అదృష్టం కాదు లోపం
మెల్లకన్ను అదృష్టం అనేది చాలా పాత నమ్మకం. బహుషా అలాంటి దోషం ఉన్న వారిలో ఆత్మన్యూనత పోగొట్టడానికి చెప్పే మాటలు అయి ఉండవచ్చు. కానీ అదే నిజమని ఇప్పటికీ చాలా మంది అదే నిజమనే మూఢనమ్మకంలో ఉన్నారు. అసలు మెల్లకన్ను కూడా కంటిజబ్బేనన్న విషయం చాలా మందికి తెలియదు. అయిదేళ్ల వయసులోపు మెల్లకన్నుకు చికిత్స చేయించుకోకపోతే అదృష్టం సంగతి దేవుడెరుగు, ఉన్న చూపే దెబ్బతినే ప్రమాదం ఉంది.
మనం ఏదైనా వస్తువును చూడాలనుకుంటే మన కంటిపైన కాంతి పడి అది వస్తువు పైన ప్రతిబింభిస్తే దాని ప్రతి బింబం మన కంటో ఏర్పడుతుంది. ఈ విషయాన్ని మొదడు గ్రహించి మన కంటి ముందు ఉన్న దృశ్యం ఏమిటో విద్యుత్ సంకేతాల ద్వారా మనకు తెలుపుతుంది. మనకు చూడ గలిగే శక్తి పుట్టుకతో 40 శాతం మాత్రమే ఉంటుంది. తరువాత మన పరిసరాల్లోని కాంతి కళ్లపైన పడుతూ వాటిని స్టిమ్యులేట్ చేస్తుంది. దాని వల్ల మెల్లమెల్లగా మనకు 5 ఏళ్లు వచ్చే సరికి మన దృష్టి సామర్థ్యం పెరుగుతుంది. అంటే మిగతా 60 శాతం చూడగల శక్తి కాంతి వల్లనే కలుగుతుందన్న మాట. ఉదాహరణకు పుట్టినప్పటి నుంచి వారి కళ్లకు గంతలు కట్టి కాంతి పడకుండా చేస్తే వారి దృష్టి 40 శాతం దగ్గరే నిలిచి పోతుంది. అణుయుద్ధాల్లో విస్ఫోటనాల వల్ల కంటి చూపు దెబ్బతినడానికి కారణం ఇదే.
మెల్ల కన్ను అంటే
కనుగుడ్డు చుట్టూ ఉండే కండరాలుమెదడు అదేశానుసారం కళ్లను అటూ ఇటూ కదిలించడానికి తోడ్పడుతాయి. వీటి పనితీసు దెబ్బతిన్నపుడు మెల్లకన్ను ఏర్పడుతుంది. జన్యులోపాల వంటి కొన్ని కారనాల వల్ల మెదడు ఇచ్చే సంకేతాలను కండరాలు సరిగా గ్రహించలేవు. దాని వల్ల కండరాల్లో ఒకటి అతిగా పనిచేస్తే మరొకటి నెమ్మదిగా పనిచేస్తుంది. ఫలితంగా ఒకకన్ను ఎదురుగా చూస్తే మరొకటి పక్కకు చూస్తుంది. అందువల్ల రెండు రకాల ప్రతిబింబాలు ఏర్పడా మెదడుకు గందరగోళ పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ఏదో ఒక చికవూతాన్ని మాత్రమే మెదడు గ్రహిస్తుంది. రెండవ దాన్ని అణచివేస్తుంది. పదేపదే అణచివేతకు గురయిన ప్రతిబింబం క్రమంగా దృష్టి సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇలా అణచివేయబడిన కన్నును లేజీ ఐ అంటారు.
ఏం చెయ్యాలి
ఐదేళ్ల వయసులోపుగానే లోపాలను గుర్తిస్తే సరియైన సమర్థవంతమైన చికిత్సను అందించవచ్చు. పదేళ్లు దాటితే చాలా వరకు పరిస్థితి చేయిదాటిపోతుంది. జన్యులోపాల వల్ల కలిగే మల్లకన్నును పుట్టిన ఏడాదిలోపు మాత్రమే సరిచేగల అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కంటి పరీక్షలు చేయించడం అత్యవసరం ఇంత చిన్న పిల్లలకు శస్త్రచికిత్స చేయిస్తే ఎలా లే సందేహంతో నిర్లక్ష్యం చేస్తే వయసు పెరిగే కొద్ది దృష్టి లోపాలను సవరించే అవకాశం పూర్తిగా సన్నగిల్లుతుంది. కాబట్టి ఏ చిన్న అనుమానం కలిగినా వెంటనే పరీక్ష చేయించడం మంచిది.
కారణాలు
-వంశపారంపర్యంగా వచ్చే జన్యులోపాలు
-దృష్టిలోపాలు
-కంటిలో శుక్లాలు ఉండడం
-కంటోఏదైనా గుచ్చుకోవడం
-కాన్పు సమయంలో శిశువుకు దెబ్బ తగలడం
చికిత్స
కనుగుడ్డు చుట్టు ఉండే ముఖ్యమైన నాలుగు కండరాల సంకోచ వ్యాకోచాల వల్ల కళ్లను కదల్చగలుగుతాము. కుడి, ఎడమ వైపుల్లో ఉండే కండరాలలో ఒకటి రెండోదాఇనకన్నా అతి చురుకుదనంతో పనిచేయడం వల్లనే అసలు సమస్య ఎదువుతుంది. కాబట్టి తక్కువ చైతన్యం ఉన్నండవ కండరంలో నుంచి కొంత భాగాన్ని తీసి మొదటి కండరానికి అతికిస్తారు. ఫలితంగా చిన్నగా అయిన కండరం పనితీరు మెరుగుపడుతుంది. ఇక అతి చురుగ్గా ఉన్న కండరం పనిని అతికించిన కండరం ముక్క అదుపు చేకస్తుంది. దీని వల్ల కండరాలు మెదడు నుంచి అందే సంకేతాలను సక్రమంగా గ్రహించగలుగుతాయి. అతి సులభంగా ఈ విధమైన శస్త్రచికిత్స ద్వారా మెల్లకన్నును సరిచేయవచ్చు. కొందరిలో రెండుకళ్ల మధ్య భాగం ఎక్కువ విశాలంగా ఉండడం వల్ల మెల్లకన్ను ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నిజానికి అలాంటి లోపం ఏమీ ఉండదు. దీన్ని సూడో స్కీంట్ అంటారు. ఇలాంటపుడు తల్లిదంవూడులకు దీనిపై అవగాహన కల్పించే దిశగా కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది.
Other News