Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Monday, May 20, 2013
 


Home >> Features >> Jeevana Rekha


డయాబెటిస్‌కు హోమియో

Dr.Rajeshekar
డయాబెటిస్ దీర్ఘకాలంగా కొనసాగినపుడు నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిక్ న్యూరోపతిగా వ్యవహరించే ఈ సమస్య కారణంగా అన్ని అవయవాలపై దీని ప్రభావం ఉంటుంది. గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, మూత్రనాళాలతో పాటు లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీసే డయాబెటిక్ న్యూరోపతి సమస్యలకు హోమియో చికిత్స మంచి ఫలితాన్ని ఇస్తుంది.

టైప్ 1 డయాబెటిస్
ఇది చిన్నతనంలోనే ఏర్పడుతుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఉండదు. రోగి పూర్తిగా ఇన్సులిన్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. మూత్రం అధికంగా రావడం, దాహం, ఆకలి ఎక్కువగా ఉండడం, బరువు కోల్పోవడం, దృష్టిలోపం, నీరసంగా ఉండడం ఈ వ్యాధి లక్షణాలు.

టైప్ 2 డయాబెటిస్
ఇది వయసు పెరుగుతున్న కొద్దీ ఏర్పడే పరిస్థితి. ఇన్సులిన్ మీద పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌ను శరీరం సక్రమంగా ఉపయోగించుకోలేకపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.

డయాబెటిక్ న్యూరోపతి
శరీరంలోని వివిధ భాగాలలో నరాలు డయాబెటిస్ ప్రభావం వల్ల దెబ్బతిన్న పరిస్థితినే పరిస్థితినే డయాబెటిక్ న్యూరోపతిగా వ్యవహరిస్తారు. శరీరంలోని కణాలకు గ్లూకోజ్‌ను, న్యూట్రియంట్స్‌ను పంపించడంలో కీలక పాత్ర పోషించే ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా లేనపుడు నరాల వ్యవస్థపై దీని ప్రభావం పడుతుంది. రక్తంలోపేరుకు పోయే హైబ్లడ్ గ్లూకోజ్ వల్ల రక్తనాలు దెబ్బతిని నరాల కణజాలంలో రసాయనిక మార్పులు చోటుచేసుకుంటాయి. దీని వల్ల సంకేతాలను పంపే సామర్థ్యాన్ని కణజాలాలు కోల్పోతాయి. దీర్ఘకాలం పాటు డయాబెటీస్‌తో బాధపడే రోగులలో డయాబెటిక్ న్యూరోపతి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

లక్షణాలు
- అరి చేతులు, పాదాలు మొద్దుబారిపోవడం, మంటలు, సూదులతో పొడుస్తున్నట్లు నొప్పులు ఉంటాయి.
- కొద్ది పాటి వేడిని కూడా చేతులు తట్టుకోలేవు. గోరు వెచ్చని నీరు తగిలినా చేతులు బొబ్బపూక్కినట్లు నొప్పి
- స్థిరంగా ఆలోచించలేకపోవడం
- చేతి వేళ్లు, కాలి వేళ్ళు మొద్దుబారిపోడం
- నొప్పి తెలియకపోవడం, స్పర్శ లేకపోవడం
- డయాబెటిక్ న్యూరోపతి కారణంగా గుండె, రక్తనాళాలు, ఊపిరి తిత్తులు, జీర్ణకోశ వ్యవస్థ, మూత్రనాళాలు, లైంగిక అవయవాలు, స్వేదక్షిగంథులు, కళ్లు వంటి అవయవాలలోని నరాలపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది.

జీర్ణకోశ వ్యవస్థ
గ్యాస్ట్రోపారిసిస్ అనే నరాల సంబంధ వ్యాధి కారణంగా అన్నాశయంలోని నరాల పనితీరులో అవరోధాలు ఏర్పడుతాయి. దీని వల్ల ఆహారం ఆలస్యంగా లేదా అసంపూర్ణంగా జీర్ణం అవుతుంది. అదే గొంతులోని నరాలపై ఇది ప్రభావం చూపినపుడు ఆహారం మింగడం కష్టమవుతుంది. పాంక్రియాస్, మూత్రాశయంలోని నరాలపై కూడా ప్రభావం చూపవచ్చు. దీని వల్ల వాంతులు, వికారం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు వంటి లక్షణాలు ఏర్పడతాయి.

గుండె, రక్తనాళాలు
డయాబెటిక్ న్యూరోపతి కారణంగా గుండె కొట్టుకునే వేగంలో మార్పులు, రక్తవూపసరణలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. చాలా సేపు కూర్చుని ఉన్నట్లుండి లేవడం వల్ల బీపీలో హఠాత్తుగా హెచ్చుతగ్గులు ఏర్పడి కళ్లు తిరగడం, మూర్ఛపోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో దీని వల్ల గుండె ఆగిపోయి మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే కళ్లలోని నరాలు దెబ్బతిన్నప్పుడు చూపు తగ్గిపోతుంది. ఊపిరితిత్తులకు సోకితే శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. లైంగిక పరమైన అవయవాలపై న్యూరోపతి ప్రభావం ఏర్పడితే పురుషులలో అంగస్థంభన సమస్యలు, స్త్రీలలో యోని తేమ తగ్గడం జరుగుతుంది. స్త్రీ పురుషులు ఇరువురిలో లైంగిక వాంఛ తగ్గిపోతుంది.

హోమియో చికిత్స
హోమియో మందులు రక్తంలో చక్కెర, ప్రోటీన్ స్థాయిలనను నియంవూతణలో ఉంచడమే కాక జీవక్షికియను సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. హోమియోవైద్యం ద్వారా డయాబెటిస్‌కి కారకాలైన స్థూలకాయం, హైపర్‌టెన్షన్ వంటి వ్యాధులను సమర్ధంగా నియంవూతించవచ్చు. జెనెటిక్ కాన్ట్సిట్యూషనల్ హోమియో మందుల ద్వారా డయాబెటిక్ సంబంధిత న్యూరోపతి, రెటినోపతి, అల్సర్లు వంటి వ్యాధులను సంపూర్ణంగా నయం చేయవచ్చు. లైకోవంటి వ్యాధులను సంపూర్ణంగా నయం చేయవచ్చు. లైకోపోడియం, ప్లంబమ్‌మెట్, యాసిడ్ ఫాస్, నైట్రిక్ యాసిడ్, పల్సటిల్లా, ట్యూబర్‌కులినమ్, బ్రయోనియా, సల్ఫర్, నాట్రం మురాటికమ్, ఫాస్పరస్ వంటి హోమియో మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే సత్ఫలితాలు ఉంటాయి.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine