట్టుమచ్చలు, పులిపిర్లను తొలగించవచ్చు. ఓపెన్ పోర్స్, పీల్స్, పిగ్మెం ట్యాన్ కలర్ ఇంప్రూవ్‌మెంట్ లాంటి చికిత్సలు చేయవచ్చు.
డాక్టర్ రేష్మ
లితి స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్
హైదరాబాద్, 9640214021
Other News