ఫీజు కన్నా ప్రాణం ముఖ్యం..

స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజులు...గవర్నర్‌గారు సీరియస్‌గా తన పనిలో ఉన్నారు... ‘మిమ్మల్ని కలవడానికి జైహింద్ బ్యాచ్ పిల్లలు వచ్చారు సర్..’ అంటూ చెప్పాడు అటెండర్... లోపలికి పంపమన్నారాయన... ‘సార్.. మేము ఎంతో కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నాం. కానీ ఇంటర్వ్యూల పేరిట సీట్లు మాకు రాకుండా తమ వాళ్లకి ఇచ్చుకుంటున్నారు. కాబట్టి ఎంట్రన్సు, ఇంటర్వ్యూలు లేకుండా మా మెరిట్‌ని బట్టి మాకు సీట్లు కేటాయించాలి సార్.. మీరెన్ని ఇచ్చినా సరే.. మాకు మాత్రం మెరిట్ సీట్లు కావాలి..’ వినయం, విముఖత కలగలసిన ముఖంతో చెప్తున్నాడు ఆ అబ్బాయి... ఆలోచనలో పడ్డారు గవర్నర్. ఫలితం.. మెరిట్ ప్రకారం సీటు సాధించుకుంది ఆ జైహింద్ బ్యాచ్... జైహింద్ బ్యాచ్ అంటే స్వాతంవూత్యోద్యమంలో పాల్గొన్న బ్యాచ్ అన్నమాట. వాళ్లకోసం అప్పట్లో ఇంటర్ పరీక్షలు కూడా ప్రత్యేకంగా నిర్వహించారు. ఆ బ్యాచ్‌కి నాయకత్వం వహించి, ఎంబీబీఎస్ సీట్లను మెరిట్‌తో సాధించాలన్న ఆ అబ్బాయే ఇప్పటి డాక్టర్ ఎ.కె. చారి... ఆచి కృష్ణమాచారి... పదిహేనేళ్ల వరకు వేదఘోష తప్ప ఏమీ తెలియని ఆయన ఇప్పుడొక పేరున్న సర్జన్. ఇక్కడిదాకా ఎదగడానికి దారిలో ఎన్నో ముళ్లూ.. పూలూ... ఆ దారుల విశేషాలను మనమూ తెలుసుకుందాం.హైదరాబాద్‌లోని ధూల్‌పేట ఒకప్పుడు స్వాతంవూత్యపోరాటాల ప్రాంతం. అలాంటి చోట 1927లో సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలో పుట్టిన డాక్టర్ ఎ.కె. చారి నోటితో వేదమంవూతాలు పఠించడమే కాదు.. తుపాకీ పట్టుకుని ఉద్యమంలోకి కూడా ఉరకగలరు. తుపాకీ పట్టిన చేతితో కత్తి పట్టి చకచకా ఆపరేషన్లు కూడా చేయగలరు.
పదిహేనేళ్ల వయసు వచ్చేవరకు వేదాభ్యాసం చేసినా ఆ తరువాత ప్రతిష్ఠాత్మక సిటీ కాలేజీలో విద్యనభ్యసించారు. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే స్వతంత్ర పోరాటంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. పోరాటయోధుడిగా కొన్నాళ్లు కాలేజీ మానేసి అండర్‌క్షిగౌండ్‌లో కూడా ఉన్నారు. ఆ క్రమంలోనే పోరాటానికి అవసరం అయ్యే ఫైటింగులు, షూటింగులు అన్నీ నేర్చుకున్నారు. లాల్‌బహదూర్ శాస్త్రి, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలతో కలిసి ఉద్యమంలో తిరిగారు. రామానంద తీర్థ, నెల్కోటే, నర్సింగరావు లాంటి ఎందరో నాయకత్వంలో పనిచేశారు. స్వాతంత్య్ర పోరాటంలో రెండు సార్లు ఫైరింగ్ నుంచి తప్పించుకుని మృత్యుంజయుడయ్యారు. ఖాసిం రజ్మీ సారథ్యంలో సాగుతున్న రజాకర్ల అరాచకాలను ఎదిరించారు. ముస్లిం వేషాల్లో వాళ్ల మీటింగులకు వెళ్లి అక్కడి రహస్యాలను తెలుసుకునేవారు. ఆ విషయాలన్నీ గవర్నర్‌తో చెప్పి అప్రమత్తం చేసేవారు. పోలీస్ యాక్షన్ పెట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి కాలేజీ చదువు యథాతథంగా కొనసాగించారు. అలా ఉద్యమం నుంచి తిరిగివచ్చి కాలేజీ కొనసాగిస్తున్నవాళ్లను ప్రత్యేకంగా జైహింద్ బ్యాచ్ అని పిలిచేవాళ్లు. అందుకే ప్రత్యేకంగా పరీక్షలూ నిర్వహించారు. బయాలజీతో ఫస్ట్‌క్లాస్‌లో పాసయింది తను ఒక్కడే కావడంతో మెడిసిన్ చేయడమే తదుపరి లక్ష్యంగా అనుకున్నారాయన.

ఏదైనా రెడీ...
1976-77 సంవత్సరంలో తొలిసారిగా వచ్చిన ఎండోస్కోపీని ఉపయోగించింది ఈయనే. ఎటువంటి జటిలమైన కేసులను కూడా తిప్పి పంపకుండా సాధ్యమైనంత వరకు వాళ్లు ఆనందంగా ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేలా చేసేవారాయన. పడకలు తక్కువ ఉంటే నేలమీద అదనంగా వేయించేవాళ్లు గానీ ఏ కారణం వల్ల కూడా పేషెంటును చేర్చుకోకుండా ఉండలేదు. గ్యాస్ట్రో, కిడ్నీ, మెదడు, ప్లాస్టిక్ సర్జరీ, గ్రహణమొర్రి, స్కిన్ గ్రాఫ్టింగ్... ఇలా ఆయన చేయని ఆపరేషన్ లేదు. గైనకాలజీ సంబంధిత ఆపరేషన్లలో కూడా ఆయన దిట్ట. అందుకే అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) అధ్యక్షులుగా, ఇండియా మెడికల్ అసోసియేషన్ సభ్యులుగా పనిచేశారు. నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ (అప్నా)ను స్థాపించారు. రెండు సొంత నర్సింగ్‌హోమ్‌లలో డాక్టర్లందరూ ఆయన కుటుంబసభ్యులే. కొడుకులు, కోడళ్లు, మనవలు అందరూ డాక్టర్లే. అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ రిట్మైంటు వయసును 55 ఏళ్లకు కుదించడం వల్ల 1985లోనే రిటైరయ్యారు. అపోలోతో పాటు చాలా ఆసుపవూతుల్లో కన్సప్టూంట్‌గా పనిచేశారు.
పోరాడి సాధించుకున్నాం....
