కళ్లజోడు ఇక వద్దు
అందంగా కనిపించడానికో.. ఎండ నుంచి రక్షణకో, దుమ్ము పడకుండానో గాగుల్స్ వాడటం బాగానే ఉంటుంది. కానీ కళ్లజోడు పెట్టుకుంటేనే సరిగ్గా చూడగలిగే పరిస్థితి ఉంటే మాత్రం చిరాగ్గా ఉంటుంది. సమస్యగా కూడా అనిపిస్తుంది. పెళ్లి కుదరకపోవడానికి ఇదీ ఓ కారణం కావచ్చు. అలాంటి కళ్లజోడు బాధ నుంచి తప్పించే అద్భుత చికిత్సే లేసిక్. యువతకు కళ్లజోడు సమస్యగా మారుతున్నది. మానసికంగా నరకయాతనకు గురిచేస్తుంది. ఒక్కోసారి కళ్లజోడు జీవితం దుర్భరమనిపిస్తుంది. కళ్లజోడు బదులుగా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుందామంటే ఇవి అందరికీ పడకపోవచ్చు. కళ్లజోడు అనేది కేవలం అందానికి సంబంధించిన సమస్య అనుకుంటారు చాలా మంది. కానీ ఇది ఒక సామాజిక సమస్య. కొన్ని రకాల మంచి ఉద్యోగాలు రావాలన్నా సరైన సమయంలో వివాహం కుదరాలన్నా ఈ కళ్లజోడు పెద్ద అడ్డంకుగా నిలుస్తుంది. అంతేగాక దృష్టిలోపం ఉన్న వీరిని తీవ్ర మానసిక వ్యథకు గురిచేస్తుంది. కాబట్టి కళ్లజోడు సమస్యను నివారించడం ఒక సామాజిక అవసరం. అందుకే కళ్లజోడు, కాంటాక్ట్ లెన్స్‌ల నుంచి శాశ్వత విముక్తిని కలిగించడానికి శాస్త్ర పురోగతి ఇచ్చిన వరం జైయాప్టిక్స్.
ఏమిటిది?
కార్నియా పైన మచ్చలు, ఇతర లోపాలను సవరించడానికి రేడియల్ కెరటెక్టమీ అనే శస్త్రచికిత్స చేసేవాళ్లు. దానిలోని సమస్యలను అధిగమించడానికి అందుబాటులోకి వచ్చింది లేసిక్ చికిత్స. దీని ద్వారా లేజర్ కాంతిని ఉపయోగించి కార్నియా పైన ఉండే లోపాలను సరిచేస్తారు. లేసిక్ చికిత్సలోని మరింత సౌకర్యవంతమైన మెరుగైన చికిత్సా విధానమే జైయాప్టిక్స్.
ఎలా చేస్తారు?
జైయాప్టిక్స్ గురించి అర్థం చేసుకోవాలంటే మన కన్ను ఎలా పనిచేస్తుందో తెలియాలి. మన కళ్లు కూడా కెమెరాలాగా పనిచేస్తాయి. కాంతి కళ్లపైన పడినపుడు దాని కిరణాలు కార్నియా ద్వారా ప్రయాణిస్తాయి. మన కంటి ఎదురుగా ఉన్న వస్తువు ప్రతిబింబం రెటీనా పైన పడగానే అక్కడ ఉన్న ఆప్టిక్ నాడి మెదడుకు ఆ సమాచారాన్ని చేరుస్తుంది. ఫోటో నెగెటివ్స్‌ని డార్క్ రూమ్‌లో డెవలప్ చేసినట్టుగా ఈ ప్రతిబింబాన్ని మెదడు డెవలప్ చేసి కనుక్కుంటుంది. ఆ విధంగా మన ఎదురుగా ఉన్న దృశ్యాలను మనం తెలుకోగలుగుతాం. కార్నియాపైన ఏవైనా లోపాలున్నపుడు దాని ద్వారా ప్రయాణించే కాంతి మార్గానికి ఆటంకాలు ఏర్పడుతాయి. కాబట్టి ఏర్పడే ప్రతిబింబం స్పష్టంగా ఉండదు.
ఫలితంగా ఎదుట ఉన్న దృశ్యాన్ని మనం స్పష్టంగా చూడలేం. గతంలోఉన్న ప్రక్రియల ద్వారా ముందు భాగంలో ఉన్న లోపాలను సైతం కనుక్కోగలుగుతాం. ఇందుకు ఉపయోగపడేదే వేవ్‌వూఫంట్ టెక్నాలజి. ఈ పద్ధతి ద్వారా రెండు హీనీ లేజర్ కిరణాలను కంటి లోపలికి పంపిస్తారు. ఇవి ఒకదానికొకటి ఏటవాలుగా, సమాంతరంగా ప్రయాణించి రెటీనా ప్రాంతంలో నిర్దేశించిన ప్రదేశంలో కలుసుకుని కాంతిని పుట్టిస్తాయి. కార్నియా వైపు కంటి బయటకు ప్రయాణిస్తాయి. కాబట్టి ఎక్కడెక్కడ ఏయే లోపాలున్నాయో కనుక్కోవడం సులభం అవుతుంది. ఈ హీనీ లేజర్ కాంతి పుంజాలను లెన్స్‌పూట్స్ అనే అతిచిన్న అల్ట్రామైక్షికోపిక్ కెమెరాలు గ్రహించి వాటిని కంప్యూటర్‌కు పంపిస్తాయి. ఈ కిరణాల తీవ్రతను విశ్లేషించి కంప్యూటర్లు వాటిలోని లోపాలను సరిచేస్తాయి.
ఎవరికి అవసరం?
- అందంతో ముడిపడి ఉండే వివాహ విషయంలో అమ్మాయిలకు ఈ చికిత్స ఉపకరిస్తుంది.
- ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, అగ్నిమాపక దళంలో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి
- స్విమ్మింగ్ వంటి క్రీడల్లో రాణించాలనుకునేవారికి
- టెన్నిస్, క్రికెట్, ఫుట్‌బాల్ వంటి ఏ రకమైన క్రీడాకారులకైనా కళ్లజోడు నుంచి విముక్తిని కలిగించే ఈ చికిత్స ఎంతో ఉపయోగకరం. అయితే అద్భుతమైన ఈ జైయాప్టిక్స్ చికత్సకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. కార్నియా మందం 500 మైక్రానుల కన్నా ఎక్కువగా ఉన్నవారు మాత్రమే జైయాప్టిక్స్ చికిత్స చేయించుకోవడానికి అర్హులు. సాధారణంగా ప్రతి వందకు 20 మందిలో మాత్రమే ఈ సమస్య ఎదురవుతోంది. ఇలాంటి వారి కోసం కంటిలో శాశ్వతంగా అమర్చగలిగే కాంటాక్ట్ లెన్స్‌లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
Other News