‘మేము ఇప్పుడిలా సుఖంగా, సంతోషంగా బతకగలుగుతున్నామంటే దీని వెనుక ఉన్నది మా నాన్నగారి కష్టమే. వారు మా అభివృద్ధి కోసం పడిన తపనే మమ్మల్ని ఇలా నిలబెట్టింది. కులవిద్యలు మాత్రమే కాదు.. ఎదగాలంటే ఇంకా ఏదో నేర్చుకోవాలన్న ఆలోచన కలిగిన నాన్నగారు మమ్మల్ని వేదపా నుంచి మామూలు బడికి మార్చారు. అలా వేదపా కొనసాగి ఉంటే పరమాత్మ సేవలో ఉండేవాడినేమో! కానీ ఇప్పుడిలా ఒక డాక్టర్‌గా ప్రతి పేషెంటులోనూ ఆయన్ని దర్శించగలుగుతున్నా. నాకీ స్థితి కలిగించిన వారికి (నాన్నగారికి) నేను సర్వదా కృతజ్ఞుడిని’ అంటారు డాక్టర్ ఎ.కె. చారి. ‘అప్పట్లో ఎంబీబీఎస్‌లో సీటు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. నిజాం హయాంలో ముస్లింల ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. కాబట్టి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడంతో ఇతరులకు సీటు దొరకడం కష్టమయ్యేది. అందుకే ఈ విషయంలో చాలా కొట్లాడాం. గవర్నర్ దాకా వెళ్లాం. చివరికి ఎంట్రన్సు, ఇంటర్వ్యూలు లేకుండా మెరిట్ ఆధారంగా 20 సీట్లు కేటాయించడానికి అంగీకరించారాయన. ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది. అదృష్టం కొద్దీ 70 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేవాళ్లు. లేకుంటే పౌరోహిత్యం చేసుకునే నాన్నగారికి నన్ను చదివించడం సాధ్యపడేదా? ఆయన కష్టం నన్ను కలచివేసేది. అందుకే నాకు అందే 70 రూపాయల్లో 50 రూపాయలు వారికి ఇచ్చేవాడిని. ఆయన ముఖంలో ఎంతో ఆనందం. ఇంట్లో పరిస్థితి చూసి నాకు ఇంగ్లండులో పీజీ చేయాలన్న కోరికను బలవంతంగా నొక్కి పెట్టేశాను. ఎంబీబీఎస్ అయిన వెంటనే సర్వీసులో జాయిన్ అయిపోయాను..’ అంటూ తన వైద్యవూపస్థానం ఎలా ప్రారంభమయిందో చెప్పుకొచ్చారు డాక్టర్ ఎ.కె. చారి.
కల నెరవేరింది..
మొదటి పోస్టింగ్ జమ్మికుంటలో. ఏదో సాధించానన్న ఆనందం నాలో. అక్కడ ఒకటిన్నరేళ్లు పనిచేశాక సుల్తానాబాద్ పీహెచ్‌సీకి పంపించారు. అక్కడి రోజులు మరిచిపోలేనివంటారాయన. ఉదయం పూట ఆసుపవూతిలో సేవలందించి సాయంత్రం కాగానే ఊళ్లోకి వెళ్లే వాళ్లం. నాతో పాటు ఆయాలు, నర్సులు, వార్డుబాయ్. ఇంటింటికీ వెళ్లి వారి ఆరోగ్య సమాచారాన్ని సేకరించేవాళ్లం. అవసరమైనవాళ్లకి అక్కడే వైద్యసహాయం అందించే వాళ్లం. గర్భవతులకు సలహాలూ, సూచనలూ, అవసరమైన చికిత్సలూ చేసేవాళ్లం. అలా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఆరోగ్య వివరాలన్నీ సేకరించాను. అన్ని గణాంకాలనూ కలిపి ఆసుపవూతిలో ఒక మ్యూజియంలా తయారుచేశాను. ఓసారి ఆసుపత్రి చూడడానికి వచ్చిన హెల్త్ ఆఫీసర్ ఆ మ్యూజియం చూసి ‘డాక్టర్లు ఇలా కూడా పనిచేస్తారా! ఒక డాక్టర్ ఇంతలా అధ్యయనం చేయడాన్ని మొదటిసారి చూశాను’ అన్నాడు. ఆ మెచ్చుకోలు మరువలేనిదంటారు. తరువాత హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్‌కి వచ్చేశాను. అయితే ఇంగ్లండు వెళ్లి ఎఫ్.ఆర్.సి.ఎస్. చేయాలన్న నా కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. నా గురువూ, ప్రొఫెసర్ అయిన డాక్టర్ చలపతిరావును సలహా అడిగితే వద్దని ఇక్కడే ఎంఎస్ చేయమని సలహా ఇచ్చారు. సీటు ఇప్పించారు కూడా. తరువాత అసిస్టెంట్ సర్జన్‌గా గాంధీకి బదిలీ చేశారు. అయిదేళ్ల తరువాత ప్రొఫెసర్‌గా ప్రమోషన్ మీద కర్నూల్ మెడికల్ కాలేజి వెళ్లాను. అక్కడ వార్డెన్‌గా కూడా పనిచేయాల్సి వచ్చింది.
ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పడమే కాకుండా వార్డెన్‌గా డిసిప్లిన్‌ను కూడా నేర్పించాను. తల్లిదంవూడుల కోసం గెస్ట్‌రూమ్‌లు, సినిమాకోసం బయటికెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా వారానికోసారి హాస్టల్‌లోనే సినిమా లాంటివి ఏర్పాటు చేశాను. నేను అక్కడి నుంచి తిరిగివచ్చేటప్పటి దాకా తెలియలేదు వాళ్లు నన్నెంతగా అభిమానించారో. ఒక టీచర్‌గా చాలా ఆనందాన్ని అనుభవించాను’ అంటారు ఆర్ద్ర నేత్రాలతో. ఆ తరువాత హైదరాబాద్ ఉస్మానియాకు ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడే ప్రిన్సిపల్‌గా, డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేశాను. నేను చదువుకున్న చోటే ప్రొఫెసర్ కావాలన్న నా కోరిక తిరిగి హైదరాబాద్ వచ్చాక తీరింది’ అంటారాయన మెరుస్తున్న కళ్లతో.
డబ్బు కాదు.. ప్రాణం ముఖ్యం
వైద్యం ఇంతకు ముందులా లేదంటారాయన. డాక్టర్లే కాదు... పేషెంట్ల తీరులోనూ మార్పు వచ్చిందంటారు. అప్పటివాళ్లకు ఓపిక ఎక్కువ. పేషెంట్లకు కూడా డాక్టర్ చెప్పిందే వేదం. అందుకే రోగిని లోతుగా పరీక్షించి ఏం చెయ్యాలో అన్నీ వివరంగా చెప్పేవాళ్లు. డాక్టర్ ఏ నిర్ణయం తీసుకున్నా బాధ్యత ఆయనమీదే వదిలేసేవాళ్లు పేషెంట్లు. ఇప్పటి పేషెంట్లు ముందుగానే అన్నీ తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి నిర్ణయం పేషెంటుదే. రోగులకు అవగాహన కలగడం మంచిదే కదా. డాక్టర్‌కు కూడా ఎక్కువ వివరించి చెప్పే అవసరం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో రోగికి సరైన న్యాయం జరగ నిజం. ఇటీవల నా దగ్గరికి ఒక పేషెంటు వచ్చాడు. ఎక్కడికి వెళ్లినా చేర్చుకోమన్నార్ట. తీవ్రమైన టెస్టిస్ గ్యాంగ్రిన్‌తో బాధపడుతున్నాడు. టెస్టులు చేస్తే హెచ్‌ఐవి పాజిటివ్ అని తేలింది. మా ఆసుపవూతిలో ప్రత్యేక గది ఏర్పాటు చేశాం. ఇప్పుడు కాస్త కోలుకున్నాడు. ఇలాంటి పేషెంట్లు డబ్బులు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నా వైద్యం చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారో తెలియ బాధగా. ఇప్పుడు అన్ని ఖర్చులూ పెరిగాయి. వాటితో పాటే వైద్యం కూడా. అందుకే పేషెంటు ఆర్థిక స్థితిని బట్టి ఫీజులను పెట్టాను. ఆసుపవూతికి ఫీజు ముట్టిందా లేదా అన్న విషయం కన్నా ఒక ప్రాణం నిలబడిందా లేదా అన్నదే ముఖ్యం కదా అంటారు డాక్టర్ ఎ.కె. చారి.
- రచన ముడుంబై
ఫొటోలు : నాగరాజు
Other News